हैदराबाद : पुलिस ने चुनाव आचार संहिता नियमों के उल्लंघन के आरोप में गोशामहल विधायक टी राजा सिंह के खिलाफ मामला दर्ज किया है। बुधवार रात को राजा सिंह ने निर्मल जिले के खानापुर शहर में बीजेपी सांसद उम्मीदवार नगेश के लिए प्रचार किया। खानापुर शहर के मुख्य चौराहे पर चुनाव प्रचार के दौरान पुलिस को शिकायत मिली कि राजा सिंह ने चुनाव नियमों का उल्लंघन करते हुए देर रात तक आमसभा में अपना भाषण जारी रखा।
इसी आमसभा में आदिलाबाद विधायक पायल शंकर ने भी हिस्सा लिया। खानपुर पुलिस ने खुलासा किया कि स्थानीय भाजपा नेता महेंद्र के खिलाफ मामला दर्ज किया गया है, जिन्होंने विधायक राजा सिंह और पायल शंकर के सांसद उम्मीदवार जी नागेश का कार्यक्रम आयोजित किया। विवादित विधायक माने जाने वाले गोशामहल विधायक राजा सिंह के खिलाफ खानापुर में मामला दर्ज किया गया है। इस समय यह चर्चा का विषय बन गया है।
यह भी पढ़ें-
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
హైదరాబాద్ : ఎన్నికల నియమావళి ఉల్లంఘన నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రాజాసింగ్ బిజెపి ఎంపీ అభ్యర్థి నగేష్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఆయన ప్రచారం నిర్వహించగా, ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాత్రివేళ సమయం దాటిపోయిన తన ప్రసంగాన్ని కొనసాగించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఇదే ప్రచార సభలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు రాజాసింగ్ పాయల్ శంకర్ ఎంపీ అభ్యర్థి జీ నగేష్ కార్యక్రమం నిర్వహించిన స్థానిక బిజెపి నేత మహేందర్ లపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు ఖానాపూర్ పోలీసులు వెల్లడించారు. వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్‌పై ఖానాపూర్ లో కేసు నమోదు కావడం చర్చకు దారితీసింది. (ఏజెన్సీలు)