Hyderabad: Minister of State, Home Affairs Shri Bandi Sanjay Kumar expressed his indignation and Responded strongly to comments by AIMIM leader Asaduddin Owaisi, who questioned why the Modi government wants to allow non-Muslims in the Waqf Board while advocating for only Hindus in the TTD. He argued that Owaisi’s true colors were exposed by his attempt to connect the Tirumala Tirupati Devasthanams (TTD), a holy temple site, with Waqf Board lands.
“Tirumala Tirupati Devasthanam is the sacred place of Lord Venkateswara, the deity of the age of Kali. The Waqf Board is solely related to land matters. It isn’t even comparable to your place of worship, Mecca Mosque. Yet, you shamelessly link TTD with the business dealings of Waqf lands. What a disgrace, Owaisi!” Bandi Sanjay remarked. He also criticized Owaisi’s call for Hindu representation in the Waqf Board when there is no provision for non-Muslims in the TTD. The central government’s aim, he explained, is to ensure that Waqf lands benefit the poorer Muslim community, and this is why they have introduced amendments to the Waqf Board Bill.
“TTD uses its donations to help the needy and support Hindu religious institutions but has never occupied public property,” he added. “In Owaisi’s eyes, God is merely a business. Under the name of Allah, he has looted lands, seized thousands of acres, built colleges and hospitals, and earned crores. Can such a fanatic stop turning God into a commodity and opportunistic element?” he taunted.
Addressing the residents of the Old City, Bandi Sanjay said, “My message to my Muslim brothers of the Old City, who have been deceived by Owaisi’s words for decades, it’s time to reflect on the truth. For decades, you’ve voted for AIMIM. Why has the Old City still not transformed? Why hasn’t it become a New City like Cyberabad? Why hasn’t the Metro reached the Old City? Why are you still struggling to make a living with pan shops, puncture repair, and inadequate housing? Why can’t you give your children good education or provide them with proper healthcare? Meanwhile, the Owaisi family, elected with your votes, has occupied Waqf lands, taken over tank bed lands, and built colleges and hospitals, earning crores in the name of service. Reflect on this.”
Bandi Sanjay also commented on the AIMIM’s recent statements, saying, “We have the complete records of BRS. If I were to reveal them, they wouldn’t withstand it. Should I expose everything now?” He continued, “The AIMIM, which once stoked Telangana sentiment to come to power with the family-run party (BRS), has today revealed its true colors. Now it seeks to align with the Congress, the party of fake Gandhi heirs who are looting the nation. It seems the AIMIM’s test of loyalty is over. After coming to power on the trust of the people of Telangana, the KCR family has used and discarded them, keeping them impoverished and stifling democracy.”
The Minister of State urged the Workers of the Congress, BRS, and AIMIM… if you sacrifice for the nation and righteousness, your name will be remembered in history. But why are you ruining your lives for the opportunistic politics of KCR, Owaisi, and the fake Gandhi family? Think it over.”
ఒవైసీ… కలియుగ దైవానికి, వక్ఫ్ భూములకు తేడా తెలియని అజ్ఝాని?
మీ ద్రుష్టిలో దేవుడంటే భూములను ఆక్రమించుకుని చేసే వ్యాపారమా?
వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు చెందాలన్నదే కేంద్రం ఉద్దేశం
పాతబస్తీ వాసులారా… ఇకనైనా మేల్కొండి
ఓల్డ్ సీటీ ఇన్నాళ్లుగా ఎందుకు న్యూసిటీ ఎందుకు కాలేదో అర్ధమైందా?
మీ ఓట్లతో ఒవైసీ కుటుంబం లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా కూడబెట్టారో తెలుసుకోండి
మజ్లిస్ పార్టీకి శల్య పరీక్ష ముగిసినట్లుంది
తెలంగాణ ద్రోహి(బీఆర్ఎస్)పార్టీతో దేశద్రోహి(ఎంఐఎం) పార్టీ తెగదెంపులకు సిద్దమైనట్లుంది
దేశాన్ని దోచుకుంటున్న నకిలీ గాంధీ వారసుల పార్టీ(కాంగ్రెస్)తో అంటకాగేందుకు ఎంఐఎం తంటాలు పడుతోంది
బీఆర్ఎస్ పార్టీ నేతలారా… ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి…
ముక్కు నేలకు రాస తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి
ఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్
హైదరాబాద్ : టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెబుతున్న నరేంద్ర మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డ్ లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ అసలు రంగు ఈరోజు పూర్తిగా బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి, వక్ఫ్ బోర్డు భూములకు లింకు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు.
