RESEARCH SHOULD BE DONE TO REDUCE SOCIAL AND ECONOMIC INEQUALITIES: Prof Seetharama Rao

• BRAOU Organised Two Day webinar

Hyderabad : Department of Business Management, Dr. B. R. Ambedkar Open University organized a Two Day Webinar on “Research Methodology and Case Analysis” from 28th to 29th October, 2023 at its Campus on Saturday.

Prof. K. Seetharama Rao, Vice Chancellor, BRAOU attended as the Chief Guest for the Program and said that all universities should encourage research aimed at new innovations for the quick solution of social and economic problems. According to the changing conditions, changes should be made in the design of the courses so that it can be useful to the society. It is suggested that the success stories of those who have reached the top in the respective departments should be studied and made available to the society.

Prof. Ghanta Chakrapani, Director Academic and Dr.A.V.R.N. Reddy, Registrar, BRAOU, guest of honours for the program and spoke on the occasion and suggested that the research should be done innovatively keeping in mind the welfare of the society. Pro.f I. Anand Pawar, Dean, Faculty of Commerce and Webinar Director, Preside over the function. Prof.Y.S.Kiranmayi, Webinar Co-Director, shared the initiatives of the program. Dr.P.Radha Krishna, Asst. Professor Department of Business Management & Convenor, shared their thoughts on this webinar.

In the first session: Dr.Nageswar Rao, (Retd) Professor of Management & Director, MSS Group of Institutions, Hyderabad, shared ideas on “Why Project Report for Management students. In the second session: Prof.|Y.S.Kiranmayi, (Retd) Professor of Business Management, Dr.BRAOU spoke on “Guidelines to write a Project work proposal / Synopsis.

In the third session, Prof. A. Patrick, Department of Commerce, Osmania University spoke on selecting the right Statistical Tools: Navigating Data Analysis in Project Reports. In the fourth session, Prof. I.Anand Pawar, Dean, Faculty of Commerce, Dr.BRAOU spoke on Project Report writing. In the fifth session, the Resource persons of all the technical sessions interaction with the participants.

All Directors, Heads of the Branches, Deans, Teaching and Non-Teaching staff members, Representatives services Associations and Research Students participated.

సామాజిక, ఆర్ధిక అసమానతలు తగ్గించేలా పరిశోధనలు జరగాలి : వీసీ, ప్రొ. సీతారామా రావు

•డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వెబినార్ ప్రారంభం

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మానేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో “పరిశోధన విధానం – కేస్ అనాలిసిస్” అనే అంశంపై రెండు రోజులు నిర్వహించనున్న వెబ్‌నార్ శనివారం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామారావు హాజారై ప్రసంగించారు.

అయన మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక సమస్యల సత్వర పరిష్కారానికి నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన పరిశోధనలను అన్ని విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కోర్సల రూపకల్పన పాఠ్యాంశాలలో మార్పులు చేయాలని, తద్వారా సమాజానికి ఉపయోగపడొచ్చు అని అభిప్రాయపడ్డారు. ఆయా విభాగాల్లో ఉన్నత శిఖరాలకు చేరిన వారి విజయ గాధలను అధ్యయనం చేసి సమాజానికి అందుబాటులో ఉంచాలని సూచించారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పరిశోధనలు వినూత్నంగా సమాజ శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొని చేయాలని సూచించారు. కార్యక్రమానికి డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ కామర్స్‌ అండ్ బిజినెస్ మానేజ్మెంట్, వెబ్‌నార్‌ డైరెక్టర్‌ ప్రొ.ఐ. ఆనంద్‌ పవార్‌ అధ్యక్షత వహించారు. కార్యక్రమ నిర్వహణ ఆవశ్యకతను ఆయన వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కో-డైరెక్టర్, ప్రొ. వై.ఎస్. కిరణ్మయి, ప్రోగ్రాం కన్వీనర్ డా. పి. రాధా కృష్ణ ప్రసంగించారు.

కార్యక్రమం మొదటి సెషన్ లో హైదరాబాద్ లోని ఎం.ఎస్.ఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ డా. నాగేశ్వర్ రావు “మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎందుకు” అనే అంశంపై ప్రసంగించారు. రెండో సెషన్‌లో డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకురాలు వై. యస్. కిరణ్మయి “ప్రాజెక్ట్ వర్క్ ప్రతిపాదన / సారాంశాన్ని రాయడానికి మార్గదర్శకాలు” అనే అంశంపై ప్రసంగించారు.

మూడో సెషన్‌లో, ఉస్మానియా విశ్వవిద్యాలయ వాణిజ్య విభాగ ప్రొ. ఎ. ఫ్యాట్రిక్ “సరైన స్టాటిస్టికల్ టూల్స్: నావిగేటింగ్ డేటా అనాలిసిస్ ఇన్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌” అనే అంశంపై వివరించారు. నాల్గో సెషన్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ కామర్స్ డీన్ ప్రొ. ఐ. ఆనంద్ పవార్ “ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ రైటింగ్‌” పై ప్రసంగించారు. కార్యక్రమంలో డా. డి.రవీంద్రనాథ్ సాల్మన్, పలు విభాగాల డీన్స్, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X