హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈరోజు హైదరాబాద్ లోని మాదాపూర్ దసపల్లా హోటల్ లో మీడియాతో ఇంటరాక్షన్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ, రిటైర్డ్ డీజీ కృష్ణప్రసాద్, టీ ఎస్ పీ ఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్. విఠల్, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, కట్టా సుధాకర్, రాష్ట్ర నాయకులు పాపారావు, భరత్, వెంకటరమణ, వీరెళ్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 9 ఏళ్ల పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…
• గత యూపీఏ హయాంలో అవినీతి తాండవించేది. అందుకు భిన్నంగా అవినీతికి తావులేని రీతిలో పారదర్శకంగా నరేంద్ర మోదీ పాలనను అందిస్తున్నారు.
• బాంబు బ్లాస్టులు, అలజడి లేకుండా శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
• కరోనా వ్యాక్సిన్ అందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడారు. దాదాపు 50 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించారు.
• పీఎం అవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇండ్లను నిర్మించారు. ఇందిరా ఆవాస్ యోజన కంటే మెరుగైన పథకం. ఇంటి నిర్మాణం కోసం మూడు విడత సాయం చేసేవాళ్లు. అది కూడా కలెక్టరేట్ కు సర్టిఫికేట్ సమర్పించాలి. టెక్నాలజీని ఉఫయోగించుకుని జియో ట్యాగింగ్ ద్వారా లబ్దిదారుడికి ఇబ్బంది లేకుండా చేశాం.
• దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మందికి టాయిలెట్లను నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఎర్రకోట నుండి ప్రసంగిస్తూ 10 కోట్ల టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అనుకున్న లక్ష్యానికంటే అధికంగా నిర్మించారు.
• స్వచ్ఛ భారత్ మిషన్ కింద పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత కంపు కొడుతున్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి శుభ్రం చేశారు.
• జల్ జీవన్ మిషన్ కింద 12 కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా శుద్ద మంచినీరు అందించాం. గతంలో మంచి నీళ్ల కోసం 5 కి.మీల దూరం నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు.
• ఉజ్వల యోజన కింద 9 కోట్ల 60 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించాం. వాస్తవానికి ఇది ఇన్నోవేటివ్ స్కీం.
• ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కోవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ప్రతినెలా ఉచితంగా రేషన్ అందించాం.
• జన్ ధన్ యోజన ఖాతా ఉన్న వాళ్లకు కోవిడ్ టైంలో ఇంట్లో ఉన్నప్పటికీ పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేశాం.
• ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పథకం. ఈ పథకం కింద కార్డు కలిగిన వాళ్లు ఆసుపత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించారు. ప్రపంచ దేశాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అధ్యయనం చేస్తున్నారు.
• జన ఔషధి కేంద్రాల ద్వారా 9 వేల 3 వందలకుపైగా రకాల మందులను చౌక ధరకే అందిస్తున్నారు. మార్కెట్లో 100 రూపాయలకు లభించేది జన ఔషధీ కేంద్రాల్లో 15 రూపాయలకే అందిస్తున్నాం. ఇది మెడిసన్ కాదు.. మోడీసన్..
• ఎరువుల కొరత లేకుండా చేస్తున్నాం. 6338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించి రైతులకు కొరత లేకుండా ఎరువులు అందిస్తున్నాం. పెద్ద ఎత్తున సబ్సిడీపై ఎరువులను రైతులకు అందిస్తున్నాం.
• కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతుల అకౌంట్లో నేరుగా రూ. 6 వేల జమ చేస్తున్నాం.
• సామాజిక న్యాయం చేస్తున్న ఘనత మోదీదే. ఎస్సీఎస్టీబీసీలకే కాకుండా అగ్ర కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అందిస్తున్నాం.
• జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత మోదీదే.
• వికలాంగులను దివ్యాంగులుగా గౌరవిస్తూ వారికి 7 నుండి 21 కోటా కల్పించారు.