‘‘కలియుగ ప్రత్యక్ష దైవం…. ఆ వైకుంఠాధీశుడు కొలువైన పరమ పవిత్రమైన స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూములకు సంబంధించిన వ్యవహారం మాత్రమే. మీరు ప్రార్ధించే మక్కా మసీదు కూడా కాదు. అయినా సిగ్గులేకుండా టీటీడీకి, వక్ఫ్ బోర్డు పేరుతో సాగిస్తున్న భూముల దందాకు లింకు పెడతవా? ఒవైసీ’’ అంటూ మండిపడ్డారు. టీటీడీలో ముస్లిమేతరులకు స్థానం కల్పించనప్పుడు… వక్ఫ్ బోర్డులో హిందువులకు ఎందుకు స్థానం కల్పించాలంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలనూ బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు మాత్రమే దక్కాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని, అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చిందని తెలిపారు. టీటీడీ తనకు వచ్చిన విరాళాలతో పేదలకు, హిందూ ధార్మిక సంస్థలకు సాయం చేస్తోందే తప్ప… ఏనాడూ ప్రజల ఆస్తులను కబ్జా చేసుకోలేదని చెప్పారు. ‘‘ఒవైసీ ద్రుష్టిలో భగవంతుడంటే వ్యాపారమే. అల్లా పేరు చెప్పుకుని భూములను దోచుకున్నడు. వేల ఎకరాలను కబ్జా చేసిండు. కాలేజీలు, ఆసుపత్రులు కట్టి వేల కోట్ల రూపాయలు దోచుకుంటుండు. చివరికి చెరువులను, శిఖం భూములను కూడా కబ్జా చేసి భవంతులు కట్టుకున్నడు. అట్లాంటి మతోన్మాది దేవుడిని వ్యాపార వస్తువుగా, అవకాశవాద అంశంగా మార్చుకోకుండా మాట్లాడగలడా…?’’అని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా పాతబస్తీ వాసులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘ఒవైసీ మాటలు నమ్మి దశాబ్దాలుగా మోసపోతున్న పాతబస్తీ ముస్లిం సోదరులకు నేను చెప్పేదొక్కంటే… ఇకనైనా వాస్తవాలు ఆలోచించాలి. దశాబ్దాల తరబడి ఓట్లేసి మీరు ఎంఐఎంను గెలిపిస్తున్నరు. అయినా ఓల్డ్ సిటీ ఇంకా ఎందుకు ఓల్డ్ సిటీగానే మిగిలిపోయింది? సైబరాబాద్ లాగా న్యూసిటీ ఎందుకు కాలేకపోయింది? కనీసం పాతబస్తీకి మెట్రో ఎందుకు రాలేకపోయింది? మీరింకా పాన్ షాపులు నడుపుకుంటూ, పంక్చర్లు వేసుకుంటూ, తినడానికి తిండిలేక సరైన ఇల్లు లేక ఎందుకు అల్లాడుతున్నరు?. మీ పిల్లలకు మంచి చదువులు ఎందుకు చదివించలేకపోతున్నరు? మంచి వైద్యం ఎందుకు అందించలేకపోతున్నరు? అదే సమయంలో మీ ఓట్లతో గెలిచిన ఒవైసీ కుటుంబం వక్ఫ్ భూములను ఆక్రమించి, చెరువు శిఖం భూములను కబ్జా చేసి కాలేజీలు, ఆసుపత్రులు కట్టి సేవ పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఎట్లా దోచుకుంటున్నరు..? అద్దాల భవంతుల్లో ఎట్లా తుల తూగుతున్నరు?…ఒక్కసారి ఆలోచించండి’’ అని కోరారు.
‘‘బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి. అవి చెబితే వాళ్లు తట్టుకోలేరు. ఆ విషయాలన్నీ నేను ఇప్పుడు బయటపెట్టాలా?’’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన కుటుంబ పార్టీ(బీఆర్ఎస్)తో పదేళ్లు అంటకాగిన నిఖార్సన దేశద్రోహ(ఎంఐఎం) పార్టీ. ఇయాళ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. తన అవసరార్ధ మిత్రుడి(బీఆర్ఎస్)ని మించి దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రాజ్యమేలుతున్న నకిలీ గాంధీ వారసుల పార్టీ(కాంగ్రెస్)ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతోంది. పాపం… ఒవైసీ సోదరుల శీల పరీక్ష గడువు ముగిసినట్లుంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామిక తెలంగాణ నినాదంతో ప్రజల్ని నమ్మించి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్లను చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని వాడుకుని వదిలేసింది. నకిలీ గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలతో దేశాన్ని దోచుకునేందుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీతో అంటకాగేందుకు సిద్దమైంది. కల్వకుంట్ల కుటుంబమా?
