ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్, 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం (More News From BRS)

సకల హంగులతో కోహెడ మార్కెట్

వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు

ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్

199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తాం

48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం

కమీషన్ ఏజెంట్లు అందరికీ దుకాణాలు

16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం

11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్

56.54 ఎకరాల్లో రహదారులు

11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు

మార్కెట్ నిర్మాణ ప్రణాళిక ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకుని ప్రారంభిస్తాం
ప్రణాళికను చూసి సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు, మంత్రి

హైదరాబాద్: మంత్రుల నివాస సముదాయంలో కోహెడ పండ్లమార్కెట్ నిర్మాణంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, కౌసర్ మొహియుద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్ల బలాలా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఆర్డీడీఎం పద్మహర్ష, డీఎంఓ ఛాయాదేవి, మార్కెట్ కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు

——————–

రాష్ట్ర ప్రభుత్వంలో టిఎస్ఆర్టిసి సంస్థను విలీనం చేసిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా క్యాంపు కార్యాలయంలో అంబరాన్ని అంటిన సంబరాలు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తీసుకున్న సంచలన నిర్ణయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన – గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు..

ఆర్టీసీ ఉద్యోగులకు అన్నింటికీ మించిన పెద్ద కానుక.

కేంద్రం కార్పొరేషన్లను అమ్ముకుని ఉద్యోగులను నడిబజార్లో పడేస్తున్నది..

ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు..

43వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్న టీఎస్ఆర్టీసీ సిబ్బంది..

టిఎస్ఆర్టిసి సంస్థ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంచిపెట్టిన – గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు..

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయంలో టిఎస్ ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో టిఎస్ ఆర్టిసి ఉద్యోగులతో మిఠాయిలు పంచి టపాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టిఎస్ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆనందాన్ని వ్యక్తం చేసి మాట్లాడారు..

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి సంస్థలోని సిబ్బంది జీవితాంతం రుణపడి ఉంటారని – గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తున్నాను.

పెండింగ్ లో ఉన్న డీఏలు గౌరవ ముఖ్యమంత్రి గారు విడతలవారీగా చెల్లించడం జరిగిందని చెప్పారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు టిఎస్ఆర్టిసి సంస్థకు ప్రతిఏటా 1500 కోట్లు కేటాయించి ప్రత్యేకంగా టిఎస్ఆర్టిసి సంస్థకు ఆర్థికంగా తోడ్పడుతున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ది ఎంతో గొప్ప మనస్సని, ఎప్పట్నుంచి బాధల్లో, కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన గొప్ప వరం అందించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని అన్నారు. ఆరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ముందు రెండు కోరికలను పెట్టానని చెప్పారు. వెయ్యి కోట్ల నిధి గ్యారెంటీని కల్పిస్తే పీఎఫ్‌ చెల్లించి వారికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మంచిగా దక్కేలా చూడాలని .. రెండు పీఆర్‌సీ చెల్లించాలని కోరామన్నారు.

కానీ ఇవన్నీ తలకిందులు చేస్తూ కేసీఆర్‌ ఏకంగా కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని, ఇది ఎంతో పెద్ద మనస్సుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ ఇచ్చిన వరమని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43వేల మంది కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపారని, మేమంతా ఎప్పటికీ ఆయన చేసిన మేలును మరిచిపోమని, రుణపడి ఉంటామని గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గారు ఉద్యోగుల పక్షాన కేసీఆర్‌ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కార్పొరేషన్లను అమ్ముకుంటూ ఉద్యోగులను నడిబజార్లో పడేస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారనడానికి ఇదే తాజా నిదర్శనమని, కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో చేర్చుకోవడం చిన్న విషయమేమీ కాదని, ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని యావత్ రాష్ట్ర, దేశ ప్రజలు కూడా హర్షిస్తున్నారని అన్నారు. ఈ అసెంబ్లీ సెషన్లోనే ఈ బిల్లు పాస్‌ చేసి ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చుతామని, వారి ఉద్యమ స్పూర్తికి కానుకగా దీన్ని అందిస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయమని దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో టిఎస్ ఆర్టిసి అధికారులు ఆర్ ఎం జానీరెడ్డి, డిప్యూటీ ఆర్ఎంలు సరస్వతి, శంకర్, ఒకటో డిపో డిఎం ఆనంద్, రెండవ డిపో డిఎం వెంకటేష్, బోధన్ డి ఎం శ్రీనివాస్, బాన్సువాడ డి ఎం సదాశివ్, ఆర్మూర్ డి ఎం శ్రీనివాస్, కామరెడ్డి డి ఎం మల్లేష్, పిఓ పద్మజ, అంజన్న, నరేష్ చందర్ టీఎంయూ ఆర్టీసీ శ్రీనివాస్ వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.

