గొండి-కొలామి భాషలకు కొత్తజీవం: సినిమా గీతరచయిత అక్కల చంద్రమౌళి

“మావ నాటే మావ భాష -మన ఊళ్ళో మన భాష”-
Preserve the community

మనం ఏమిటి? మనం భాషేమిటి? పుట్టినప్పుడు ఏం మాట్లాడుతున్నాం. మన మాత్రృభాష ఏమిటి? భాషకు, మానవ మనుగడకు సంబంధం ఉంది. అదే జీవభాష కదా? ఈ మధ్యనే “పరేషాన్ “సిన్మాల తెలంగాణ యాస, భాష ఇదివరకు ఎన్నడూ రాయని మాండలికంలోనిది.

అత్తరు బుత్తరు పరాశికం
తట్టరు బుట్టరు పజితుకం
సొసొచ్చె సొసొచ్చె సయిసరాదె సై సై సరాదే
మునుంబట్టి కాండ్రకిచ్చె
జన్నకిడిసె కాకిరిబికిరి
జెట్టకాలం
కయ్యరబియ్యర కాయిలాట్కం
తత్తరబిత్తర చిల్లర మిల్లర
అదరబాదర డాలన బోలనా
బుడ్డపరక ఉదెం తడల తడల
నాత్తన నాత్తన చెమ్మదిగిది
అయ్యడమయ్యెడ బత్తి పేలింది బత్తపేలిందే బత్తివేలిందే…
పా పర పర పా పర పపర
ఉచ్చుబ్బుల సిక్కులిరికె
మిటకరిచ్చే మస్తాపతి
గల్లర గల్లర అయ్యే చిత్తం
పక్కడ పక్కడ నవ్వులాట్కం
బిర్రన బిర్రనా బిత్తర గత్తర
అలాయ్ బలాయ్ సిల్ల్లాడె సిల్లాడె
ఇరస్కపడిన ఇనం కడన కడనా
గుప్కీన గుప్కీన గుద్దుడదిరే
చిక్కురు బొక్కురు బతుకయ్యిందే…

“సౌ సారా చటాక్కార” గాయి గత్తర గత్తర ఇందులో పదాలు తాతలు కాలం నాటివి అవి తెలంగాణలోనే ఎంతోమందికీ అర్థం కాలేదు నాకు అనేక మంది ఫోన్ చేసి అడిగారు ఇది తెలంగాణ భాషేనా? లేదా ఇంకేమైనా అడిగగా నేను తెలంగాణ భాషని చెప్పాను. ఇలా రాయడానికి నాకు రిఫరెన్స్ లేదు. పరేషాన్ కూడా రిఫరెన్స్ కొత్త ప్రయోగం చేశామని చెప్పాం. మైదానం ప్రాంతం భాష మర్మం అదివాసీలకు మనుషుల జీవితాలకు అర్థమై అక్కున చేర్చుకున్నారు. “గాంధారి ఖిల్లా” ట్రైబల్ పాటకు సిడాం అర్జు, రాజ్ గొండి సేవా సమితి అభినందనలు తెలిపారు.

ఇక్కడ విషయం ఏమిటంటే తెలంగాణ భాషే, తెలంగాణ ప్రజలకు అర్థం కాని పరిస్థితిలోకి భాష నెట్టివేయబడుతుంది. మళ్ళీ పునరుజ్జీవనం పాటలు జరిగిందని భావిస్తే దాన్ని చర్చకు, విమర్శగానీ ఎవరు సాహసం చేయలేదు. ఒకటో రెండో పదాలు రాసి తెలంగాణ భాష అని చెప్పే వారు సుమారు ఐదువందల కొత్తపదాలతో పాట రాపించిన అసలు సిసలు దర్శకుడు రూపక్ రోనాల్డ్ ధైర్యం మాములు కాదు.

మైదానం ప్రాంతంలో ఉండే‌ భాష మనకు తెలియని స్థితిలో ఉంటే, అదిలాబాద్ కొండల్లో, కొనల్లో ఆదిమ గిరిజన గొండి, కొలామి మాట్లాడేది ఉంటుందని ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ తెలంగాణ భాషంటే కేవలం వరంగల్లు, కరీంనగర్, మహబూబ్ బాద్, ఖమ్మం, నల్గొండ అనుకుంటాం కానీ అదివాసుల గూడెంలా ఎవరికి తెలియని అద్భుతమైన జీవ భాష ఉంది. గొండి, కొలామి ఇది కూడా తెలంగాణ భాషే, ఇదిప్పుడు మరో ఇరవై సంవత్సరంలో అంతరించిపోయే దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 7000 భాషలు అందులో 1600 భాషలు భారత్లో ఉన్నాయ్. ఇవన్నీ కొన్నింటికి లిపి లేదు. భాషే అంతమైతే మనిషి ఎక్కడుంటాడు.

