హైరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మూడో, రెండో మరియు మొదటి సంవత్సరం (ఓల్డ్ బ్యాచ్) 2016 మరియు అంతకు ముందు బ్యాచ్‌లు విద్యార్థులకు మే 31 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. పి. వెంకట రమణ ఓ ప్రకటనలో తెలిపారు. మూడో సంవత్సరం పరీక్షలు మే 31 నుంచి జూన్ 5 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు జూన్ 7 నుంచి 14 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు జూన్ 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష సమయము మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గంటల వరకు అని పేర్కోన్నారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ మే 10. పరీక్షకు హాజరు కాగోరు విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఫీజును T.S / A.P ఆన్ లైన్ సెంటర్ల ద్వారా లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రంలో లేదా విశ్వవిద్యాలయ కాల్ సెంటర్ : 18005990101 లేదా హెల్ప్ డెస్క్ : 7382929570 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
BRAOU DEGREE (OLD BATCH) EXAMINATIONS FROM MAY 31
Hyderabad : The Dr. B. R. Ambedkar Open University (BRAOU) Under Graduate III, II & I year (B.A/B.Com/B.Sc) (3YDC) examinations for 2016 and earlier batches will be held in the month of May/June. The Degree Third Year Examinations will be held from May 31 to June 5. Second Year Examinations will be held from June 7 to 14 and the First Year examinations will be held from June 16 to 19. The last date for Online registration is May 10. The timings of Examinations are 2:00 p.m to 5:00 p.m daily.
Students are advised to visit the university portal : www.braouonline.in for Examination Registration. The Science students have to pay the Practical Exam fee along with Theory Exam fee as a single payment through T.S/A.P. Online Centres or Debit/Credit card only. For Further details students may contact their concerned study centre or BRAOU Call Centre : 18005990101; , Help Desk : 7382929570