————

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే రుణమాఫీ ఆలస్యమయింది

కరోనా మూలంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రం నష్టపోయింది

కేంద్రం ఎఫ్ ఆర్ బీఎం నిధులు విడుదల చేయకుండా తెలంగాణ పట్ల అనుసరించిన విధానం, నోట్ల రద్దు వల్ల ఏర్పడిన మందగమనం మూలంగా రుణమాఫీ ఆలస్యమయింది

నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆటంక కలగకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం

అందుకే ఇప్పటి వరకు రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమయింది

హైదరాబాద్: కరోనా విపత్తులోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగింది. రుణమాఫీ విషయంలో రైతులను మభ్యపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించినా రైతులు ఇన్ని చేసిన కేసీఆరే రుణమాఫీ చేస్తాడని రైతులు వారి మాటలను విశ్వసించలేదు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి, రైతులకే తొలి ప్రాధాన్యం అన్న దానికి కేసీఆర్ గారి పాలనే నిదర్శనం. రైతుల రుణమాఫీకి ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతుబిడ్డగా, రైతుల మంత్రిగా రైతుల పక్షాన ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.

————–

తాజాగా చెరుకు సుధాకర్ గారు ఫేస్బుక్లో భారత రాష్ట్ర సమితి గవర్నర్ కోటా అభ్యర్థుల ఎంపిక పైన రాసిన స్పందన

హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గం గవర్నర్ కోటాలో తెలంగాణ ఉద్యమకారుడు, టిఆర్ఎస్ లో కాంగ్రెస్ లో గరిష్ట స్థాయిలో విద్యాధికుడు, బిఆర్ఎస్ లో చేరిన తర్వాత  గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కింద ప్రకటించింది. తనతో పాటు ఎరుకల సామాజిక వర్గానికి చెందిన విద్యాధికుడు కుర్ర సత్యనారాయణ కూడా ఎమ్మెల్సీ ప్రకటించింది. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అదే విధంగా తెలంగాణ ఆకాంక్షల పరిపూర్తికి ప్రతిపక్షంగా ఆయన కంట్రిబ్యూషన్ను ఎవరు చిన్నగా చేసిన అది ఉక్రోషమే తప్ప ప్రజాస్వామిక దృక్పథం కాదు. దొర బూట్లు నాకుతున్న అందుకు నజరానా అని కొందరు, ఎమ్మెల్యే ఇవ్వలే కానీ ఎమ్మెల్సీ తో సరిపెట్టిందని కొందరు, ఈమధ్య కొన్ని పార్టీలని, వ్యక్తుల్ని గురిపెట్టి తిట్టినందుకు ప్రతిఫలం అని  కొందరు, ఇంత పరుష పదజాలం అవసరం లేదేమో. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, అందులో నాయకత్వాలు అవకాశాలు ఎంత అవకాశవాదంతో, ఏకదృవంగా, దొరతనం కప్పుకొని ఇష్ట రాజ్యం చేస్తూ ఎదుగుతున్న అట్టడుగు వర్గాల  నాయకుల అవకాశాలను అని చెప్పి ఎంత దారుణంగా ఎంత నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారో చర్చించుకుందాం.

