కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో తీగటగుట్టపల్లి ఆర్ఓబీకి మోక్షం
మరో నాలుగు ఆర్ఓబీలకు కేంద్రం ఆమోదం
రూ.433 కోట్లతో మొత్తం 5 ఆర్ఓబీలను రాష్ట్రవాటాతో సంబంధం లేకుండా నిర్మాణం
ప్రధానికి, కేంద్రమంత్రులకు ధన్యవాదాలు తెలిపిన సంజయ్ కుమార్
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో కరీంనగర్ పట్టణం తీగలగుట్టపల్లి వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మోక్షం కలిగింది.
దాదాపు ఏడాది కిందటే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్వోబీ కి నిధులు మంజూరు చేసిన రాష్ట్రం తన వాటా ఇవ్వక పోవడంతో నిర్మాణం ఆగిపోయింది.
పైగా కేంద్రమే నిర్మాణం చేపట్టడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం టీఆరెస్ నేతలు చేశారు.
కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో పెరుగుతున్న కరీంనగర్ వాసుల ట్రాఫిక్ కష్టాలను బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి తో కేంద్రం ఈ బ్రిడ్జీ ని సేతు బంధన్ పథకం కింద నిర్మాణ పనులు చేపట్టేందుకు నిర్ణయించింది.
దీనితో తీగలగుట్టపల్లి ఆర్వోబీ పూర్తిగా కేంద్రం నిధులతో నిర్మాణం కాబోతోంది.
దీంతో త్వరలోనే కరీనంగర్ వాసుల ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది.
హైదరాబాద్ : కరీంనగర్ తో పాటు వికారాబాద్, వరంగల్, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల్లో మరో 4 ఆర్ఓబీలను నిర్మించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిధుల నుంచి సేతు బంధన్ పథకం కింద రూ. 432.84 కోట్లతో తెలంగాణలో మొత్తం 5 ఆర్ఓబీలను నిర్మించనుంది. కరీంనగర్ ఆర్ఓబీకి రూ.126.74 కోట్లు, వికారాబాద్ కు రూ.38.50 కోట్లు, వరంగల్ కు రూ. 90.10 కోట్లు, నిజామాబాద్ కు రూ. 127.5 కోట్లు, హన్మకొండకు ఆర్ఓబీకి రూ. 50 కోట్లను మంజూరు చేసింది.
నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ వల్ల స్థానికుల ట్రాఫిక్ కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కొరవడడంతో రాష్ట్ర ఎంపీలు, నాయకులు పలుమార్లు కేంద్రమంత్రులను కలిసి, వారికి వినతి పత్రాలు అందించి, ఆర్ఓబీల ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర ఎంపీల వినతిని పరిగణననలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 5 ఆర్ఓబీలను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూసేకరణ తక్షణమే చేపడితే, వీటి నిర్మాణం సత్వరమే పూర్తయి స్థానిక ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయి.
రాష్ట్రానికి 5 ఆర్ఓబీలు మంజూరు చేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం తన పెరు కోసం తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ఈనాడు పనిచెయ్యడాని మరోసారి నిరూపితం అయింది. కానీ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీగారి నెటుత్వం లోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా రాష్ట్రం వాటతో సంబంధం లేకుండా పూర్తి కేంద్ర నిదులతోనే చేపట్టడం మా నిబద్దత నిదర్శనం అని సంజయ్ అన్నారు. రాష్ట్రం సహకరించినా, సహకరించకపోయిన తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా మోడీగారి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన అన్నారు.