ఇంటింటికీ తిరుగుతూ మోదీ పాలనపై కరపత్రాలు అందిస్తూ, స్టిక్కర్లు అంటిస్తూ బీజీబిజీగా గడిపిన బండి

అదే పలకరింపు.. అదే ఆప్యాయత

-బండి సంజయ్ ఏమీ మారలే…

-ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నడు

-కరీంనగర్ ప్రజల మనోగతం

-ఇంటింటికీ బీజేపీ పేరుతో సొంత వార్డులో ప్రచారం చేస్తున్న బండి సంజయ్

-ఇంటింటికీ తిరుగుతూ మోదీ పాలనపై కరపత్రాలు అందిస్తూ, స్టిక్కర్లు అంటిస్తూ బీజీబిజీగా గడిపిన బండి

-ఉదయం 11 గంటలకు వంద కుటుంబాలకుపైగా కలిసిన బండి సంజయ్

-రాష్ట్రవ్యాప్తంగా 11 గంటల సమయానికి 20 లక్షల కు‘టుంబాలను కలిసిన బీజేపీ కార్యకర్తలు

-పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు… రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఇంటింటికీ తిరుగుతున్న వైనం

హైదరాబాద్: ‘‘బండి సంజయ్ అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలే. అదే పలకరింపు, అదే ఆప్యాయత. అదే చిరునవ్వు. కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఎట్లున్నడో… ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడైనంక కూడా అట్లనే సాదా సీదాగా ఉన్నడు. సంజయ్ మేం తయారు చేసిన నాయకుడు.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటడు. సంజయ్ ను చూస్తుంటే మస్త్ సంతోషంగా ఉంది.’’

• ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని తన సొంత వార్డు(చైతన్యపురి, జ్యోతినగర్)లో ఇంటింటికీ తిరుగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను చూసి అక్కడి స్థానికులు వ్యక్తం చేసిన మనోభావాలివి.

• ‘‘బండి సంజయ్ చూస్తే మా ఇంట్ల మనిషిలెక్కనే అనుకుంటం. కార్పొరేటర్ నుండి ఈ స్థాయికి ఎదిగినా అభిమానమే తప్ప అహంకారం కన్పించదు. మేం కార్పొరేటర్ గా గెలిపించినం. ఒక్క మాటలో చెప్పాలంటే మేం తయారు చేసిన నాయకుడు బండి సంజయ్. ఇయాళ ఈ స్థాయికి ఎదిగిండంటే మాకు మస్తు సంతోషంగా ఉంటుంది.’’అంటూ చైతన్యపురి, జ్యోతినగర్ లో నివసిస్తున్న జమున, క్రిష్ణారెడ్డి, వంశీధర్ రెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, హరి ప్రసాదరావు వ్యాఖ్యానించారు.

• మరోవైపు ఇంట్లో చిన్న పిల్లలు కన్పించగానే వాళ్లతో మమేకమైతూ బండి సంజయ్ నవ్విస్తుంటారు. ఇంటింటికీ బిజేపీ ప్రచారంలో భాగంగా పలు ఇండ్లలో చిన్న పిల్లలు బండి సంజయ్ ను చూడగానే ‘‘సంజయ్ మామా ఎట్లున్నవ్? నువ్వు నా దోస్త్ అంటూ’’ దగ్గరకు రావడం కన్పించింది. సంజయ్ సైతం వాళ్లతో చిన్నపిల్లాడిలా కలిసిపోతూ వాళ్ల చదువు, ఆటపాటల గురించి ఆరాతీస్తూ జోష్ నింపుతున్నారు. మొత్తంగా ఈరోజు సంజయ్ ను చూడగానే జ్యోతినగర్, చైతన్యపురి కాలనీ ప్రజలు ఆనందంతో ఇంట్లోకి స్వాగతం పలుకుతూ ఆశీర్వదించడం కన్పించింది.

• ఉదయం 11 గంటల సమాయానికి బండి సంజయ్ 70కిపైగా కుటుంబాలను కలిసి వారికి స్వయంగా మోదీ 9 ఏళ్ల పాలనపై కరపత్రాలు అందించడంతోపాటు వారి ఇంటి తలుపులు, గోడలపై స్టిక్కర్లు అంటించారు. అదే సమయంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలను ఆరా తీశారు.

• మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సమాచారం మేరకు… ఉదయం 11 గంటల సమయానికి దాదాపు 20 లక్షల కుటుంబాలను బీజేపీ శ్రేణులు కలిసినట్లు బండి సంజయ్ వెల్లడించారు.

కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లే

-బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్ నమ్మకం ఎక్కువ

-లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించే పనిలో సీబీఐ, ఈడీ

-ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారా?

-ధరణి బాధితులతో పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టొచ్చు

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివ్రుద్దిపై పరేడ్ మైదానంలో బహిరంగ చర్చకు సిద్దమా?

