హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదట దూర విద్యను ప్రవేశ పెట్టిన దూర విద్యా పితామహుడు ప్రొ. జి. రామ్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్షిటీలో ఆయన చిత్ర పటానికి ఘనంగా నివాళి అర్పించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపకులపతి ప్రొ.జి. రామ్ రెడ్డి జయంతి సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో “ప్రో.జి. రామ్ రెడ్డి” చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎ. వి. ఎన్. రెడ్డి, ఈ. ఎం. ఆర్. ఆర్. సి. డైరెక్టర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, విద్యార్థి సేవల విభాగం డీన్ డా. బానోత్ లాల్, పరీక్షల నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకట రమణ, డిప్యూటీ డైరెక్టర్ డా. జి. ఎల్లయ్య, యూనివర్సిటీ ఇంజనీర్ ప్రసాద్, పలు విభాగాల అధిపతులు, బోధన మరియు భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, హాజరై ఘనంగా నివాళి అర్పించారు.