హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నవంబర్ 18న జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై నిజనిర్ధారణ కోసం యూనివర్సిటీ విద్యార్థుల బృందం వెళుతున్నట్లు ఓయూ విద్యార్ధులు తెలిపారు.
ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరులు సమావేశంలో విద్యార్థి ప్రతినిధులు మాట్లాడుతూ గత నెల 18న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల సంఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా, అతని భార్య రాజేతో పాటూ మరో నలుగురు చనిపోయారని పోలీస్ అధికారులు ప్రకటించినప్పటికీ ఆ ఘటనపై అనేక అనుమానాలున్నాయని విద్యార్ధులు ఆరోపించారు.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలలో మోస్టు వాంటెడ్‌గా పేరుగాంచిన హిడ్మా మూడంచల భద్రతా వలయంతో నిత్యం సంచరిస్తుంటాడనీ, అటువంటి వ్యక్తిని చంపడం అంత సులభం కాదని గతంలో అనేకమంది పోలీసు అధికారులు మాట్లాడిన మాటలను విద్యార్థులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ, దళిత, బహుజన, వామపక్ష విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్నారు. అయితే డిసెంబర్ 2 నుండి 8 వరకు మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ 25వ వార్షికోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఈ యాత్రను తలపెట్టడం ఆసక్తికరంగా మారింది.
దేశ వ్యాప్తంగా హక్కుల సంఘాలు, పౌర, ప్రజా సంఘాలు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం పెను అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రజాస్వామిక హక్కుల పట్ల, వారి ప్రాణాల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వుందో ఈ ఘటన తేటతెల్లమవుతుందన్నారు.
దేశంలోని ప్రజాస్వామిక వాదుల్లో, ప్రజల్లో భయానక వాతావరణం, గందరగోళం నెలకొన్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి ప్రాంతాల్లో జరిగిన సంఘటనకు సంబంధించిన వాస్తవాలు వెల్లడికావాల్సిన అవసరం ఎంతైన ఉందనీ, దీనికోసమే తాము నిజనిర్ధారణ కోసం వెళుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.
దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో ఏర్పడిన తమ బృందం డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి 5వ తేదీన సంఘటన స్థలాన్ని సందర్శించడమే కాకుండా మృతిచెందిన మావోయిస్టు కుటుంబ సభ్యులను కూడా కలుస్తామన్నారు.
ఇది కూడ చదవండి-
మావోయిస్టులకు బహిరంగ లేఖ
నిజ నిర్ధారణ బృంద సభ్యులు మావోయిస్టులకు బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ 4న బయలుదేరే తమ బృందానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.
చికిత్స కోసం విజయవాడకు వెళిన హిడ్మా, అతని భార్యతో పాటూ మరో నలుగురిని పోలీసులు పట్టుకొని కాల్చి చంపారన్న అభయ్ ప్రకటనను ఈ సందర్భంగా ఉదహరించారు. పోలీసులు, ఇటు మావోయిస్టు పార్టీ తమదైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిజాలు తెలిపేందుకే దేశవ్యాపిత విద్యార్థులతో కూడిన తమ బృందం ఈ నిర్ధారణను చేపడుతుందని గుర్తుచేశారు. (Social Media)
हिडमा एनकाउंटर की सच्चाई का पता लगाने यूनिवर्सिटी के स्टूडेंट्स
हैदराबाद: उस्मानिया यूनिवर्सिटी के छात्रों ने कहा कि यूनिवर्सिटी के स्टूडेंट्स का एक ग्रुप 18 नवंबर को आंध्र प्रदेश के अल्लूरी सीतारामाराजू जिले के मारेडुमिल्ली जंगल में हुए एनकाउंटर की सच्चाई का पता लगाने जा रहा है।
आर्ट्स कॉलेज में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में स्टूडेंट रिप्रेजेंटेटिव ने कहा कि 18 नवंबर को मारेडुमिल्ली जंगल इलाके में हुए एनकाउंटर से पूरा देश हैरान है। हालांकि पुलिस अधिकारियों ने घोषणा की कि माओवादी पार्टी सेंट्रल कमेटी के सदस्य माडवी हिडमा, उसकी पत्नी राजे और चार अन्य एनकाउंटर में मारे गए, लेकिन स्टूडेंट्स ने आरोप लगाया कि इस घटना को लेकर कईं प्रकार के संदेह हैं।
स्टूडेंट्स ने पुलिस अधिकारियों की बातें याद कीं कि माओवादी प्रभावित राज्यों में मोस्ट वांटेड के तौर पर जाने जाने वाले हिडमा हमेशा थ्री-टियर सिक्योरिटी नेट के साथ घूमते हैं और ऐसे व्यक्ति को मारना आसान नहीं है।
छात्रों ने आगे कहा कि हालांकि देश भर के राइट्स ग्रुप, सिविल सोसाइटी और पब्लिक ऑर्गनाइज़ेशन आरोप लगा रहे हैं कि यह एक फेक एनकाउंटर है, लेकिन सरकार की तरफ से, खासकर चीफ मिनिस्टर के तौर पर आपकी तरफ से कोई ऑफिशियल बयान न आना, गंभीर शक पैदा करता है।
उन्होंने कहा कि इस घटना से पता चलेगा कि सरकार डेमोक्रेटिक राइट्स और उनकी ज़िंदगी के प्रति कितनी लापरवाह और गैर-ज़िम्मेदार है। इस मामले में, जहां देश के डेमोक्रेटिक एक्टिविस्ट और लोगों में डर और कन्फ्यूजन का माहौल है, वहीं आंध्र प्रदेश के मारेडुमिल्ली इलाकों में हुई घटना से जुड़े फैक्ट्स सामने आने की बहुत ज़रूरत है और इसलिए वे सच का पता लगाने जा रहे हैं।
देश की जानी-मानी यूनिवर्सिटीज़ के स्टूडेंट्स की बनाई उनकी टीम 4 दिसंबर को हैदराबाद से निकलेगी और 5 तारीख को घटना वाली जगह का दौरा करेगी और मारे गए माओवादियों के परिवार वालों से भी मिलेगी।
माओवादियों को खुला खत
फैक्ट-फाइंडिंग टीम के सदस्यों ने माओवादियों को एक खुला खत भी लिखा है। उन्होंने माओवादियों से अपील की है कि वे 4 दिसंबर को बिना किसी परेशानी के उनकी टीम को जाने में सहयोग करें। इस मौके पर एक खुला खत जारी किया गया।
इस मौके पर अभय के उस बयान का ज़िक्र किया गया जिसमें कहा गया था कि हिडमा, उसकी पत्नी और चार अन्य लोग जो इलाज के लिए विजयवाड़ा गए थे, उन्हें पुलिस ने पकड़कर ले गई मारेडुमिल्ली में गोली मार दी। उन्होंने याद दिलाया कि देश भर के छात्रों वाली उनकी टीम यह वेरिफिकेशन कर रही है ताकि लोगों को सच्चाई से अवगत कराया जा सके, जबकि पुलिस और माओवादी पार्टी अपनी-अपनी दलीलें दे रहे हैं।
इस प्रोग्राम में आदिवासी, दलित, बहुजन और वामपंथी छात्र संगठनों के नेताओं ने हिस्सा लिया। हालांकि, यह दिलचस्प है कि छात्रों ने यह यात्रा माओवादी पार्टी द्वारा 2 से 8 दिसंबर तक PLGA की 25वीं सालगिरह के आयोजन के संदर्भ में शुरू की।
