“నిజాం బానిస మరకలను తుడిచేద్దాం”

2047@ అభివ్రుద్ధి చెందిన దేశంగా భారత్

  • అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
  • దిగుమతి నుండి ఎగుమతి చేసే స్థాయిలో భారత్
  • 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ లో అభివ్రుద్ధి జరుగుతోంది
  • అభివ్రుద్ధి, శాంతి మంత్రంతోనే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు
  • పవర్ ఫుల్ యూత్ ఇండియా సొంతం
  • మమ్మీ, డాడీ సంస్క్రతి మనకొద్దు
  • దేశ వారసత్వ సంపదను కాపాడుకుందాం
  • నిజాం సమాధివద్ద మోకరిల్లే పార్టీలకు బుద్ది చెబుదాం
  • నిజాం బానిస మరకలను తుడిచేద్దాం
  • ఎన్ వై కే యూత్ ఉత్సవ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్

హైదరాబాద్ : ‘‘గత 75 ఏళ్లుగా చూస్తున్నాం. ఎఫ్పుడు చూసినా భారత్ అభివ్రుద్ధి చెందుతున్న దేశమనే చెబుతున్నం. కానీ మోదీగారు చరిత్రను తిరగరాయబోతున్నరు. 2047 నాటికి భారత్ ను అభివ్రుద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భారత్ ను విశ్వగురు స్థానంలో పెట్టడమే మోదీ స్వప్నం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అందులో భాగంగా దేశ అభివ్రుద్దిలో అత్యంత కీలకమైన యువతలోని నేపుణ్యాన్ని వెలికితీసేందుకు పంచ్ ప్రాణ్ పేరుతో ఐదు ముఖ్యాంశాలతో ‘‘యువ ఉత్సవ్’’ నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

ఈరోజు కరీంనగర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు ఎన్ వై కే రాష్ట్ర డైరెక్టర్ ఏ.ఆర్.విజయ రావు, జిల్లా లీడ్ మేనేజర్ ఆంజనేయులు, జిల్లా యువజన,క్రీడల అధికారి కె. రాజవీరు, కళాశాల అధినేత సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ‘‘పంచ్ ప్రాణ్’’ పేరుతో 5 అద్బుత లక్ష్యాలతో ఈ యువ ఉత్సవ్ నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. దేశభక్తి, సంస్క్రుతి సాంప్రదాయాలతోపాటు యువతలోని నైపుణ్యాలను వెలికితీసి దేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు ఈ యువ ఉత్సవ్ ఎంతో ఉపయోగపడుతోంది.

• అందులో భాగంగా భారత దేశాన్ని అభివ్రుద్ధిని చెందిన దేశంగా తయారు చేయడమే లక్ష్యంగా మోదీ నిరంతరం శ్రమిస్తున్నారు. మన తాత, తండ్రుల నుండి ఇప్పటి వరకు మన పుస్తకాల్లో ‘‘భారత దేశం అభివ్రుద్ధి చెందుతున్న దేశం’’మనే ఉంటోంది. మరి అభివ్రుద్ధి చెందిన దేశంగా ఎప్పుడు తయారు కావాలి? అదే లక్ష్యంతో మోదీగారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (75 ఏళ్ల ఉత్సవాలు) నుండి అమృత్ కాల్ (శతాబ్ది ఉత్సవాల మధ్యకాలం) నాటికి అంటే 2047 నాటికి భారత్ ను పూర్తిస్థాయిలో అభివ్రుద్ధి చెందిన దేశంగా మార్చబోతున్నరు. మన దేశం ప్రపంచంలోనే ఆర్దికంగా 5 స్థానంలో ఉన్నం… మరో మూడేళ్లలో 3వ స్థానానికి చేరబోతున్నాం.