• మోదీ హయాంలో 74 ఎయిర్ పోర్టులను నిర్మించారు. చౌక ధరకే సామాన్యులు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారు.
• 9 ఏళ్లలో 53 వేల కి.మీలకుపైగా రోడ్లను విస్తరించారు. వాటర్ వే స్ ద్వారా 111
• ప్రపంచ స్థాయి రైల్వేలను 20 ప్రవేశపెట్టారు. కొత్తగా 15 మెట్రో రైళ్లను ప్రవేశపెట్టారు.
• గతంలో 7 ఎయిమ్స్ ఉంటే.. మోదీ హయాంలో 15 ఎయిమ్స్ ను కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో తెలంగాణలోనూ కొత్తగా ఏర్పాటు చేశారు.
• గత 9 ఏళ్లలో 69663 మెడిసిన్ సీట్లనుచేశారు. ఇవిగాక 7 కొత్త ఐఐటీలతోపాటు పెద్ద ఎత్తున వర్శిటీలను ఏర్పాటు చేశాం.
• లిక్విట్ నానో యూరియా ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. మోదీ హయాంలో ప్రో యాక్టివ్ గవర్నెన్స్ కొనసాగుతోంది.
• అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. అందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైల్వే లైన్లను ఆధునీకకరించారు. కరీంనగర్ –వరంగల్ రైల్వే లైన్, మహబూబ్ నగర్ – విశాఖపట్నం రైల్వే లైన్ మంజూరయ్యాయి.
• అంబేద్కర్ పంచ్ తీర్థాలను ఏర్పాటు చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట అతిపెద్ద సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం
• పీఎం గతిశక్తి పేరిట పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించారు. 1.90 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం
• గతంలో అవినీతి పెచ్చరిల్లితే… మోదీ హయాంలో అవినీతికి తావు లేకుండ పారదర్శకంగా పాలనను అందిస్తున్నాం
• 5 జీ టెక్నాలజీని అందిస్తున్నాం
• ఆత్మనిర్బర్ భారత్ ద్వారా పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తూ అభివ్రుద్ధి చేస్తున్నాం
• ఆర్దిక వ్రుద్ధిలో ఇంగ్లాండ్ ను అధిగమించడమే కాకుండా 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చాం
• ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా దూసుకెళుతున్నాం.
• 100 యూనికార్న్ లు, లక్ష స్టార్టప్ లతో దూసుకెళుతున్నాం.
• న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తున్నాం. ఖేలో ఇండియా పేరుతో పెద్ద ఎత్తున స్టేడియంలు నిర్మించాం..
• విరాసత్ ఔర్ వికాస్ పేరుతో 231 ప్రముఖ దేవాలయాలను అభివ్రుద్ధి చేసి దివ్వ క్షేత్రాలుగా తీర్చిదిద్దాం. భారతీయ సంస్క్రుతి, సనాతన ధర్మాన్నిని ఫరిఢవిల్లేలా చేస్తున్నాం.
• 31 రాష్ట్రాల్లో 500 ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి అభివ్రుద్ధి చేస్తున్నాం.
• గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివ్రుద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
• జాతీయ భద్రత ద్రుష్ట్యా రక్షణ శాఖ రూ.లక్ష కోట్ల విలువైన ఉపకరణాలను ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది.
• యెమన్, సిరియా, ఆప్ఝనిస్తాన్, నేపాల్, సూడాన్ లో ఉన్న దాదాపు 20 వేల మందిని భారత ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
• కోవిడ్ సందర్భంగా విదేశాల్లు ఉన్న 2.97 కోట్ల మందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే.
• భారత్ వసుధైక కుటుంబం. జీ-20 దేశాలకు నాయకత్వం వహిస్తోంది. ఆస్ట్రేలియా ప్రధాని మోదీ ది బాస్ అని అభివర్ణిస్తే…కోవిడ్ నుండి దేశాన్ని కాపాడినందుకు పపువా న్యూగినియా ప్రధాని ఏకంగా నరేంద్ర మోదీకి పాదాభివందం చేశారు.