Long Live Errebelli : దాదాపు 180 ఎకరాల భూమిని శ్రీ రామ చంద్ర మిషన్ కు మంత్రి ఎర్రబెల్లి అప్పగించారు

హైదరాబాద్ : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్ల వాడ గ్రామం గొట్ల కొండ కొండల మధ్య ఎర్రబెల్లి వారి కుటుంబాల తరపున తరతరాలుగా ఉన్న దాదాపు 180 ఎకరాల భూమిని కొలను శ్రీ వేంకటేశ్వర స్వామి ట్రస్టు మరియు ఎర్రబెల్లి ట్రస్టు తరపున శ్రీ రామ చంద్ర మిషన్ కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం అప్పగించారు. ఈ మేరకు ఆ భూమికి సంబంధించిన పత్రాలను, మ్యాప్ లను శ్రీ రామచంద్ర మిషన్ కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ యోగా గురువు కమలేశ్ డి పటేల్ దాజీ కి మంత్రి పర్వతగిరిలో అందచేశారు.

అంతకు ముందు మంత్రి ఆ భూమిని స్వయంగా దాజీ కి చూపించారు. తద్వారా అంతర్జాతీయ యోగా కేంద్ర ఏర్పాటుకు సుగమం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తరతరాలుగా తమకు వారసత్వంగా వస్తున్న భూమిని తమ ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. యోగా ఒక గొప్ప జీవన విధానమని, ప్రతి ఒక్కరి మానసిక ప్రశాంతతకు, ప్రపంచ శాంతి కి, సౌభాగ్యానికి మూలమని, యోగా ను విశ్వ వ్యాప్తం చేసి, అందరికీ పరివ్యాప్తం చేయాలనే సంకల్పంతోనే తాను ఈ మహాత్కార్యానికి పునుకున్నట్లు మంత్రి చెప్పారు.

కాగా, దాజీ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ రామచంద్ర మిషన్ ను తెలంగాణలో విస్తరించాలన్న ఆలోచనను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాణ ప్రదం చేశారని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గొప్ప ఉదారతను చాటుకున్నారు. వారి సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ యోగా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి, ఎర్రబెల్లి ట్రస్టు కి దా జీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X