‘‘ఇకనైనా సిగ్గుతో తలదించుకోండి. రాజకీయ మతోన్మాదంతో రగిలిపోతూ జన్మనిచ్చిన తల్లికే వెన్నుపోటు పోడుస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న (ఎంఐఎం) పార్టీతో అంటకాగినందుకు ముక్కు నేలకురాసి యావత్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పండి.’’అని సూచించారు.‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తలారా… దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేస్తే మీ పేరు చరిత్రలో నిలిచిపోతోంది. కానీ కేసీఆర్, ఒవైసీ, నకిలీ గాంధీ కుటుంబాల అవకాశవాద రాజకీయాల కోసం మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి’’అని హితవు పలికారు.
Asaduddin Owaisi on TTD chief’s ‘only Hindu staff’ remark
Hyderabad: All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi on Saturday reacted to the new Tirupati temple chairman’s remark about employing “only Hindus” at the temple’s premises. Taking a dig at Prime Minister Narendra Modi, Owaisi said that while the chairman of Tirumala Tirupati Devasthanams (TTD) has announced the Hindu-only staff policy in Tirumala, the NDA government at the Centre wants to induct non-Muslims in Waqf Boards.
“…Not even a single member of the 24 members of TTD Board (Tirumala Tirupati Devasthanams) is a non-Hindu…The new Chairman of TTD says that the people working there should be Hindu…We are not against this, we just have an objection to the fact that Narendra Modi’s government is saying in the proposed bill of Waqf that in the central Waqf Council, it has been made mandatory that 2 non-Muslims members should be there…Why are you bringing this provision in the Waqf bill? ” Owaisi was quoted as saying by ANI.
He added: “TTD is a board of the Hindu religion and Waqf Board is for the Muslim religion. There should be parity…When the trustees of TTD cannot be Muslims, how will a non-Muslim member be on the Waqf Board?…” The newly-designated chairman of TTD Board B R Naidu on October 31 had said said that all persons who work at the temple’s premises should be Hindus.
“Everyone who works at Tirumala should be a Hindu. That would be my first effort. There are many issues in this. We have to look into that,” BR Naidu had said. Naidu had also said he would discuss with the Andhra Pradesh government on the way forward in dealing with staff members belonging to other faiths. Naidu also said he would consider the possibility of granting them a VRS (Voluntary Retirement Scheme) or transferring them to other departments.
Centre’s Waqf Bill
The Waqf (Amendment) Bill, 2024, introduced in the Lok Sabha in August, aims to bring major reforms by introducing digitization, stricter audits, transparency, and legal mechanisms to reclaim illegally occupied properties. The bill seeks to bring changes to the powers of state waqf boards, survey of waqf properties and removal of encroachments by amending the Waqf Act, 1995, among other changes.
The bill has been referred to the Joint Committee of Parliament, which is conducting a series of meetings to gather input from government officials, legal experts, Waqf Board members, and community representatives across different states and Union Territories, aiming to create the most comprehensive reform possible. (Agencies)
తిరుమల ఏమైనా మీ జాగీరా, అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఇందకు ముందు, టీటీడీ బోర్డు చైర్మన్)గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టక ముందే ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా సృష్టిస్తున్నాయి. తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న అన్యమతస్తులను వీఆర్ఎస్ (VRS) ఇచ్చి పంపుతామని, ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఇటీవల ఆయన కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే బీఆర్ నాయుడు) చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు లోని 24 మంది సభ్యుల్లో అందరూ హిందువులే ఉండాలని, అదేవిధంగా ఆలయంలో పనిచేసే వాళ్లలో అన్యమతస్తులు ఉండకూడదంటూ టీటీడీ బోర్డు చైర్మన్ స్టేట్‌మెంట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు.
బీఆర్ నాయుడు వ్యాఖ్యలను తాము పూర్తిగా వ్యతిరేకమని, తిరుమల ఆయన జాగీరు కాదని ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్, వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ లో ముస్లిమేతరులకు చోటు కల్పిస్తూ బిల్లు రూపొందించిందని గుర్తు చేశారు. అసలు హిందువులకు సంబంధం లేని వక్ఫ్ బిల్లులో ఈ నిబంధన ఎందుకు తెస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
టీటీడీలో పని చేసేందుకు అన్యమతస్తులను ఎలా అయితే నిరాకరిస్తున్నారో.. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ బిల్లు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే వ్యవహిరించాలని ఆయన కామెంట్ చేశారు. దేశంలో హిందువులకు ఒక న్యాయం.. ముస్లింలకు ఓ న్యాయమా అని అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చాడు.