हैदराबाद: मंत्री हरीश राव ने आरोप लगाया है कि 10वीं पेपर लीक करने वाले बीजेपी के नेता है और बंडी संजय ने इसकी योजना बनाई थी। हरीश राव ने कहा कि केसीआर के सामने बीजेपी दाल गलने वाला नहीं है। बुधवार 5 अप्रैल को मेदक का दौरे पर आये मंत्री हरीश राव ने एक मीडिया सम्मेलन में यह बात की। उन्होंने कहा कि अगर भाजपा में बीआरएस का राजनीतिक रूप से सामना करने की हिम्मत नहीं है तो वह बच्चों के साथ बच्चों के जिंदगी के साथ खिलवाड़ कर रही है।
లీకులు చేసింది బీజేపీ వాళ్లే, సంజయ్ దే ప్లాన్ : హరీశ్ రావు
హైదరాబాద్ : పేపర్ లీకులు చేసినవాళ్లంతా బీజేపీవాళ్లే బండి సంజయ్ దే ప్లాన్ అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ ముందు బీజేపీ పప్పులుడకయ్ హనుమంతుడి ముందు కుప్పిగంతులొద్దని హితవు పలికారు హరీశ్ రావు. ఏప్రిల్ 5వ తేదీ బుధవారం మెదక్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ పసి పిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తోందన్నారు.
నిన్న బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయట పడిందని బీజేపీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు హరీశ్ రావు. తాండూరులో పదవ తరగతి పేపర్ లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారని,.ప్రశాంత్ కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి హరీశ్ రావు ధ్వజమెత్తారు.
బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయినా బుకాయిస్తున్నారని హరీశ్ రావు వెల్లడించారు. భవిష్యత్ తరాలకు బీజేపీ ఏం సందేశం ఇవ్వదలుచుకుందని నిలదీశారాయన. రాష్ట్రంలోని విద్యార్థులు బీజేపీ కుట్రలను గమనించాలని సూచించారు. బీజేపీకి చదువు విలువ తెలియదు..బీజేపీలో చదుకున్నోళ్లు తక్కువ ఉన్నారని ఎద్దేవ చేశారు.
పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారుడని ఆరోపించారు హరీశ్ రావు. ఏప్రిల్ 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం పదవ తరగతి పేపర్ లీకేజీ జరిగిందని బీజేపీ ధర్నా చేసింది.. సాయంత్రం నిందితులను విడుదల చేయాలని మళ్లీ ధర్నా చేసింది..దీంతో బీజేపీకి ఈ ఘటనతో సంబంధం ఉందని తేలిపోయిందన్నారు హరీశ్ రావు. ఈ వ్యవహారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండి సంజయ్ ని సమర్ధించడం సిగ్గు చేటని మండిపడ్డారు.
GHMC ఎన్నికలప్పుడు, TSPSC లీకేజీలో, ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ కుట్రలు రెడ్ హ్యాండెడ్ గా బయట పడ్డాయని వ్యాఖ్యానించారు హరీశ్ రావు. బండి సంజయ్ కు కొన్ని సూటి ప్రశ్నలు వేయదలుచుకున్నా పదవ తరగతి ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రచారం చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా…ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని నీకు వాట్సాప్ లో పంపింది నిజమా కాదా రెండు గంటల్లో 142 సార్లు నీతో నిందితుడు ఫోన్లో మాట్లాడలేదా కాదా..పనిగట్టుకుని ప్రశ్నాపత్రాలను మీడియా గ్రూపులకు, వెబ్సైట్ లకు మీ ప్రోద్భలంతో పంపింది నిజం కాదా అని ప్రశ్నించారు హరీశ్ రావు.
ప్రశ్న పత్రం వ్యాప్తిలో నీ ప్రమేయం లేకుంటే నీకు నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచావని బండి సంజయ్ నిలదీశారు హరీశ్ రావు. ప్రతి చిన్న ఘటనకు కేసీఆర్ కు ఆపాదించే నువ్వు సమాజంలో తలవంచుకునే చర్యకు పాల్పడ్డందుకు ఏం చేయాలని హరీశ్ అడిగారు.
రాష్ట్రాన్ని నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావ్ అని బండి సంజయ్ నిలదీశారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లాగా మీ గుండా గిరి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని హెచ్చరించారు. బీజేపీకి బండి చేతిలోనే మూడినట్టుందని ఎద్దేవ చేశారు..మీకు ఫేక్ డిగ్రీలు కామన్ కావచ్చు కానీ ఎంతో మంది కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో చేలాగాటమాడవద్దని తెలిపారు హరీశ్.