ఒక జాతి మనుగడ పురోగతిని సంస్కృతి సంప్రదాయాలు ముందుకు పోవాలంటే ఆ జాతికి భాష అవసరం. ఆదిమ జాతుల భాష కూడా ఆదిలాబాద్ల గొండు, కొలామి మాత్రృభాషలో తమ భాష తప్పా మరే భాషా రానీ ఆదివాసీ సముదాయాలకు తెలుగునే వారు మొదటి భాషగా చదువుకుంటున్నారు. అనేక ఇబ్బందులు ఉన్నాయి.1950 ఒకప్పుడు ఉపాధ్యాయ శిక్షణ మార్లవాయి, గిన్నదరిలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు గిరిజన పాఠశాలల్లో గొండి టీచర్ బోధించే విధానం ఉండేది. విద్యావ్యవస్థలో మార్పులు కారణంగా ఆదివాసీ భాషలు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

మనమిప్పుడు భాష మూలాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. “బోలో చేతో “అనే ఫౌండేషన్, వ్యవస్థాపకుడు కిరణ్ ఆదివాసీ ప్రాంతాల్లో కొ-గో భాషలు మీద అవగాహన కార్యక్రమం ఉట్నూర్, ఐటిడిఎ కొమురం భీం కాంప్లెక్స్ జరిగింది. అనేకమంది ఉత్సాహంగా కోలమి గొండి” అంటే పాటలు మరియు ధింసా న్రృత్యాలు చేసారు. ఆ యువకులు ఇంటర్, డిగ్రీ, చదివి మరియు “కొలామి వికీ “వ్యాసం పాటలు చరిత్రను వ్యాసాలు రాయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదంతా ఎక్కువగా సమాచారం పూర్తిగా అందుబాటులో తేవాలన్నదే ఉద్దేశం. అలా కొలామి భాష యువకులను ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే భాషలను కాపాడుకోవచ్చు.

“మావ నాటే మావ రాజ్యం-మా ఊళ్ళో మా రాజ్యం” అని కొమురం భీం 1930వ దశకంలో జోడేఘాట్ నినాదమాచ్చిండు. మళ్ళీపుడు “మావ నాట మావ భాష” అని బోలో చేత్ ఫౌండేషన్ అదిలాబాద్, ఉట్నూర్ గొండి, కొలామి ఆదిమ తెగలు ప్రజలతో కలిసి ఈ కొలామి భాష అంతరించిపోకుండా సంస్కృతి సంప్రదాయాలు రీతులు రివాజులు మన భవిష్యత్తు తరాలకు అందివ్వడం లక్ష్యంగా భాషను ఇప్పుడు టెక్నాలజీ తో అందరికి పరిచయం అయ్యేలా” కొలామి వికి” ఏవిధంగా కొలామిలో వ్యాసాలు, పాటలు, పండుగలు… అనేకానేక విషయాలు ఎట్లా పోందుపరచవచ్చు. అని కొలామి వారికి నేర్పించారు. ఇది గొప్ప పరిణామం .

ఇంకాప్రపంచవ్యాప్తంగా 7000భాషలు మరియు భారతదేశంలో 1600 భాషలకు పైగా ఉన్నాయి. మరో 20100 సంవత్సరం వరకు ఇవి అంతరించిపోయే దశకు చేరుకుంటాయని సర్వేలు హెచ్చరించారు. “కొలామి-వికీపిడియా” మీద సుమారు ఐదువందల మంది కొలామి గిరిజన తెగవారు అవగాహన పెంచుకోవడానికి మరియు సంస్కృతి సంప్రదాయాలు రీతులు రివాజులు పరిరక్షణకు క్రృషికి చేస్తామని “బోలో చేతో” సహాకారం ఉంటామని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ఉట్నూర్ ఐటిడిఎ, ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్ గారూ, వసంత్ రావ్, పాల్గొని ప్రసంగించారు. దీనికి క్రృషి చేస్తున్న “బోలో చేతో” ఫౌండర్,సాయికిరణ్, కశ్యప్ ప్రోగ్రాం డైరెక్టర్ అభినందనలు తెలిపారు. అదిలాబాద్ సంస్కృతి సంప్రదాయాలు భాషలోని ముడిపడి ఉంది. దీన్ని కాపాడడానికి భాషా చైతన్యం, రాజకీయ, మేధావులు, కళాకారులు ప్రభుత్వం కూడా భాష పరిరక్షణకు పాటుపడాలంతే! ఉమ్మడి ఆదిలాబాద్ భాష పరిరక్షణకు తోడ్పాడుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X