Hyderabad:
BREAKING
నిర్మల్ పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం చౌరస్తా హాజరైన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగ పాఠం వివరాలు…
“ప్రజా సంగ్రామ యాత్రలో నేను నడుస్తున్నా… నన్ను నడిపిస్తున్నది మాత్రం పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి నే మీలో జోష్ చూసిన తర్వాత, నిర్మల్ సంగతేందో చూద్దామనిపిస్తుంది. బిజెపి కార్యకర్తలు దమ్మేంటో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలీదా? టైం, డేట్, ప్లేస్ చెప్పి మరీ… పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ జరిపి, మనమేంటో చూపించాం. బైంసా(మహిషా) మనదే. పచ్చ(ఎంఐఎం) జెండాకు ఎక్కడా ఎగిరే అవకాశమే ఇవ్వం బిడ్డా.
రానున్న రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే
కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది
కేసీఆర్ బిడ్డ కవితను అరెస్టు చేయాల్నా…? వద్దా?
బిడ్డకు నోటీస్ రాగానే… trs కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టైర్లు కాలబెట్టాలి అంట
కచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి చిప్ప కూడు తప్పదు
ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తెచ్చిన 317 జీవో కు వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్లిన
దందాలు చేసి బండి సంజయ్ జైలుకు పోలేదు
దేశం కోసం, ధర్మం కోసం, నా హిందూ సమాజం కోసమే జైలుకుపోయిన
లక్ష కోట్లు పెట్టి దొంగ దందా చేశారు
కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తారంటే… మళ్లీ ఉద్యమం చేయాలంట? కేసీఆర్ కు సిగ్గుండాలి
కేసీఆర్ ను ఎవరూ కాపడలేరు
కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం
అవినీతిపరులను జైళ్లకు పంపే ప్రభుత్వమే… నరేంద్ర మోడీ ప్రభుత్వం
నిజాయితీగా పనిచేసే ఏ ఒక్క వ్యాపారస్తులపైన అయినా సిబిఐ, ఈడి దాడులు జరిగాయా?
లంగ దందాలు, దొంగ దందాలు చేసి, అవినీతికి పాల్పడే వాళ్లపై దాడులు చేయాలా… వద్దా?
పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా… ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
పాదయాత్రను అడ్డుకునేందుకు పర్మిషన్ల పేరుతో ఇబ్బంది పెడుతుంటే… కోర్టు ద్వారా అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తున్నాం
కోర్టుల ద్వారా అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తున్నామంటే… ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అవుతుందో ప్రజలు ఒకసారి గమనించాలి
గడీల పాలనను అంతం చేయడానికి బిజెపి ముందుకొచ్చింది
నమ్మి రాష్ట్రాన్ని అప్పజెప్పితే… రాష్ట్రాన్ని దివాళా తీసి, ప్రజలను మోసం చేస్తున్నాడు
నిరుద్యోగులను మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్
రైతు రుణమాఫీ చేయడు
రైతుబంధు పేరుతో రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలను ఎత్తేశాడు
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నాడు
విద్యార్థులకు పొమ్మనలేక పొగ పెడుతున్నాడు
స్కావెంజర్లను తీసేసిండు
రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చిండు
ఈరోజు 4వ తారీఖు వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి
పుట్టబోయే బిడ్డ నెత్తిపైనా లక్ష రూపాయల అప్పు పెట్టిండు
కేంద్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లాకు వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది
ఈ ప్రాంతంలో ఉన్న ‘అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల’ ప్రాజెక్టు పేరును మార్చి, కాళేశ్వరం ప్రాజెక్టు పేరును తెరమీదకు తెచ్చిండు
అంబేద్కర్ పేరు ఇష్టం లేకనే ఆ ప్రాజెక్టు పేరును మార్చిండు
వరదలకు కాళేశ్వరం పంపులను ముంచి, 1000 కోట్లు నష్టం తెచ్చిండు
ఇక్కడి కంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంగతి పక్కా చూస్తాం
నీ అవినీతి సొమ్మును పక్కా కక్కిస్తాం
ఇన్ని కబ్జాలు చేస్తారా?