బీజేపీ విష ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దని కోరారు. తెలంగాణను ఆగం చేసేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది దాన్ని కేసీఆర్ ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలు చేదిస్తూనే ఉంటాం తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం చట్టం ఎవరికైనా ఒక్కటే అన్నారు హరీశ్ రావు. బండి సంజయ్ పై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను కోరుతున్నామని అన్నారాయన. (ఏజెన్సీలు)
10th పేపర్ లీక్ ఘటనపై స్పందించిన మంత్రి వేముల
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో బుధవారం నాడు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:
10వ తరగతి పేపర్ లీక్ సూత్రదారి బీజేపీ బండి సంజయే
అన్ని రకాల ఆధారాలు లభించాయి
లక్షల మంది పిల్లలు భవిష్యత్తు,వారి తల్లి తండ్రుల ఎంత బాధ పడతారు అని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడు
కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశం
ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి ఫోటో తీసిన పేపర్ ఫోన్లో పంపిండు
పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా వచ్చింది
బండి సంజయ్, బీజేపీ వాళ్ళతో 140 సార్లు ఫోన్లో మాట్లాడిండు ప్రశాంత్
పువ్వాడ అజయ్, మంత్రి
ఎన్నికల కోసం బీజేపీ నేతలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు
సంజయ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి
తక్షణమ్ లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలి
రాహుల్ సభ్యత్వం పై వెంటనే చర్యలు తీసుకోవాలి
ఉద్యోగులు ఒక సారి ఆలోచించాలి
బీజేపీ,కాంగ్రెస్ ల కారణంగా రాష్ట్రం భ్రష్టు పడుతోంది
ఇలాంటి పార్టీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
………
సండ్ర వెంకట వీరయ్య,ఎమ్మెల్యే
పైశాచిక కుట్రతో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు
బీజేపీ వి దేశ భక్తి నినాదాలు….కుట్రలకు పాలడడం ఎంత వరకు సమంజసం
రాహుల్ పై రెండు రోజుల్లో చర్యలు తీసుకున్న స్పీకర్ సంజయ్ లాంటి నేతల గురించి ఆలోచించాలి
సంజయ్ ని బీజేపీ అధ్యక్షుడు గా కొనసాగించాలా లేదో కూడా నిర్ణయం తీసుకోవాలి
……….
తాత మధు,ఎమ్మెల్సీ
బండి సంజయ్ ఎంపీగా కొనసాగేందుకు అనర్హుడు
బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ఆటలు మొదలు పెట్టింది
బీజేపీ నేతలను ప్రజలు ఛీత్కరించు కుంటున్నారు
కెసిఆర్ ను ఎదుర్కునే దమ్ము లేక విద్యార్థులు, వారి తల్లి దండ్రులను వాడుకుంటున్నారు
3వ తేదీ సాయంత్రం సంజయ్ ప్రశాంత్ కు ఫోన్ చేసి ప్రశ్నపత్రాలు లీక్ కావాలని చెబుతారు
కమలాపూర్ లో 9.45 కు ప్రశ్న పత్రాలు ఫోటోలు తీశారు
సంజయ్ అదేశాలతోనే బీజేపీ కార్యకర్తలు ప్రశ్న పాత్రలు లీక్ చేశారు
విద్యార్థులు మనసులను గాయపరిచే విధంగా కుట్రలు పన్నుతున్నారు
సంజయ్ పై పిడీ యాక్ట్ పెట్టాలి
వికారాబాద్ లో బీజేపీ అనుబంధ సంఘం ఉపాధ్యాయులు పేపర్ బయటకు వచ్చేలా చేశారు
బీజేపీ అనుబంధ సంఘాలన్నీ ఈ కుట్రలో భాగమే
ఎవరు కుట్ర చేసినా తీవ్ర చర్యలు తీసుకోవాలి
Tpsc లీక్ కుట్ర దారుడు కూడా బండి సంజయ్
…..
బాల్క సుమన్,ప్రభుత్వ విప్
లీక్ నిందితులకు బీజేపీ జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి
లీక్ కుట్ర బీజేపీ అగ్రనేతల కనుసన్నుల్లో జరుగుతుంది
సంజయ్ పాత్ర దారిగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి
అనేక పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించినా ఎప్పుడూ వివాదం కాలేదు….ఇప్పుడు బీజేపీ కుట్రలతో ఈ పరిస్థితి నెలకొంది
బీఆర్ ఎస్ నుంచి ప్రజల ను దూరం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది
రాష్ట్రంలో అలజడి తరువాత కీలక నేతలు పర్యటిస్తున్నారు
ప్రధాని, అమిత్ షా పర్యటనల సందర్భంగా గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు వచింది
ప్రధాని పర్యటనకు ముందు…టెంత్ ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్నాయి
తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలి
కేసీఆర్ ను ఎదుర్కునే దమ్ము బీజేపీ నేతలకు లేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారు
బీజేపీ నేతలకు దమ్ముంటే ప్రజల కోసం ఎం చేస్తారో చెప్పి ప్రజల మనసు గెలుచు కోవాలి
బీజేపీ నేతలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి…పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపాలి
ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని పోలీసులు ఏర్పాటు చేయాలి
బండి సంజయ్ పై ఎంపీ గా అనర్హుడు స్పీకర్ ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి