हैदराबाद: मेडचल (तेलंगाना) जिले के दुंडीगल थाना क्षेत्र में एक दर्दनाक घटना घटी है। एसआई प्रभाकर रेड्डी का दिल का दौरा पड़ने से निधन हो गया। गंडीमैसम्मा इलाके में अपने घर पर रात करीब नौ बजे अचानक दिल का दौरा पड़ने से एसआई प्रभाकर गिर पड़े। यह देख परिजन उसे अस्पताल ले गये। लेकिन डॉक्टरों ने पुष्टि की कि अस्पताल ले आ आने से पहले उसकी मौत दिल का दौरा पड़ने से हो गई है। प्रभाकर के निधन से परवार में मातम छा गया है।
गौरतलब है कि हाल ही में दिल का दौरा पड़ने से होने वाली मौतों में वृद्धि हुई है। तब तक चलने-फिरने वाले अचानक धराशायी हो रहे हैं। यहां तक कि जो लोग एक्सरसाइज करके फिटनेस को प्राथमिकता देते हैं, वे भी हार्ट अटैक के कारण सेकेंडों में अपनी जान गंवा रहे हैं। चिंता की बात यह है कि 30 साल के युवक भी हार्ट अटैक से मौत रही हैं। जिम करते, गेम खेलते और डांस करते समय अचानक हार्ट स्ट्रोक के कारण नीचे गिर जा रहे हैं। अस्पताल ले जाने से पहले ही उनकी मौत हो रही है।
कोरोना के बाद हार्ट अटैक से मौतों का बढ़ना चिंताजनक है। दिल के दौरे से होने वाली अधिकांश मौतों के कारणों का पता नहीं चल रहा है। डॉक्टरों का कहना है कि हार्ट स्ट्रोक की वजह खान-पान पर ध्यान न देना और ठीक से नींद न लेना/होना है।
पिछले दिनों हैदराबाद में एक कांस्टेबल की जिम करते समय दिल का दौरा पड़ने से मौत होने का सीसीटीवी फुटेज सोशल मीडिया पर वायरल हो गया। जिम में वर्कआउट के दौरान हार्ट अटैक से उसकी मौत हो गई। उसके बाद प्रदेश में कई कांस्टेबल और एसएस की हार्ट अटैक से मौत हो चुकी है।
గుండెపోటుతో ఎస్‌ఐ మృతి
హైదరాబాద్: మేడ్చల్ (తెలంగాణ) జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి మృతి చెందాడు. గండిమైసమ్మ ప్రాంతంలోని తన ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మిక గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రభాకర్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. అప్పటివరకు యాక్టివ్‌గా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తేవారు కూడా హార్ట్ ఎటాక్‌కు గురై సెక్లన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకులు కూడా గుండెపోటుతో మరణిస్తుండటం కలవరపెడుతోంది. జిమ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, డ్యాన్స్ వేస్తూ ఒక్కసారిగా హార్ట్‌స్ట్రోక్‌తో కింద పడిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోతున్నారు.
కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఎక్కువగా జరుగుతున్న గుండెపోటు మరణాలకు కారణాలు ఏంటనేది అర్ధం కావడం లేదు. ఆహార జాగ్రత్తలు తీసుకోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం లాంటివి కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు.
గతంలో హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచిన సీసీ టీటీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిమ్‌లు వర్కౌట్లు చేస్తూ ఒక్కసారిగా హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. ఆ తర్వాత రాష్ట్రంలో పలువురు కానిస్టేబుళ్లు, ఎస్‌లు గుండెపోటుతో మరణించారు. (ఏజెన్సీలు)