ఇక్కడ భూములు, చెరువులను కబ్జా చేసింది ఎవరో మీకు తెలుసు
జనవరి 10 లోపు మున్సిపల్ కార్మికుల దగ్గర తీసుకున్న డబ్బులను.. వాళ్లకి తిరిగి ఇవ్వకపోతే… బిజెపి చేసే పోరాటాన్ని మీరు తట్టుకోలేరు
ఇక్కడ దళిత బంధు, మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి లంచం కింద పైసలు ఇవ్వాల్సిందేనా?
40% డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆ ఒక్క వర్గానికే ఎందుకు ఇస్తున్నారు?
80% ఉన్న హిందువులకు ఎందుకు ఆపుతున్నారు?
ఆ ఒక్క వర్గానికి 40% ఇండ్లు ఇస్తారా?
‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద తెలంగాణకు మోడీ 2,40,000 ఇండ్లను మంజూరు చేశారు
ధర్మం కోసం పనిచేసే సైకోను నేను
పేదలకు ఇవ్వకుండా ఎవడికైతే డబుల్ బెడ్ రూములు ఇచ్చారో… పక్కా మా ప్రభుత్వం వచ్చాక, వాటిని స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతాం
ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. ఇక్కడికి బుల్డోజర్ పట్టుకొస్తాను
తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని బుల్డోజర్లు కావాలో… ఇక్కడ కంత్రి మంత్రి చేసిన కబ్జాలకు అన్ని బుల్డోజర్ కావాలి
మినీ స్టేడియంలో ఎవ్వడైనా ఒక్క గజం జాగా కబ్జా చేస్తే… పక్కా వీపి పగలగొడతాం
ఈ వర్గం, ఆ వర్గం అన్న తేడా లేకుండా … స్వచ్ఛ భారత్ మిషన్ కింద, రైతు సమ్మాన్ నిధి కింద అందరికీ సమానంగా ఇస్తున్నాం
బీహార్ లో 12% ఉన్న ముస్లిం(ఎంఐఎం పార్టీ)లకు… అక్కడ 4 అసెంబ్లీ స్థానాలు ఎలా వచ్చాయి?
మరి 80% ఉన్న హిందువులంతా ఏకమైతే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా?
‘లవ్ జిహాద్’ పేరుతో… ఎవరైతే నా హిందూ అమ్మాయిలను వేధిస్తే.. వారి అంతు చూస్తాం
మహిళలను కాపాడేది బిజెపి ప్రభుత్వమే
కేరళలో క్రైస్తవ అమ్మాయిలను ఎత్తుకెళ్లి, లవ్ జిహాద్ పేరుతో చంపుతుంటే… క్రైస్తవ సంఘాలు మాట్లాడకుండా ఎక్కడికి పోయాయి?
త్రిబుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలకు విడాకులు ఇస్తుంటే… ముస్లిం సంఘాలు మాట్లాడకుండా ఎక్కడికి పోయాయి?
ఢిల్లీలో శ్రద్ధా కపూర్ ను 34 ముక్కలు చేసి చంపింది ఎవడో మీకు తెలియదా?
కుహనా సెక్యూలర్ వాదులు ఎక్కడికి పోయారు?
తెలంగాణలో హిందువులకు గల్లా ఎగరేసుకుని చెప్పే పరిస్థితి రావాలా…? పచ్చ బిచ్చపు బతుకు కావాల్నా?
దేవుడుని ఎవరూ చూడలేదు… మరి దేవుడు ఉన్నాడా లేడా?
ఎవరికి భయపడే వ్యక్తిని కాను. ధర్మం కోసం మాత్రమే పని చేస్తాం
ధర్మం కోసం నక్సలైట్ల చేతిలో చనిపోయిన వ్యక్తులు బిజెపి వాళ్ళు
ఇవాళ మహబూబ్నగర్ లో ముఖ్యమంత్రి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదని కేసీఆర్ మాట్లాడుతాడు?
అసలు ఎవరు స్వేచ్ఛగా రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదో ప్రజలకు తెలియదా?