దొరతనంతో పోరాడే రాజకీయ పార్టీలు వాళ్ళ నాయకులకు  దొర పోకొడలేని అందరికీ అవకాశాలు కల్పించే ప్రజాస్వామిక ధోరణి  ఉండాలి , ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటన మీదే ఒక నాయకుడు టిఆర్ఎస్ లో అయితే ఒకే దొర.. మిగతా పార్టీలో అందరూ దొరలే. అన్న దానికి సమాధానం చెప్పాలి. కెసిఆర్ ఏకపక్ష దొరస్వామ్యం మీద మాట్లాడే సోషల్ మీడియా మిత్రులు ఎవరైనా ముఖ్యంగా ఆధిపత్య కులాల నుంచి ఆత్మవంచనతో అహంకారంతో అనవసరమైనటువంటి అవమానకరపరుష పదజాలం వాడకూడదని, ఈ ట్రెండ్ ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదని విజ్ఞప్తి. ఉద్యమ కాలంలో కేసీఆర్ ముందు  జాగింగ్ చేసి నిలబడ్డందుకు ఏది పడితే అది మాట్లాడారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో పాద పూజలు, జావా గారి సాగుల పడడాలు నిషేధము చెప్పండి . ఎరుకల సామాజిక వర్గం నుంచి వెతికి వెతికి కుర్ర సత్యనారాయణకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను.రాజశేఖర్ రెడ్డి గారు వెతికి వెతికి వరంగల్ నుండి రజక సామాజిక వర్గం నుంచి బసవరాజు సారయ్య ను ఎమ్మెల్సీగా చేశారు. చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆదిలాబాద్ నుండి పొగాకు యాదయ్యను సంచార జాతుల నుండి చేసినట్టుగా గుర్తు. ఇప్పుడు ఆ సున్నితత్వం ఆ నిజాయితీ లోపించి , బయట ఉన్న వివిధ సామాజిక వర్గాలు ఏమంటాయో అన్న భయం లేకపోవడం  చాలా సాధారణమైపోయింది.

వేదిక మీద కూర్చున్న, ఏదైనా వేదిక పంచుకున్న ఏ వర్గమూ దాన్ని ఇది మా బలగమని ప్రకటించవద్దు.., అది బలగం కంటే జలగల సమూహంగా కనపడుతుంది. రాజకీయంగా ఎవరిని ఏమైనా అన్నా.పర్వాలేదు. ట్రోలింగ్ పద్ధతిలో కామెంట్ చేయకండి. ఈ పోస్టింగ్ని రాజకీయ కోణంలో ఏదో జరిగిపోతున్నట్టుగా ప్రచారం చేసిన పర్వాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల మీద ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం, చిల్లర రాతలు రాయడం పరిపాటి అయింది. ఇది ఆగాలని కోరుకుంటున్నా. ఇందులో ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. కొత్తగా మంత్రివర్గం నుండి సిఫారసు చేయబడ్డ  MLC అభ్యర్థులు దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ ఇద్దరికీ అభినందనలు.వెతికి వెతికి కాంగ్రెస్లో ఢిల్లీ అధిష్టానం సామాజిక కూర్పు కోసం రాజ్యసభ సభ్యుడుగా ఒకసారి రాపోలు ఆనంద్ భాస్కర్ ను ఎన్నిక చేసి పంపడం గుర్తుతెచ్చుకుందాం. అన్ని అవకాశాలు తమకే కావాలని దుష్టపన్నగాలు పన్నేవారు కూడా నీతి వచనాలు చెబితే బాగుండదు.

ఎమ్మెల్సీ పదవులకు నిజానికి ఒకరకంగా. పెద్ద ప్రాధాన్యత. అది దండుగా మారి ఖర్చుల సభ అని రద్దు చేయాలని తీర్మానాలు చేసి చివరకు రద్దు కూడా అయింది. మనందరం ఆ రద్దుకు మద్దతు పలికిన తెలివిగా కెసిఆర్ అది కొనసాగేలా కొత్త రాష్ట్రంలో అది కొనసాగేలా చూశారు. డైరెక్ట్ ఎన్నికల్లో కొన్ని కులాలకు అవకాశం రానప్పుడు శాసన మండలిలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ఇప్పుడు ఎవరి రాజకీయ క్రీడలోనైనా భాగమే. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నాయకులకు ఇవాళ అదొక స్పేస్ ఇవ్వగలిగే ప్లాట్ఫారం. చూద్దాం ఎన్నికల ముందు ఒక్కరు ఒక్కరు రాజకీయ పార్టీలుగా తమ పాత మూస పద్ధతిని మార్చుకుంటూ నవీకరించబడతారు. రియల్ ఛాలెంజ్.

—————–

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం

తెలంగాణ రాకముందు నీటి కోసం జిల్లాల మధ్య నీటి యుద్ధం

నేడు సాగు, తాగు నీటి కి ఇబ్బందులు లేకుండా అందజేత

లోయర్ మానేర్ జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీరు విడుదల

ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి ఎగువ మానేరుకు కూడా నీటి విడుదల

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్: తెలంగాణ రాకముందు నీటి కోసం జిల్లాల మధ్య నీటి యుద్దాలు జరిగేవని, నేడు స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సస్య శ్యమలం అయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. లోయర్ మానేర్ జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మనేరు నుండి దిగువకు 9 లక్షల ఎకరాల సాగుభూమి కోసం నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. రైతుల నుండి డిమాండ్ తక్కువగా ఉన్నందున కాకతీయ కాలువ ద్వారా ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని, అవసరం అయితే పెంచుతామని అన్నారు. ఈ కాలువ ద్వారా నీరు వరంగల్ జిల్లా మీదుగా సూర్యాపేట వరకు వెళ్లనున్నయని తెలిపారు.

