హైదరాబాద్ : గాంధీ భవన్ కు చేరుకున్న ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే. ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
గాంధి భవన్ లో లాల్ బహదూర్ శాస్ర్తీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు.
ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే చేరుకున్నరు. శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు. ఠాక్రే గాంధీ భవన్ లో ఉదయం 10.30 నుంచి వరసగా సమావేశాలు నిర్వహించనున్నరు.
ముందుగా ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్న ఠాక్రే. తరువాత పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేత, పీఏసీ సభ్యులతో వ్యక్తిగత భేటీలు. రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యులతో సమావేశం కానున్న ఠాక్రే. రేపు డీసీసీ లు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, అధికార ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్న ఠాక్రే.