కృష్ణా జలాల్లో తెలంగాణ కు హక్కుగా 575 టీఎంసీ లు రావలసి ఉండగా… 299 టీఎంసీ లకే సంతకం పెట్టి, మన వాటాకు గండి కొట్టిన ద్రోహి కేసీఆర్
కేంద్ర వైఖరి వల్ల తెలంగాణ నష్టపోయింది 40 వేల కోట్లు అని మొన్న అన్న కేసీఆర్ …ఇవాళ 3 లక్షల కోట్లు అంటున్నాడు
కెసిఆర్ కు తనమీద తనకే క్లారిటీ లేదు
కెసిఆర్ చెప్పేవన్ని అబద్ధాలే
1400 మంది పేదోళ్లు ఆత్మబలిదానం చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
పేదోళ్లు చనిపోతే… పెద్దోడు రాజ్యమేలుతున్నాడు
మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సుష్మ స్వరాజ్ మద్దతు తెలిపితేనే… ఈరోజు కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష, యాక్టింగ్ చేసిండు
తెలంగాణ ద్రోహి కేసీఆర్
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలను చంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు కేసీఆర్. తెలంగాణ లో రంగురంగుల జెండాలకు స్థానం లేదు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరిగితేనే… తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి గడీలను బద్దలు కొట్టే పార్టీ బీజేపీ పార్టీనే. కేసీఆర్ గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి రాలిని చేద్దాం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం.నిలువ నీడలేని పేదలకు తప్పకుండా పక్కా ఇల్లు నిర్మిస్తాం. పంట నష్టపరిహారం కింద రైతులకు ‘ఫసల్ బీమా యోజన’ను పూర్తిగా అమలు చేస్తాం. ప్రజలకు అవసరమైన, మంచి జరిగే… ఏ పథకాన్ని బీజేపీ ఆపదు. ఇంకా మెరుగ్గా అమలు చేస్తాం. కెసిఆర్ కు కండకావరం తలకెక్కింది. కెసిఆర్ అహంకారాన్ని నేలకు దించుదాం
వచ్చేది బిజెపి ప్రభుత్వమే”
రమాదేవి, నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు:
తెలంగాణలో నియంతృత్వ, అవినీతి, అరాచక, కుటుంబ పాలన కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలో టిఆర్ఎస్ నాయకుల ఆగడాలు ఎక్కువైపోయాయి. పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలను కూడా దొంగతనంగా మంత్రి కలెక్టర్ కలిసి అమ్ముకుంటే… కోర్టుకు వెళ్లి, వాటిని ఆపించిన ఘనత బిజెపి. నిర్మల్ జిల్లాలో అవినీతి, అరాచకాలు ఆగాలంటే… బిజెపి జెండా ఎగరాల్సిందే.
“బిజెపి బహిరంగ సభ @ నిర్మల్ టౌన్ శివాజీ చౌక్”
డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ & రాష్ట్ర ఉపాధ్యక్షుడు:
కేసీఆర్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీయడం, ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత… ప్రజల్లో ఆశలు మొదలయ్యాయి. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేస్తోంది. బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా… సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి.
“ప్రజా సంగ్రామ యాత్ర” పేరుతో… ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే, పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రను పూర్తి చేసాం. కేసీఆర్ సర్కార్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మూడో విడత పాదయాత్రలో అడుగడుగునా అడ్డంకు సృష్టించి బండి సంజయ్ ని అరెస్టు చేస్తే కోర్టు అనుమతితో పాదయాత్రను పూర్తి చేసాం. ఇక్కడ కూడా పాదయాత్రలో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే… కోర్టు అనుమతితోనే పాదయాత్ర చేస్తున్నాం. పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా… తండోపతండాలుగా ప్రజలు తరలివస్తున్నారు.
పాదయాత్ర ఇప్పటివరకు 110 రోజులు పూర్తి చేసుకుంది… 1250KM నడిచి, నిర్మల్ పట్టణానికి చేరుకుంది.
నిర్మల్ టౌన్ లోని ఈద్గాo గ్రామ్ చౌరస్తా వద్దకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర. ఈద్గాo చౌరస్తా వద్ద బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు. బండి సంజయ్ పై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్న యువత. బండి సంజయ్ నీ భుజాలపై ఎత్తుకుని కాసేపు పాదయాత్రలో నడిచిన, స్థానిక కార్యకర్తలు.
“నిర్మల్ లో భారీగా ట్రాఫిక్ జామ్”
బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో… నిర్మల్ టౌన్ లోని శివాజీ చౌక్ నుంచి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ‘శివాజీ చౌక్’ కు భారీ ఎత్తున తరలివచ్చిన కాషాయ దండు. భారీ జన సందోహం నడుమ పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్. ‘నేల ఈనిందా…’ అన్నట్టుగా తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు. పాదయాత్రలో బండి సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్న యువత.
