हैदराबाद : सरकारी दफ्तरों में रिश्वतखोरी को खत्म करने के लिए सरकार कड़े कदम उठा रही है। इतना ही नहीं भ्रष्टाचार निरोधक ब्यूरो (एसीबी) को रिश्वत लेने वालों को पकड़ने के लिए पूरी ताकत भी दे दी है। इसी पृष्ठभूमि में शहर में सिंचाई विभाग में उप कार्यकारी अभियंता के पद पर कार्यरत पवन एसीबी के जाल में फंस गया है।
पवन ने उप्पल में एक व्यावसायिक इमारत को एनवीसी देने के लिए मालिक से 5 लाख रुपये की रिश्वत मांगी। इसके साथ ही पीड़ित ने स्वीकार किया कि वह 4 लाख रुपये देगा और एसीबी अधिकारियों से संपर्क किया। इस क्रम में इंजीनियर पवन को पीड़ित से 4 लाख रुपये रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार कर लिया गया। इसके बाद उसे गिरफ्तार कर न्यायिक हिरासत में भेज दिया। आगे की कार्रवाई की जा री है।
4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు లంచం తీసుకున్నవారు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పూర్తి అధికారాలను సైతం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో నగర పరిధిలో నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పవన్ ఏసీబీ వలలో చిక్కాడు.
ఉప్పల్‌లోని ఓ వాణిజ్య భవనానికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు గాను యజమాని నుంచి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.4 లక్షలు ఇస్తానంటూ ఒప్పుకుని ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఇంజనీర్ పవన్, బాధితుడి నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. (ఏజెన్సీలు)