-ప్రజలను మోసం చేయడంలో బీఆర్ఎస్ ను మించిన తోపు లోకంలోనే లేరు

-అమరవీరుల కుటుంబాలను 9 ఏళ్లుగా పట్టించుకోని కేసీఆర్..ఈరోజు పిలిచి సన్మానించడం పెద్ద జిమ్మిక్కు

-తెలంగాణలో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది

-డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ డ్రామా చేస్తున్నడు
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

-కరీంనగర్ లో ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో ప్రజలను కలుస్తున్న బండి సంజయ్

హైదరాబాద్: కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం ఉందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోందే కేసీఆర్ అని, 30 స్థానాల్లో ఆ పార్టీకి డబ్బులు పంపిణీ చేశారని అన్నారు. కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్ఎస్ లోకేనని చెప్పారు.

కేసీఆర్ ను ఓడించాలి… ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాయకులంతా ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించే పనిలో సీబీఐ, ఈడీ నిమగ్నమై ఉందన్నారు. 9 ఏళ్లుగా ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. ఇయాళ పిలిచి సన్మానం చేయడం.. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కు అని అన్నారు.

• ‘‘మహా జనసంపర్క్ అభియాన్’’లో భాగంగా బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ లోని చైతన్యపురి, జ్యోతినగర్ కాలనీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి పేరుపేరునా పలకరిస్తూ నరేంద్రమోదీ గారి ప్రభుత్వం గత 9 ఏళ్లలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివ్రుద్ది, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్టిక్కర్లను స్వయంగా అంటించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు… ముఖ్యాంశాలు…

• పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుండి రాష్ట్ర అధ్యక్షుడి వరకు తాము నివాసం ఉండే పోలింగ్ బూత్ లకు వెళ్లి ప్రజలతో మమేకం అవుతుండటం సంతోషంగా ఉంది. మోదీగారి 9 ఏళ్ల పాలనను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం.

• నేను కూడా ఈరోజు 57వ డివిజన్ (జ్యోతి నగర్, చైతన్యపురి) పరిధిలో ఇంటింటికీ వెళుతూ ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉంది.

• ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం ద్వారా ఈ ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణలో 90 లక్షలకుపైగా కుటుంబాలుంటే అందులో మూడో వంతుకుపైగా కుటుంబాలను బీజేపీ కార్యకర్తల నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల వరకు కలిసేలా కార్యాచరణ రూపొందించాం. ఇది ఒక రికార్డు.

• ఉదయం 9 గంటల వరకే నాకు అందిన సమాచారం ప్రకారం…. బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా దాదాపు 10 లక్షల కుటుంబాలను కలుసుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35 లక్షల కుటుంబాలను కలిసి మోదీ పాలనపై కరపత్రాలు పంపిణీ చేస్తాం.

• మేం చాలా పాజిటివ్ మూడ్ లో చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ జనంలోకి వెళుతున్నాం. ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. దీంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లారీ, ఆటో, ట్రాలీ, బస్ డ్రైవర్లందరినీ ఒకరోజు కలుస్తాం. వీరితోపాటు టీ స్టాల్స్, పాన్ దుకణాలు, హోటళ్లు, వ్యాపార నిర్వాహకులను కలవాలని నిర్ణయించాం.

• తెలంగాణకు కేంద్రం ఏం చేసిందనే అంశంపై మొన్న కిషన్ రెడ్డి అన్ని వివరాలు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలప్పుడు ఏయే హామీలిచ్చారు? ఎన్ని నెరవేర్చారు? ఎంత అభివ్రుద్ధి చేశారో ‌వివరించాలని మేం కోరుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం అందుకు భిన్నంగా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుంది. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నరు.

• ఇయాళ అమర వీరుల స్మారక కార్యక్రమాలు చేస్తున్నారట… సిగ్గుండాలే సీఎంకు. 9 ఏళ్లలో ఏనాడూ వాళ్ల కుటుంబాలను పట్టించుకోలేదు. ఆ కుటుంబాలను ఆదుకోలేదు. ఎన్నికలొస్తున్నయని ఏదో జిమ్మిక్కు చేసి నమ్మించే యత్నం చేస్తడు.. జాగ్రత్త

• ప్రజలను మభ్యపెట్టేందుకు ఇయాళ 15 వేల ఇండ్లను ప్రారంభిస్తున్నడట. కేసీఆర్ తీరు ఎట్లుందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది. డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా శిథిలావస్థలో ఉన్నయ్. క్వాలిటీ లేదు. గోడలు కూలుతున్నయి. కిటీకీలు ఊడుతున్నయ్.

• పేదలు ఇండ్లు లేక కిరాయిలు కట్టలేక అల్లాడుతున్నరు. అందరికీ ఇండ్లు ఇవ్వండి. కేంద్రం 2. 4 లక్షల ఇండ్లు మంజూరు చేసింది. అవన్నీ ప్రజలకు పంచిపెడితే మరో 5 లక్షల ఇండ్లను మంజూరు చేయించే బాధ్యత నాదని కూడా చెప్పినా… కేసీఆర్ ఇంతవరకు పట్టించుకోలేదు.

