पूर्व पीएम पीवी नरसिम्हा राव ‘भारत रत्न’, बेटे प्रभाकर राव ने स्वीकार किया सबसे बड़ी उपाधि और…

हैदराबाद : राष्ट्रपति भवन में शनिवार को प्रतिष्ठित भारत रत्न पुरस्कार समारोह राष्ट्रपति द्रौपदी मुर्मू के करकमलों से संपन्न हुआ। इस कार्यक्रम में दिवंगत पूर्व प्रधानमंत्री पीवी नरसिम्हा राव के बेटे पीवी प्रभाकर राव ने उनकी ओर से भारत रत्न पुरस्कार प्राप्त किया।

कार्यक्रम में प्रधानमंत्री मोदी, केंद्रीय मंत्री अमित शाह, एआईसीसी चीफ मल्लिकार्जुन खड़गे समेत केंद्रीय मंत्री और अधिकारी शामिल हुए। इस वर्ष विभिन्न क्षेत्रों में विशिष्ट सेवाओं के लिए सबसे अधिक पांच लोगों को भारत रत्न पुरस्कार देने की घोषणा की गई है।

इनमें दो पूर्व प्रधान मंत्री पीवी नरसिम्हा राव और चौधरी चरण सिंह हैं, जबकि कृषि वैज्ञानिक एमएस स्वामीनाथन, वरिष्ठ भाजपा नेता लालकृष्ण आडवाणी और बिहार के पूर्व मुख्यमंत्री कर्पूरी ठाकुर शामिल हैं। उनमें से चार मशहूर हस्तियों का निधन हो चुका है। उनके परिवार के सदस्य उनकी ओर से पुरस्कार प्राप्त किये।

एमएस स्वामीनाथन की ओर से उनकी बेटी नित्या राव, कर्पूरी ठाकुर की ओर से उनके पुत्र रामनाथ ठाकुर, चौधरी चरण सिंह की ओर से उनके पोते जयंत सिंह और पीवी की ओर से उनके पुत्र प्रभाकर राव ने भारत रत्न पुरस्कार प्राप्त किये। लालकृष्ण आडवाणी को राष्ट्रपति द्रौपदीमुर्मू और प्रधानमंत्री नरेंद्र मोदी रविवार को उनसे मिलने आएंगे और उन्हें भारत रत्न पुरस्कार प्रदान करेंगे।

భారతరత్న అందుకున్న వీపీ తనయుడు ప్రభాకర్ రావు

హైదరాబాద్: రాష్ట్రపతి భవన్ లో ఇవ్వాళ ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరపున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు భారతరత్న పురస్కారాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు , ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, పలువురు అధికారులు హాజరయ్యారు. కాగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు అత్యధికంగా ఈ ఏడాది ఐదు మందికి భారతరత్న పురస్కారాలను ప్రకటించారు.

ఇందులో ఇద్దరు మాజీ ప్రధానులు పీవీ నర్సింహరావు, చౌదరి చరణ్ సింగ్ కాగా వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ ఉన్నారు. వీరిలో నలుగురు ప్రముఖులు చనిపోయిన వారికి ప్రకటించగా వారి తరపున కుటుంబసభ్యులు పురస్కారాన్ని స్వీకరించారు.

ఎమ్ఎస్ స్వామీనాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరీ ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్ నాథ్ ఠాకూర్, చౌదరీ చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ సింగ్, పీవీ తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు పురస్కారాలను అందుకున్నారు. ఎల్ కే అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆయన ఇంటికెళ్లి భారత రత్న ప్రధానం చేయనున్నారని తెలుస్తొంది.

భారతరత్న పురస్కారం అందుకున్న సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందేశం

మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు తరపున వారి కుమారుడైన పీవీ ప్రభాకర్ రావు గారు ఇవాళ గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు చేతుల మీదుగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పీవీ నరసింహారావు గారి కుటుంబ సభ్యులకు, పీవీ గారి అభిమానులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ప్రఖర జాతీయవాది, దేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన మహనీయుడు, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, సాహితీవేత్త అయిన తెలుగుతేజం శ్రీ పీవీ నరసింహారావుకి దేశ అత్యున్నత పౌర పురస్కార ప్రదానం సందర్భంగా.. గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X