హైదరాబాద్ : కరీంనగర్ జైలు నుండి విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. అనంతరం కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు,
ముఖ్యాంశాలు..
-టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై అతి త్వరలో వరంగల్ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్, పేపర్ కుట్ర దారులు వాళ్లే.
- తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారు
- హిందీ పేపర్ ను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా?
- టెక్నాలజీలో మేమే తోపని చెప్పేటోళ్లు లీకేజీ కుట్రను ఎందుకు చేధించడం లేదు?
- మీకు దమ్ముంటే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
- ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం?
వరంగల్ కమిషనర్ కు తెలివి ఉందా? మీ చేతగానతనాన్ని మాపై నెడతారా?
- కమీషనర్ … మీ సంగతి తేలుస్తాం.
- నల్లగొండ సహా ఇతర జిల్లాల్లో ఏమేం చేశారో అన్నీ బయటకు తీస్తాం
- మా అత్తమ్మ నన్ను కొడుకు లెక్క చూసుకుంది
- ఆమె చనిపోతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత నామీద ఉందని తెలిసినా కనికరం చూపని పోలీసులు
- ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?
- ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పరు… నోటీసులివ్వరు
- పోలీసుల తీరుతో పోలీసులు తలదించుకునే దుస్థితి
- సెల్ ఫోన్ తో మీకు ఏం అవసరం?
- లీకుతో నాకు సంబందం లేదని నా పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తా
- సీపీ… నేను కుట్ర చేసినట్లు ప్రమాణం చేసే దమ్ముందా?
- పోలీసులే మీ తీరుతో తలదించుకుంటున్నారు
- 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైతుంటే కేసీఆర్ ఎందుకు స్సందించరు?
- మీరు ఇంకెన్నాళ్లు విలాస వంతమైన జీవితం గడుపుతారు?
- నా ఇంటిపై దాడిపై ప్రివిలేజ్ నోటీసులిస్తా
- బాధ్యులందరినీ కోర్టుకు ఈడుస్తా
- నన్ను బొమ్మల రామారంలో రిలీజ్ చేస్తే జైలుకు ఎందుకు పంపారు?
- గంటల తరబడి వాహనాల్లో ఎందుకు తిప్పారు?
- లీకైన పేపర్ ను జర్నలిస్లు షేర్ చేస్తే తప్పేంటి?
- ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్లి పేపర్ లీక్ ఎట్లా చేశారు?
- నేను 2 వేల మందితో సెల్ఫీలు దిగుతా…. అందరితో లింకులున్నట్లేనా?
- పోలీసులకు బలగం సినిమా చూపిస్తేనైనా బంధాల విలువ తెలుస్తుందేమో
- నాపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలంటున్న హరీష్ పై హత్యానేరం కేసు పెట్టాలి
- 1400 మంది బలిదానాలకు కారకుడు హరీషే
కేటీఆర్ ను సీఎం చేస్తే జంప్ జిలానీ హరీషే
- ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణానికి కారకుడైన కేటీఆర్ పై పీడీ యాక్ట్ పెట్టాలి
- దేశంలోని ప్రతిపక్షాలన్నింటికీ డబ్బులిస్తానని చెప్పిన కేసీఆర్ సంగతి తేల్చాలి
- ప్రజల కోసం ఎన్ని సార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై మాట్లాడితే పిచ్చోడంటారా?
- ఆత్మహత్యలు, ఉద్యోగుల జీతాలుసహా ప్రజా సమస్యలపై నిలదీస్తే పిచ్చోళ్లంటారా?
- తాగుబోతు చేతిలో తెలంగాణ
- మీ కుటుంబం వేల కోట్లు సంపాదించుకుంటారు… తెలంగాణ ప్రజలు బర్బాద్ కావాలా?
- దమ్ముంటే అబివ్రుద్దిపై చర్చకు రావాలి
- ఇచ్చిన హామీల అమలుపై చర్చించేందుకు సిద్దమా?
- తెలంగాణపై కేసీఆర్ కు తెగదెంపులయ్యాయి
- నీ కొడుకు, బిడ్డను జైలుకు పంపడం ఖాయం
- జై తెలంగాణ అంటూ జెండా మోసిన వాళ్లంతా ఏమయ్యారు?
- కేసీఆర్ కొడుకుకు అహంకారం తలకెక్కింది
- దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం పాలన చేస్తోంది
- కేసీఆర్ కుటుంబం అవినీతి, అరాచకాలపై ప్రజలు విసిగెత్తిపోయారు…
- కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు మరో ఉద్యమానికి సిద్ధమైనం
- బీఆర్ఎస్ కార్యకర్తాలారా…. తెలంగాణ కోసం కలిసి రండి
- తెలంగాణ అభివ్రుద్ధికి మోదీ సిద్ధమైనా సహకరించని కేసీఆర్
- రేపు పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రదాని మోదీ సభకు ప్రతి ఒక్కరూ తరలిరండి
- బీజేపీ దమ్మేందో చూపిద్దాం
- అండగా ఉన్న జాతీయ నాయకత్వానికి, లీగల్ టీం, కార్యకర్తలకు ధన్యవాదాలు
- మేం సిద్దాంతాల కోసం పనిచేసే వాళ్లం
- తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం
- సింగరేణిలో సమ్మె చేస్తామన్న కేసీఆర్ సర్కార్ కు దమ్ముందా?
- సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిదే
- 49 శాతం వాటా ఉన్న కేంద్రం ప్రైవేటీకరణ ఎలా చేయగలదు?
- సింగరేణిని ప్రైవేటీకరణను బీజేపీ పక్షాన వ్యతిరేకిస్తాం
- సింగరేణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది
- ఏడాదికోసారి కేసీఆర్ కుటుంబం వాటాలు పంచుకుంటుంది
- మోదీ వస్తున్నారని తెలిసి రెచ్చగొట్టేందుకే కేసీఆర్ కుట్రలు
- సింగరేణి కార్మికులందరికీ అన్ని విషయాలు తెలుసు
- మోదీ సభను అడ్డుకుంటే తెలంగాణ అభివ్రుద్దిని అడ్డుకున్నట్ల్లే
- అబివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకే ప్రధాని తెలంగాణ పర్యటన
- వందే భారత్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ సహా పలు అభివ్రుద్ది పనుల ప్రారంభానికే ప్రధాని రాక కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక పాలనపై ద్రుష్టి మళ్లించేందుకు రచ్చ చేసే యత్నం
- ప్రధానిని అడ్డుకోవాలనే కేసీఆర్ కుటుంబ కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలి.
ఫ్లాష్….ఫ్లాష్….
- బండి… గో ఎహెడ్
- కేంద్రం, జాతీయ నాయకత్వమంతా మీకు అండగా ఉంది
- బీఆర్ఎస్ కుట్రలను చేధిద్దాం
- ప్రజా సమస్యలపై ఉధ్రుతంగా పోరాడండి
- జైలు నుండి విడుదలైన బండి సంజయ్ కు అమిత్ షా, నడ్డా, స్ర్ముతి ఇరానీ ఫోన్
- సంజయ్ కు ఫోన్ చేసిన తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సహా జాతీయ నాయకులు
బండి సంజయ్ కు మార్గమధ్యలో విజయ తిలకం దిద్ది స్వీట్ తిన్పిస్తున్న విద్యార్తినీలు, మహిళలు
జైలు నుండి విడుదలై ఇంటికి వెళుతున్న బండి సంజయ్ కు మార్గమధ్యలో విజయ తిలకం దిద్ది స్వీట్ తిన్పిస్తున్న విద్యార్తినీలు, మహిళలు
తన అత్తగారు చిట్ల విజయమ్మ దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న బండి సంజయ్ కుమార్. తన అత్తగారు చిట్ల వనజ దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న బండి సంజయ్ కుమార్.
కరీంనగర్ లోని కోర్ట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్దకు బయలుదేరిన బండి సంజయ్. బండి సంజయ్ ను కలిసేందుకు వేలాదిగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న కార్యకర్తలు. బండి సంజయ్ కు సంఘీభావం ప్రకటిస్తూ మరికొద్ది క్షణాల్లో భారీ ర్యాలీ. కోర్ట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నుండి రేకుర్తి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగనున్న భారీ ర్యాలీ.
ఎన్వీ సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి…
న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యమే గెలిచింది
నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బండి సంజయ్ కి బెయిల్ లభించడం ప్రజాస్వామ్య విజయం
కోర్టు ఉత్తర్వులు బీఆర్ఎస్ సర్కార్ కు చెంప పెట్టు
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధింపు, కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం
ప్రగతి భవన్ డైరెక్షన్లోనే కరీంనగర్లో బండి సంజయ్ విడుదల సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో… బండి సంజయ్ బెయిల్ పై విడుదల సందర్భంగా, 144 సెక్షన్ విధించాల్సిన అవసరం ఏమొచ్చింది?
జైలు నుంచి విడుదల సందర్భంగా ఎక్కడ ర్యాలీగా వస్తారోనన్న భయంతోనే 144 సెక్షన్ విధించారు
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ పార్టీ అక్రమ కేసులతో బండి సంజయ్ ని అరెస్టు చేయించి, చివరకు బొక్క బోర్లా పడింది
రేపటి ప్రధాని పర్యటనను, పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించి, సక్సెస్ చేస్తాం
రేపటి ప్రధాని సభతో బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది
కేసీఆర్ పిట్ట బెదిరింపులకు, ఉడుత ఊపులకు బీజేపీ భయపడదు
“లీకేజీలు, ప్యాకేజీల మంత్రం బిఆర్ఎస్ ది అయితే… భారత్, భవిష్యత్తు బిజెపిది”