• ప్రజలను మభ్యపెట్టేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేపర్లు, టీవీల్లో యాడ్స్ ఇస్తూ ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కట్టిన పన్నుల ఆదాయాన్ని యాడ్స్ పేరుతో నీళ్లలా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వ్రుధా చేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దళిత బంధు సక్సెస్ అని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లు హోర్డింగ్స్, వీడియోలు పెడుతున్నడు.. సిగ్గుండాలే. దళిత బంధులో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నరని కేసీఆరే చెప్పిండు.. బడ్జెట్ లోనే వెయ్యి కోట్లు ప్రచారం కోసం కేటాయించారంటే కేసీఆర్ కు ప్రచార యావ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి.

• ధరణి తప్పుల తడక. రైతులు అల్లాడుతున్నరు. ధరణి బాధితులందరినీ కలిపితే పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించవచ్చు. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టి స్క్రీన్లు పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఎక్కువ అభివ్రుద్ధి చేశారో వివరిద్దాం.. చర్చిద్దాం… సిద్దమా?

• ఇంతకీ కేసీఆర్ సాధించిందేమిటి? రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతి, ఏ ఇంటికో ఉద్యోగం, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారు. ఇది తెలిసే ప్రజలను మభ్యపెట్టేందుకే కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నడు.

• బీజేపీ- బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై…… దుబ్బాకలో బీజేపీ ఎవరి మీద గెలిచింది. హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీపై బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలే…. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లలో కూడా ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతైనయ్. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నం బీజేపీ మాత్రమేనని ప్రజలు నమ్మి ఓట్లేస్తున్నరు. అంతేగాదు… పార్లమెంట్ లో బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసే కొట్లాడుతున్నయ్. ఢిల్లీలో ర్యాలీలు తీస్తున్నయ్. బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసే పోటీ చేయబోతున్నాయని జానారెడ్డి కోమటిరెడ్డి అంటున్నరు. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో?

• పొన్నం వ్యాఖ్యలపై….. విమర్శలు హుందాగా ఉండాలే. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సాయంతో ఎంపీగా గెలిచానంటే జనం నవ్వుకుంటున్నారు. అదే నిజమైతే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా ఎట్లా గెలిచారు?

• అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే కేసీఆర్ నినాదంపై…… రైతులు కేసీఆర్ ను చూసి అసహ్యించుకుంటున్నరు. పంజాబ్ పోయి చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువు తీసిండు. రుణమాఫీ చేయకపోవడంతో జనం అల్లాడుతున్నరు. పైరు వేసే నాటి నుండి పంట చేతికొచ్చేదాకా రైతు ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికొచ్చాక కొనుగోలు పేరుతో దోపిడీకి గురవుతున్నరు. కేసీఆర్ పాలనతో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరు.

• కాంగ్రెస్ మునిగిపోయే నావ. కేసీఆర్ ను ఓడించాలి-ప్రజలను ఆదుకోవాలని లక్ష్యం ఉన్న నాయకులెవరూ ఆ పార్టీలో చేరవద్దని కోరుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటే. కాంగ్రెస్ తో కేసీఆర్ కలిసి పనిచేస్తున్నడు. గతంలో పొత్తు పెట్టుకున్నడు. ఈసారి కూడా కలిసే పోటీ చేస్తరు. ఇప్పటికే 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచిండు. ఆ పార్టీ నుండి ఎవరు గెలిచినా బీఆర్ఎస్ లోకి వెళతారనే ధీమా కేసీఆర్ కు ఉంది. కాబట్టి కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లే. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ కు సైతం బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే నమ్మకం ఎక్కువ.

• బీజేపీ జాయినింగ్స్ కమిటీ విఫలమైనట్లేనా? అనే ప్రశ్నకు… విఫలం, సఫలం అనేది ఉండదు… ఎవరి ఆలోచనలకు అనుగుణంగా వారు ఉంటారు… అందరికీ నేను చెప్పేది ఒక్కటే. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కొట్లాడుతున్న పార్టీ ఏది? ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తున్నారో… అర్ధం చేసుకోవాలి.

• గద్దర్ పార్టీ ఏర్పాటుపై….. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న కాళ్లకు గజ్జె కట్టి పాటపాడారు. కేసీఆర్ మాత్రం గద్దర్ గజ్జె కడితే తెలంగాణ వచ్చిందా? అని వెటకారం చేసిండు… గద్దర్ ఇప్పుడు కేసీఆర్ ను నిలదీయాలి.

• ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన తోపు లేరు. అందుకే 9 ఏళ్లుగా అమరవీరుల కుటుంబాల ముఖమే చూడని కేసీఆర్… ఇయాళ శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నడు.

• కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేయకపోవడంపై…… సీబీఐ, ఈడీ రాజ్యాంగబద్ద సంస్థలు. మోదీ హయాంలో అవినీతిపరులు తప్పించుకునే ఆస్కారమే లేదు. అయితే నిందితులు తప్పించుకోవడానికి వీల్లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించిన తరువాతే అరెస్ట్ చేసి జైలుకు పంపుతోంది. అంతే తప్ప బీజేపీ చెబితే అరెస్ట్ చేయరు. వద్దంటే ఆగరు…

• బీజేపీ-జనసేన పొత్తుపై… తెలంగాణలో బీజేపీ సింహం లెక్క సింగిల్ గానే పోటీ చేస్తుంది. అదికారం కైవసం చేసుకుంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X