“నేను సచివాలలయ ప్రారంభోత్సవానికి వెళ్లను”

నేను సచివాలలయ ప్రారంభోత్సవానికి వెళ్లను

అది సెక్రటేరియట్ మాదిరిగా కన్పించడం లేదు

ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసం ఒక వర్గం వాళ్లను సంత్రుప్తిపర్చడానికే కట్టినట్లంది

బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్క్రతికి అనుగుణంగా మార్పులు చేశాకే సచివాలయం వెళతా

నల్లపోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలు… మసీదుకు 5 గుంటలు ఇస్తారా?

తెలంగాణలోని హిందూ సమాజమంతా ఆలోచించాలి

కేసీఆర్ పాలనలో హిందువులంతా బాంచన్ బతుకులు బతకాలా?

ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…

కర్నాటకలో బీజేపీ గెలుపు తథ్యమని ధీమా

అనంతపురంలో ఘన స్వాగతం పలికిన ఏపీ బీజేపీ శ్రేణులు

హైదరాబాద్/చింతామణి : తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి నేను వెళ్లను. ఎందుకంటే అసలు అది సచివాలయం మాదిరిగా లేనేలేదు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఒక వర్గం వారిని సంత్రుప్తి పర్చేందుకే సచివాలయం కట్టారు. మీరంతా ఒక్కసారి సచివాలయం వద్దకు వెళ్లి సెల్ఫీ దిగి చూసుకోండి. బీజేపీ అధికారలోంకి వచ్చిన తరువాత ఎవరు సీఎం అయినా సరే నేను మాత్రం సచివాలయంలో అడుగుపెట్టను. ఎందుకంటే అది సచివాలయంలా లేనేలేదు. ఇండియన్, తెలంగాణ సంస్క్రతి లేనే లేదు. సచివాలయ డోమ్ లను కూల్చివేసి తెలంగాణ సంప్రాదాయలకు అనుగుణంగా పునర్నిర్మించిన తరువాతే వెళతా’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

• కర్నాటకలోని చింతామణి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన బండి సంజయ్ కుమార్ అనంతపురంలో తొలుత ఎస్సీ మోర్చా నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి అనంతపురం పట్టణంలోకి అడుగుపెట్టగానే బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని బాణాసంచా పేల్చి జై బీజేపీ..జైజై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు…

• కర్నాటక రాష్ట్రంలో బీజేపీకి మళ్లీ అధికారం తథ్యం, ఎవరెంత దుష్ప్రచారం చేసినా గెలిచేది బీజేపీనే. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పలేని పరిస్థితి. పైగా ఢిల్లీలో, గల్లీలో అధికారంలో లేని పార్టీ. కర్నాటకను ఏ విధంగా అభివ్రుద్ధి చేయగలదు?

• కర్నాటకను ఏటీఎంలా వాడుకోవడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. కర్నాటకలో అధికారంలోకి వస్తే అక్కడి సొమ్మునంతా దేశమంతా ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చనేది ఆ పార్టీ ఆలోచన. తెలంగాణలో కేసీఆర్ కూడా ఇంతే. తెలంగాణలో కేసీఆర్ గెలిచాక జాతీయ పార్టీ పేరుతో ఇక్కడ దోచుకున్నంత సొమ్మునంత దేశంలో ఎన్నికల్లో ఖర్చు చేస్తూ లీడర్లను చేర్చుకునే పనిలో ఉన్నరు.

• అయితే కర్నాటకలో మాత్రం వచ్చేది కాషాయ ప్రభుత్వమే. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన తరువాత వాతావరణం మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. కర్నాటక ప్రజలు బొట్టు తుడిచేసుకునేవాళ్లకు అధికారం ఇవ్వరు. మోదీని విష సర్పమని కించపర్చే వాళ్లను, ఒక వర్గం కోసం బొట్టును తుడిచేసుకునే వాళ్లను సహించరు.

• (తెలంగాణలో నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి వెళతారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు) ఆహ్వానం వచ్చినా ఆ సచివాలయానికి నేను వెళ్లను. ఎందుకంటే ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే ఒక వర్గం వారి ఓట్లను సంత్రుప్తి పర్చేందుకే సచివాలయం కట్టారు. అసలది సచివాలయం మాదరిగా ఉందా? ఒక్కసారి వెళ్లి సెల్ఫీ దిగి చూసుకోండి.

• బీజేపీ అధికారలోంకి వచ్చిన తరువాత కూడా ఎవరు సీఎం అయినా సరే నేను మాత్రం సచివాలయంలోకి అడుగుపెట్టను. సచివాలయం పైనున్న డోమ్ లను కూల్చివేసి తెలంగాణ సంప్రాదాయలకు అనుగుణంగా పునర్నిర్మించిన తరువాతే సచివాలయం వెళతాను.

• సచివాలయంలో నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసిన మూర్ఖుడు కేసీఆర్. అక్కడ మసీదుకేమో 5 గుంటల స్థలమిచ్చాడు. 80 శాతమున్న హిందువులున్న ఆలయానికేమో రెండున్నర గుంటల జాగా ఇస్తారా? తెలంగాణ హిందూ సమాజం ఆలోచించాలి. కేసీఆర్ పాలనలో బాంచన్ బతుకులు బతకాలా? అట్లాంటి సచివాలయానికి పోయినా ఒకటే పోకపోయినా ఒకటే.

• దళిత, గిరిజన, బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న పార్టీ బీజేపీ మాత్రమే. దళితుడిని రాష్ట్రపతి చేశాం. గిరిజన మహిళకు రాష్ట్రపతిని చేసినం. 27 మంది బీసీలను కేబినెట్ మంత్రులను చేసినం. 12 మంది ఎస్సీలకు మంత్రి పదవులిచ్చాం. అంబేద్కర్ స్పూర్తితో ముందుకు వెళుతూ దళిత, గిరిజన, వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి పాల్పడే ప్రభుత్వం నరేంద్రమోదీదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X