Hyderabad: హైదరాబాద్ మరియు దూలపల్లి అటవీశాఖ ఆకాడమి కేంద్రంలో శిక్షణ పొందుతున్న 32 వ బ్యాచ్ చెందిన 39 మంది బీట్ అధికారులు, శనివారం మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యంలోని జీవవైవిధ్యం, చిరుత, ఇండియన్ గార్, నీల్గాయి వాటి ఆవాసాలు మరియు అడవిలోని జలపాతాలు ప్లోరా ,పానా మొక్కలు అరుదైన జాతులు, ఫారెస్ట్ ఫిల్మ్ టూరిజం మంచిర్యాల గురించి ప్రముఖ సినిగేయ రచయిత అక్కల చంద్రమౌళి ఎఫ్ ఆర్ వోల బ్రృందానికి అవగాహన కల్పించారు.
అడవి మీద రాసిన పాటలను పాడి వినిపించగా సంతోషం వ్యక్తం చేసారు. సుమారు రెండు గంటల పాటు 659,660 కంపార్ట్ మెంట్, బీట్ ఓల్డ్ మంచిర్యాల ముల్కల సెక్షన్ మంచిర్యాలలోని ఆర్ ఎఫ్ ర్యాలీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అడవి ప్రాముఖ్యత, రాబోయే తరాలకు కాపాడాలని వారికి తెలియజేశారు. పారెస్ట్ రెంజి అధికారి శివజ్యోతి పాల్గోన్నారు .