హైదరాబాద్ : సమర్ధ పాత్రికేయ, ప్రజాసంబంధాల వృత్తి నిర్వహణలో కృత్రిమ మేథస్సు భాగమైందని పి. ఆర్. సూత్ర వ్యవస్థాపకులు టి. శ్రీకర్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికతను సమర్ధవంతంగా నిర్దారించుకోవాలని సూచించారు. శుక్రవారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగ అధ్వర్యంలో “ప్రజా సంబంధాలు- కృత్రిమ మేధస్సు” అనే అంశంపై వెబినార్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా పిఆర్ సూత్ర వ్యవస్థాపకులు టి. శ్రీకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ప్రజా సంబంధాలలో ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక వేదికలతో సహా వివిధ మీడియా సంస్థలకు పత్రికా ప్రకటనలను రూపొందించడంలో కృత్రిమ మేథస్సు ప్రయోజనాలను వెల్లడించారు. పీఆర్ నిపుణులు కంటెంట్‌ను సమర్థవంతంగా రూపొందించడానికి, పాఠకులను ఆకట్టుకోవడానికి కృత్రిమ మేథస్సు సులభతరం చేసిందని పేర్కొన్నారు. మానవ ధ్రువీకరణ, డేటా గోప్యతను కాపాడటం, ప్రాముఖ్యత వంటి నైతిక అంశాలను చర్చించారు. ఏఐకి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నమ్మకం, విశ్వసనీయతను పీఆర్ నిపుణులు విస్మరించవద్దని సూచించారు. వేగంగా మారుతున్న మీడియా ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా పీ ఆర్ నైపుణ్యతను పెంచుకోవాలి సూచించారు.

కార్యక్రమానికి సామాజిక శాస్త్రాల డీన్ ప్రొ. పల్లవి కబ్డే అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని కృత్రిమ మేధస్సు, అనేక సాంకేతిక పురోగతులు చూపాయని అన్నారు. ప్రజా సంబంధాలు, ప్రకటనలు, మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక మార్పులకు కారణమైందని వెల్లడించారు. మీడియా సంబంధాలు, కంటెంట్, పాత్రికేయ పని పరిస్థితులతో సహా జర్నలిజం కోణాలను మార్పులకు గురిచేసిందని చెప్పారు. వెబినార్ కన్వీనర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్ (ఇంచార్జి) డా. సునీల్ కుమార్ పోతన, సహ కన్వీనర్ డా. యాదగిరి కంభంపాటి, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read-
BRAOU organized Webinar on “Public Relations and Artificial Intelligence”
Hyderabad : Dr. B. R. Ambedkar Open University, Department of Journalism and Mass Communication, organized a webinar on the topic “Public Relations and Artificial Intelligence” on Friday at the University campus. Mr.T.Sreekar Reddy, Founder PR Sutra, Hyderabad participated as the keynote speaker of the event.
He stated that artificial intelligence has become an integral part of effective journalism and public relations. He emphasized that the technology should be used efficiently and with proper verification. Reddy highlighted the benefits of using artificial intelligence in public relations, especially in customizing press releases for various media organizations, including print, electronic, digital, and social platforms. AI has made it easier to create content more effectively and reach audiences with precision.
He stressed the importance of human verification, data privacy, and ethical considerations in maintaining trust and credibility. PR professionals were advised not to overlook the capabilities of AI but to enhance their PR skills in line with the rapidly changing media landscape. Reddy further suggested that AI should be used ethically for opportunities such as speed, efficiency, investigative journalism, data journalism, and fact-checking tools.
Prof. Pallavi Kabde, Dean, Social Sciences, BRAOU presided over the program. Prof.Pallavi who noted that artificial intelligence and many technological advancements have had a significant impact on society. It has caused many changes in public relations, advertising, media, especially social media. It has changed aspects of journalism including media relations, content, and journalistic working conditions. The webinar was convened by Dr. Sunil Kumar Pothana, Assistant Professor, Convener and Dr. Yadagiri Kambhampati as the co-convener. Faculty members, research Scholars and learners were participated.
