हैदराबाद : नागरकर्नूल बस स्टैंड परिसर में एक युवक ने चाकू से जमकर उत्पात मचाया और एक युवती पर चाकू से हमला करने के लिए उसके पीछे पड़ गया। यह घटना गुरुवार को नागरकर्नूल जिला बस स्टैंड के परिसर में प्रकाश में आई है।
पुलिस ने बताया कि बिजिनपल्ली मंडल के नंदीवड्डेमान गांव का युवक एसके अहमद एक मोटर वाइंडिंग मरम्मत केंद्र में काम करता है। इस बीच पुलिस की शुरुआती जांच में पता चला कि डिस्ट्रिक्ट सेंटर के एक कंप्यूटर कोचिंग सेंटर में कोचिंग लेने आई कुछ युवतियों के संपर्क में आया। युवक डिस्ट्रिक्ट सेंटर के एक लॉज में युवतियों और लड़कियों को ले जाता और अपने जाल में फंसता था।
गुरुवार को जब युवक को पता चला कि एक युवती दूसरे युवक के संपर्क में है तो वह गुस्से में आ गया और बस स्टैंड पर युवती को चाकू से मारने की कोशिश की। स्थानीय लोगों ने इसे देखा और उसे पकड़कर पुलिस को सौंप दिया। पुलिस जांच के दौरान चौंकाने वाले तथ्य सामने आए हैं। महिला दिवस पर पुलिस उसकी बातें सुनकर हैरान रह गई।
पुलिस ने जांच में फोन वीडियो के जरिए इस बात की पुष्टि की है कि युवतियों और लड़कियों के साथ जबरन दुष्कर्म किया है। उनके साथ वीडियो बनाकर धमकाया गया है और कई बार शारीरिक शोषण किया है। अब पुलिस उस दिशा में गहन जांच कर रही है। नाबालिग लड़कियां भी इस युवक की धोखा का शिकार हुई है। खास बात है कि अंतरराष्ट्रीय महिला दिवस पर ये तथ्य सामने आये हैं।
యువతిపై కత్తితో దాడికి యత్నం, విచారణలో షాకింగ్ నిజాలు
హైదరాబాద్ : నాగర్ కర్నూల్ బస్ స్టాండు ప్రాంగణంలో ఓ యువకుడు కత్తితో వీరంగం సృష్టిస్తూ ఓ యువతిని పొడిచేందుకు వెంటపడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంగణంలో గురువారం చోటుచేసుకుంది.
బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన ఎస్ కె అహ్మద్ అనే యువకుడు జిల్లా కేంద్రంలోని ఓ మోటార్ వైండింగ్ రిపేర్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. కాగా జిల్లా కేంద్రంలోని ఓ కంప్యూటర్ కోచింగ్ వద్ద కోచింగ్ తీసుకోవడానికి వచ్చే కొందరు యువతులతో పరిచయం పెంచుకొని జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో యువతులు, బాలికలను లోబర్చుకునే వాడని పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది.
కాగా ఓ యువతికి మరో యువకుడితో పరిచయం ఉందని తెలుసుకున్న యువకుడు గురువారం బస్టాండ్‌లో ఉన్న యువతిపై కోపంతో ఊగిపోతూ కత్తితో పొడిచేందుకు యత్నించాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించగా పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మహిళా దినోత్సవం రోజే ఈ నిజాలు విన్న పోలీసులకు దిమ్మతిరిగింది.
యువతులు, బాలికలను బలవంతంగా లోబార్చుకొని అట్టి వీడియోలు తీసి బెదిరించి పలుమార్లు బలవంతంగా శారీరకంగా వాడుకున్నట్లు ఫోన్ వీడియోల ద్వారా పోలీసులు నిర్ధారించి ఆ దిశగా విచారిస్తున్నట్లు తెలిసింది. మైనర్ బాలికలు కూడా ఈ యువకుడి బారినపడి మోసపోయినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే ఈ వాస్తవాలు బయట పడుతుండడంతో విశేషం. (ఏజెన్సీలు)