• మన దేశ సంస్క్రుతి, సార్వభౌమత్వంపై దాడి చేసి మన సంపదను కొల్లగొట్టిన వాళ్ల పేర్ల మీద ఢిల్లీ వీధుల్లో తుగ్లక్ రోడ్, ఔరంగజేబు రోడ్ అంటూ వీధులున్నాయ్. ఆ పేర్లను తొలగించడమే కాకుండా బానిస భావ జాలం నుండి దేశాన్ని, ప్రజలను విముక్తి కలిగించేందుకు మోదీ ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తున్నారు. నావికా దళం జెండాపై సెయింట్ జార్జ్ లూయీస్ పేరుతో ఉన్న సింబల్ ను 75 ఏళ్లుగా వాడే వాళ్లం. నరేంద్రమోదీ వచ్చాక ఛత్రపతి శివాజీ రాజముద్రను పెట్టారు. తెలంగాణ ప్రజలను బట్టలిప్పి బతకమ్మలాడించిన నిజాం రాజు సమాధి వద్ద మోకరిల్లే పార్టీలు మనకు అవసరమా? దీనిని ప్రశ్నిస్తే మతతత్వవాదులనే ముద్ర వేస్తున్నారు.

• జాతీయ ఐక్యతను కాపాడుకోవాలి. కోవిడ్ వచ్చినప్పుడు జాతి ఐక్యత ఏందో ప్రపంచానికి చూపించాం. కరోనా వ్యాక్సిన్ కనుగొని 150 దేశాలకు సరఫరా చేసి ప్రాణాలను కాపాడుకున్నాం. ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఘర్షణలను ఎలా కట్టడి చేశారో, అక్కడ ఇప్పుడు యువత అభివృద్ధి చెందుతున్న తీరును గమనిస్తే మీకే అర్ధమైతుంది. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ నాయకత్వం వహించడం మనందరికీ గర్వకారణం.

• ప్రతి ఒక్కరిలో దేశంపట్ల బాధ్యతను గుర్తు చేయాలి. దేశం నాకేం ఇచ్చిందనే దానికంటే నేను దేశానికి ఏం చేస్తున్నానని ఆలోచించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు.. బతికినన్నాళ్లు ఏం చేశామన్నదే ముఖ్యం. సమాజానికి మంచి పని చేయాలి. గాంధీ, అంబేద్కర్, శివాజీ లాంటి వాళ్లు మంచి చేశారు కాబట్టే వాళ్ల విగ్రహాలు ఊరూవాడా వెలిశాయి. మనం కూడా చనిపోయినా మన విగ్రహాం ఊరూవాడా పెట్టే గొప్ప పని చేయాలి. అప్పుడు మన జీవితానికి సార్ధకత. దేశంపట్ల, సమాజంపట్ల నా బాధ్యత ఏమిటని ఆలోచనను యువతలో పెంపొందించేందుకు ఈ యువ ఉత్సవ్ ఎంతగానో ఉఫయోగపడుతోంది.

• మమ్మీ-డాడీ, ఆంటీ-అంకుల్ సంస్క్రుతి మనది కాదు. దేశ వారసత్వ సంస్క్రుతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ భారత సంస్క్రుతిని ఫాలో అవుతున్నయ్. యోగా పూర్వీకులు ఇచ్చిన అద్బుత వరం యోగా. గొప్ప ఆరోగ్య ఆయుధం. గతంలో యోగా చేసే వారిపట్ల చులకన భావం ఉండేది. మోదీ గారు వచ్చాక యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఐక్యరాజ్యసమితిలో 190 దేశాలను ఒప్పించి ‘‘అంతర్జాతీయ యోగా దినం’’ ప్రకటించేలా చేశారంటే అది మోదీ గొప్పతనమే.

• ఈ దేశానికి చాలా మంది ప్రధానులు పని చేశారు… కానీ నరేంద్రమోదీ గారు మాత్రమే విద్యార్థులతో, యువతతో నేరుగా మాట్లాడే ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు. ‘‘పరీక్షా పే చర్చ’’ పేరుతో టెన్షన్ పడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం కల్పిస్తున్నారు. మార్కులు, ర్యాంకులే కాదు.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వెలికితీసి యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా మోదీగారు ఇట్లాంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. భారత్ ను విశ్వగురు స్థానంలో నిలిపేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. మోదీ తల్లి చనిపోతే అంత్యక్రియలకు హాజరైన వెంటనే అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తద్వారా భారతదేశమే నా తల్లి అని నిరూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X