తెలంగాణ రాక ముందు ఇదే మానేరు జలాశయం నుండి ఆనాటి కాంగ్రెస్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా కు నీటిని తీసుకెళతానని చూస్తే మా జిల్లాకు ఇచ్చిన తర్వాతే నీటిని తీసుకెళ్లాలని ఆందోళన చేసి ఆపేసామని గుర్తు చేశారు. తెలంగాణ రాక ముందు నేర్రలు బారిన నేలలతో గొంతులు ఎండి పోయిన పరిస్థితులు ఉండేవని, కానీ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 40 నుండి 50 టీఎంసీ ల నీటిని అందిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం నీటితో చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లి పంటలు సమృద్ధిగా పండి దిగుబడి గణనీయంగా పెరిగిందనీ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి ఎగువ మానేరుకు కూడా డిమాండ్ మేరకు నీటిని విడుదల చేస్తామని అన్నారు.

————–

రైతుబాంధవుడు సీఎం కేసీఆర్

ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫి

రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం, సాగునీరుతో తెలంగాణ రైతాంగానికి స్వర్ణయుగం

స్వల్పకాలంలో ఐదింతలు ధాన్యం దిగుబడులతో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ

రైతు సంక్షేమం, అభివృద్ది కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ణతలు – మంత్రి గంగుల కమలాకర్

దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విదంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా రైతాంగ అభివృద్ది, సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారని, నేడు రైతులకు రుణమాఫీకోసం కార్యాచరణ రూపొందించడం పట్ల కేసీఆర్ గారికి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. నేడు విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమంలో తిరుగులేనిదన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, ఎప్ఆర్బీఎం పరిమితులు, నోట్లరద్దు, జీఎస్టీ వంటి కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయినా తెలంగాణలో రైతుల కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నారని, నేడు 19వేల కోట్ల భారాన్ని భరిస్తూ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకమన్నారు మంత్రి గంగుల.

తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం పంటపెట్టుబడి సాయం కింద ఎకరానికి 10వేల చొప్పున రైతుబందు అందజేయడమే కాకుండా, 5లక్షల రైతుబీమా, నిరంతరాయ నాణ్యమైన ఉచిత కరెంటు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో పాటు వ్యవసాయానికి ముఖ్య అవసరమైన జలాలను కాళేశ్వరం ద్వారా అందుబాటులోకి తెచ్చి రాష్ట్రాన్ని వ్యవసాయ వనరుగా, ధాన్యాగారంగా తీర్చిదిద్దారన్నారు మంత్రి గంగుల కమలాకర్.

కేవలం 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ నుండి అనతి కాలంలోనే కొటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసేవిదంగా ఐదింతలు పంట దిగుబడులను పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారన్నారు. తెలంగాణ రైతాంగం కోసం వారు పండించిన మొత్తం పంటను ఎంత నష్టమైనా భరించి వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను రైతుల చెంతనే ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరతో సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. అన్నివిదాలుగా అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ గారికి తెలంగాణ రైతాంగం పక్షాణ, రైతుబిడ్డగా తన తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.

ప్రజా సేవ కే నా జీవితం అంకితం

సేవా లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాను

ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక సేవలు చేస్తున్నాను

కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నాను

సాగునీటి ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశాను

మహిళల అభివృద్ధి కోసం కుట్టు శిక్షణ, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేశాను

యువతకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాను

ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులను ఇప్పిస్తున్నాను

ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్ అందజేశాను

లక్షలాదిమందికి వైద్య సేవలు అందించి ఆరోగ్య శ్రీ కి స్ఫూర్తిగా నిలిచాను

ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసే వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారు

నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు

అందుకే వరుసగా నన్ను ప్రజలు గెలిపిస్తున్నారు

ఏం చేసినా ప్రజల రుణం తీర్చుకోలేను

జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటాను

పదిమందికి సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదు

ప్రజల ఆశీస్సుల వల్లే ఈ రోజు నాకు జన బంధు అవార్డు

నాకు అవార్డు ఇచ్చిన శాంతి కృష్ణ సేవా సంస్థకు ధన్యవాదాలు

జన బంధు అవార్డు పొందిన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

అభినవ శివాజీ మన ఎర్రబెల్లి దయాకర్ రావు
-సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

రవీంద్ర భారతి, హైదరాబాద్ : ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసే వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారని, ప్రజా సేవ కే నా జీవితం అంకితం. సేవా లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక సేవలు చేస్తున్నాను. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి లో శాంతి కృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఓటమి ఎరగని నేతగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ప్రజాప్రతినిధిగా ప్రజలతోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజానేతగా జనం గుండెల్లో నిలిచిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి జన బంధు అవార్డు ను అందించారు.

ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక సేవలు చేస్తున్నాను. వేలాది మందికి కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నాను. సాగునీటి ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశాను. 10 వేల మంది మహిళల అభివృద్ధి కోసం కుట్టు శిక్షణ, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేశాను. వేలాది మంది యువతకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాను. 17 వేల మంది ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులను ఇప్పిస్తున్నాను. 70 వేల మంది ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్ అందజేశాను. లక్షలాదిమందికి వైద్య సేవలు అందించి ఆరోగ్య శ్రీ కి స్ఫూర్తిగా నిలిచాను అన్నారు.

ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసే వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారు. నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే వరుసగా నన్ను ప్రజలు గెలిపిస్తున్నారు. ఏం చేసినా ప్రజల రుణం తీర్చుకోలేను. జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటాను. పదిమందికి సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదు. ప్రజల ఆశీస్సుల వల్లే ఈ రోజు నాకు జన బంధు అవార్డు. నాకు అవార్డు ఇచ్చిన శాంతి కృష్ణ సేవా సంస్థకు ధన్యవాదాలు అంటూ మంత్రి ఉద్వేగానికి గురయ్యారు.

జన బంధు అవార్డు పొందిన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…. సమైక్య పాలనలో ఎవరూ పట్టించుకోని పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలని ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యే అయ్యాక అన్ని రకాలుగా అభివృద్ధి పరిచానని తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసే నాయకులనే ప్రజలు ఆదరిస్తారని గౌరవిస్తారని ఆయన అన్నారు. తాను మొదటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని ఆ తర్వాత దాన్ని గుణపాఠంగా తీసుకొని ప్రజల్లోనే ఉంటూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై నా జీవితాన్ని ప్రజలకే అంకితం చేశానని అందువల్లే తాను ఓటమి ఎరగకుండా గెలుస్తూ వస్తున్నానని మంత్రి తెలిపారు. ప్రజల ఆదరణ ఉన్నంతకాలం తనను ఎవరు ఏమీ చేయలేరని ఆయన అన్నారు. తాను తన కుటుంబం మొత్తం ప్రజా జీవితానికి అంకితమయ్యామని ప్రజల మేలు కోసం పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రభుత్వపరంగా జరిగే అభివృద్ధితో పాటు ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా పాలకుర్తి నియోజకవర్గం లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని అవన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు.

గతంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ వైద్య సేవా కార్యక్రమాలు చేపట్టాను. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఆడిటోరియం నిర్మాణానికి నిధులు సేకరించాను. ఎంజీఎం వైద్యశాల అభివృద్ధి కోసం ఎదురు సేకరించి పాటు పడ్డాను. అని మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా మంచినీటి ప్లాంట్లను
ఏర్పాటు చేసి, మంచినీటిని ప్రజలకు అందించాను. పాలకుర్తి నియోజవర్గం లో కరోనా సమయంలో నిరుపేదలను, ప్రజలను అనేక విధాలుగా ఆదుకున్నం. కుటుంబ సభ్యులే కరుణ బాధితులను పట్టించుకోని సమయంలో వారి బాగోగులు చూశాను. చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేశాను. ప్రతి మండలానికి ఆక్సిజన్ తో కూడిన అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేశాను. నెల్లూరు నుంచి ఆనందయ్య మందు తెప్పించి ప్రజలందరికీ ఉచితంగా పంచాను. అన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత కుట్టు శిక్షణ, ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నాను. చదువుకున్న మహిళలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ శిక్షణ పూర్తి చేసి వారికి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించడానికి ఏర్పాట్లు చేశాను. దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాను. అనేకమందికి ద్విచక్ర వాహనాలు ఇచ్చాను. అని మంత్రి తెలిపారు


-సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

ఆత్మీయ అతిథిగా హాజరైన మాజీ సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రజలు దైవంగా కొలిచే నాయకుడు ఛత్రపతి శివాజీ అని వారి లక్షణాలు ఇప్పటి వరకు నేను ఎవరిలో చూడలేదని ఆ లక్షణాలన్నీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వున్నాయి అని అన్నారు. నిజమైన నాయకుడు గుండెతో ఆలోచించాలి అని అలాంటి లక్షణమే మంత్రి ఎర్రబెల్లి కి వుందన్నారు. ఈ జనబంధు అవార్డుకు సరైన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అని కొనియాడారు. వారి నియోజకవర్గాల్లో ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా చేసిన అనేక కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్ళానన్నారు.

అక్కడి ప్రజలకు ఏమి కావాలో తెలిసిన నేత మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అలాగే రాష్ట్రం, దేశం, నగరాలు, గ్రామాలు సమంగా అభివృద్ధి చెందాలి అనేది నా ఆకాంక్ష అని, ఆ ఆకాంక్ష ను తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాను అన్నారు. జాతీయ స్థాయిలో మన గ్రామాలు అనేక అవార్డులు పొందాయి అంటే ఆ ఘనత సీఎం కెసిఆర్ గారు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికే దక్కుతుంది అన్నారు. నేను దేశంలోని ఆదర్శ గ్రామాల పై డాక్టరేట్ చేస్తున్నాను అన్నారు. తాను పరిశోధనలో భాగంగా తెలంగాణలోని అనేక గ్రామాలను సందర్శిస్తున్నాను అన్నారు. కొందరికి అవార్డులు ఇస్తే, ఆ అవార్డులు గర్విస్తాయి అని, నేను రాజకీయాల్లోకి రావాలనే కోరిక మంత్రి ఎర్రబెల్లి లాంటి నాయకులను చూశాకే పుట్టిందన్నారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా ఆత్మీయ అతిథులుగా హాజరైన ప్రముఖులంతా మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ప్రజాసేవ కార్యక్రమాలను కొనియాడారు. అలాగే దయన్న మాస్ లీడర్ అని ప్రజల గుండెల్లో నిలిచిన జననేత అని అందుకే ఇవ్వాళ ఈ అవార్డు జన బంధు ఆయనకు సరిగ్గా సరిపోయే గొప్ప గుర్తింపుగా కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్, విశిష్ట అతిథులుగా రామడుగు నరసింహశాస్త్రి, దైవజ్ఞశర్మ, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, వికలాంగుల సంస్థల రాష్ట్ర చైర్మన్ వాసుదేవ రెడ్డి, కి చైర్మన్ సతీష్ రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరి శంకర్, రైతు రుణమాఫీ చైర్మన్నాగూర్ల వెంకన్న, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ డి శ్రీకాంత్, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, ఉమ్మడి వరంగల్ మాజీ జెడ్పీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ రామచంద్రయ్య శర్మ, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీ లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు రైతు కోఆర్డినేటర్ లు, పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు యువకులు దయాకర్ రావు గారి అభిమానులు శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

—————

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన పైన రేపు భారత రాష్ట్ర సమితి సంబరాలు

గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో రైతులతో భారీగా సంబరాలు నిర్వహణకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు*

హైదరాబాద్ : రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు ఈరోజు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు పిలుపునిచ్చారు. ఇప్పటికే గత తొమ్మిది సంవత్సరాలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టినదని, రైతన్నలకు హామీ ఇచ్చిన మేరకు ఈరోజు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించడం అత్యంత సంతోషకరమైన విషయం అన్నారు.

అనేక సందర్భాల్లో రైతుల వెంట నిలిచిన పార్టీ శ్రేణులు తాజాగా రైతన్నలకు రుణమాఫీ అంశంలోనూ వారితో కలిసి సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రతి గ్రామము, మండలము, నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతులందరితో కలిసి సంబరాలను ఎవరికి తోచిన విధంగా వారు నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జి లు, జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ సంబరాల తాలూకు కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతుబంధు సమితులతో పాటు సహకార సంఘాల ప్రతినిధులు కూడా ఈ సంబరాల్లో  పాల్గొనాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X