Hyderabad Local Body MLC Elections: “బీజేపీ, బిఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ”

కాంగ్రెస్ పోటీ లో లేదు మేము బీజేపీ కి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు

బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది…? : పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, బిఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ వేసిందని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ స్థానిక సంస్థలకు ఉన్న మొత్తం 112 ఓట్లలో బీజేపీ కి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయని, బిఆర్ఎస్ – 23, కాంగ్రెస్ -13 ఎంఐఎం -49 ఉన్నాయి. మాకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదని పేర్కొన్నారు. అప్పుడు బీజేపీ గెలుపు ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదు.. మేము బీజేపీ కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు రాదు. మేము తటస్థంగా ఉన్నాం. అలా అని ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు. అలాంటప్పుడు బిఆర్ఎస్ బీజేపీ కి మద్దతు తెలుపుతుందా అని ప్రశ్నించారు. మీ ఇద్దరి రాజకీయ అవగాహన మేరకే నామినేషన్ వేశారా …? బీజేపీ ఎలా గెలుస్తుంది క్రాస్ ఓటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Also Read-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఖరి పై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజసింగ్ విమర్శల నేపధ్యంలో కిషన్ రెడ్డి బిఆర్ఎస్ నాయకునికి బినామీ గా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ కి లోపాయికారి ఒప్పందంతో మద్దతు తెలిపిందని ఇప్పుడు కూడా బీజేపీ కి ఇంటర్నల్ మద్దతు తెలిపేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X