Breaking
“కాషాయమయమైన నిర్మల్ టౌన్”
ఎటు చూసినా… బిజెపి కార్యకర్తలతో నిండిపోయిన నిర్మల్ టౌన్. బండి సంజయ్ రాకకై, నిర్మల్ టౌన్ లోని ‘శివాజీ చౌక్’ వద్ద ఎదురుచూస్తున్న వేలాదిగా తరలివచ్చిన బిజెపి శ్రేణులు. ఎక్కడికక్కడ భారీ గజమాలతో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక బిజెపి కార్యకర్తలు. గల్లీగల్లీలో బోనమెత్తి, బండి సంజయ్ కి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు. బండి సంజయ్ ని చూసేందుకు ఇప్పటికే పాదయాత్ర మార్గంలో బిల్డింగ్ లపైకి ఎక్కిన చిన్నపిల్లలు.
ఫుల్ జోష్ లో బీజేపీ శ్రేణులు
కాసేపట్లో ‘విజయ హై స్కూల్’ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న బండి సంజయ్
BREAKING
నిర్మల్ టౌన్ లోని విజయ హై స్కూల్ నుంచి లంచ్ అనంతరం ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. భారీ జన సందోహం నడుమ పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్. బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ… తమ అభిమానాన్ని చాటుకుంటున్న నిర్మల్ బిజెపి కార్యకర్తలు. నిర్మల్ లోని పలు ప్రధాన కూడళ్ల వద్ద, భారీ గజమాలలతో…. ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు. బండి సంజయ్ కి ఎక్కడికక్కడ బోనాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు. బండి సంజయ్ కి హారతులు పట్టి ఆశీర్వదిస్తున్న ఆడపడుచులు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో… ఫుల్ జోష్ లో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. కాసేపట్లో శివాజీ చౌక్ వద్దకు చేరుకుని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్. ఇప్పటికే శివాజీ చౌక్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు.
5వ విడత పాదయాత్రలో భాగంగా… విద్యార్థులు, యాజమాన్యం కోరిక మేరకు నిర్మల్ టౌన్ లోని “విజయ హై స్కూల్” ని సందర్శించిన బండి సంజయ్. బండి సంజయ్ తో వన్ టు వన్ మాట్లాడిన పలువురు విద్యార్థులు. బండి సంజయ్ కి తమ ఇష్టాఇష్టాలతో పాటు, తాము ఏం కావాలనుకున్నది చెప్పిన విద్యార్థినులు. అనంతరం బండి సంజయ్ తో ఫోటోలు దిగిన స్కూల్ విద్యార్థులు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు కీలక సూచనలు చేసిన బండి సంజయ్. విద్యార్థులను ఉద్దేశించి మీరే రేపటి దేశ భవిష్యత్తు అన్న బండి సంజయ్. ఇప్పటి నుంచే సమాజం పట్ల అవగాహనతో ఉండాలని విద్యార్థులకు బండి సంజయ్ సూచన. విద్యార్థినిలు సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవాలని చెప్పిన బండి సంజయ్. చదువుతోపాటు ఆటల్లో కూడా బాగా చురుగ్గా ఉండాలని సూచన. మీకందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అన్న బండి సంజయ్.
నిర్మల్ జిల్లా వెంగాపేట్ గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. వెంగాపేట్ గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు. పాదయాత్రలో భాగంగా… రైతులు నిరుద్యోగులు, కూలీలు, వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ… తమ కష్టాలను అడిగి తెలుసుకుంటూ… వారికి భరోసా కల్పిస్తూ… ముందుకు సాగుతున్న బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగట్టడంలో సక్సెస్ అయిన బండి సంజయ్. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల వివరాలను ప్రజలకు వివరించడంలోనూ సఫలీకృతమైన బండి సంజయ్. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో.. ఎలాంటి నీతివంతమైన, పారదర్శక పాలన అందిస్తామో పూసగుచ్చినట్టు వివరిస్తూ… ప్రజలకు చెప్పడంలోనూ బండి సంజయ్ గ్రాండ్ సక్సెస్.
BREAKING
7వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. నిర్మల్ టౌన్ లోని మంజులాపూర్ వార్డ్ లోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. మంజులాపూర్ వార్డులో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు. బాణసంచా కాలుస్తూ… బండి సంజయ్ కి స్వాగతం పలికిన యువత. బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ… రోడ్డుకు ఇరువైపులా నిలబడి, స్వాగతం పలుకుతున్న స్థానిక బిజెపి కార్యకర్తలు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో కోలాహాలంగా సాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. మంజులాపూర్ వార్డులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన బండి సంజయ్. ఛత్రపతి శివాజీ ధీరత్వం మనందరికీ స్ఫూర్తిదాయకం – బండి సంజయ్. రాజ్యపాలనలో ఛత్రపతి శివాజీ సేవలు వెలకట్టలేనివి.
నమ్ముకున్న వాళ్ళను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న గొప్ప పాలనాదక్షుడు శివాజీ – బండి సంజయ్
BREAKIN
“నిర్మల్ టౌన్ లో దుమ్ములేపుతున్న కాషాయదళం”
బండి సంజయ్ నామస్మరణతో మార్మోగుతున్న నిర్మల్ టౌన్. బండి సంజయ్ పాదయాత్రలో… బండి సంజయ్ తో కలిసి నడుస్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. భారీ జన సందోహం నడుమ కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. బండి సంజయ్ పై అభిమానంతో… బండి సంజయ్ ని తమ భుజాలపై ఎత్తుకుని, పాదయాత్రలో నడుస్తున్న నిర్మల్ జిల్లా కార్యకర్తలు
7వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. నిర్మల్ టౌన్ లోని మంజులాపూర్ వార్డ్ లోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. మంజులాపూర్ వార్డులో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు. బాణసంచా కాలుస్తూ… బండి సంజయ్ కి స్వాగతం పలికిన యువత, బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ… రోడ్డుకు ఇరువైపులా నిలబడి, స్వాగతం పలుకుతున్న స్థానిక బిజెపి కార్యకర్తలు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో కోలాహాలంగా సాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర.
నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. చిట్యాల గ్రామంలో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. హారతులు పట్టి స్వాగతం పలికిన ఆడపడుచులు. బండి సంజయ్ పై పూలవర్షం కురిపిస్తూ..తమ అభిమానాన్ని చాటుకుంటున్న చిట్యాల బీజేపీ కార్యకర్తలు.
BREAKING
7వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. నిర్మల్ జిల్లా చిట్యాల సమీపంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. చిట్యాల, వెంగపేట్, ఈద్గామ్ క్రాస్ రోడ్, శివాజీ చౌక్ నిర్మల్. శాంతినగర్ పీవీ విగ్రహం మీదుగా కండ్లి వరకు కొనసాగనున్న పాదయాత్ర. ఈరోజు మొత్తం 11:30 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర. ఇవాళ కండ్లీ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస.
నిర్మల్ జిల్లా చిట్యాల సమీపంలోని రాత్రి శిబిరం వద్ద బండి సంజయ్ ని కలిసిన చిన్నారులతో కూడిన 20 కుటుంబాలు. బండి సంజయ్ పై ప్రేమ, అభిమానంతో తమకు బండి సంజయ్ ని కల్పించాలని తమ పేరెంట్స్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చిన చిన్నారులు. ఈ విషయం బండి సంజయ్ దృష్టికి తెచ్చిన పలువురు బిజెపి నేతలు.
దీంతో… ఆ 20 కుటుంబాలకు చెందిన చిన్నారులకు… తనను కలిసే అవకాశం ఇచ్చిన బండి సంజయ్. బండి సంజయ్ ని కలిసి ఎంతో ఆనందానికి లోనైనా చిన్నారులు. అరగంట పాటు వారితో ప్రత్యేకంగా ముచ్చటించిన బండి సంజయ్. బండి సంజయ్ తో తమకు సంబంధించిన ఇష్టాలను చెప్పుకున్న చిన్నారులు. చిన్నారుల చదువు, ఆటలు, అభిరుచులకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్. బండి సంజయ్ తో వ్యక్తిగతంగా తమ పేరును పరిచయం చేసుకుని, కుటుంబాలతో కలిసి, ఫోటోలు దిగిన చిన్నారులు.
Breaking
ఇవాళ నిర్మల్ జిల్లా సిర్గాపూర్ శివారులోని రాత్రి బస క్యాంపు నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర. చిట్యాల, వెంగపేట్, ఈద్గామ్ క్రాస్ రోడ్, శివాజీ చౌక్ నిర్మల్, శాంతినగర్ పీవీ విగ్రహం మీదుగా కండ్లి వరకు కొనసాగనున్న పాదయాత్ర. ఈరోజు మొత్తం 11:30 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర. ఇవాళ కండ్లీ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస.