క్యాంపెన్ / హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ పరిధిలోని గౌతమ్ నగర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సామాన్యుల విజయాలు, ఆవిష్కరణలను వెలుగులోకి తెస్తూ దేశ ప్రజలను ఏకం చేసే శక్తివంతమైన వేదిక ‘మన్ కీ బాత్’ అని పేర్కొన్నారు. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు దాదాపు 25 ఏళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే అంకితమైన నిజమైన కర్మయోగి ప్రధాని మోదీ అని కొనియాడారు. ఆయన నిరంతర శ్రమ మరియు అంకితభావం దేశంలోని ప్రతి ఒక్కరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
Also Reddy-
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు – కేంద్ర మంత్రి సమాధానాలు:
ప్రశ్న: ఎన్నికల కమిషన్ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై మీ స్పందన ఏమిటి?
సమాధానం: ప్రజాస్వామ్యంలో లేఖలు రాయడం, అంతర్గతంగా చర్చించుకోవడం సహజం. నిన్న ముగ్గురు ఎన్నికల కమిషనర్లు స్వయంగా సమావేశమై తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టత ఇచ్చారు. దాంతో ఆ అంశం ముగిసిపోయింది. దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు.
ప్రశ్న: దేశంలో మత సామరస్యం, శాంతిభద్రతల పరిస్థితిపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై మీరేమంటారు?
సమాధానం: కాంగ్రెస్ హయాంలో దేశంలో ఎక్కడ చూసినా కర్ఫ్యూలు, బాంబు పేలుళ్లు, మతకలహాలు నిత్యకృత్యంగా ఉండేవి. ప్రధాని మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్లుగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు సహా దేశంలోని ఏ ఒక్క ప్రధాన నగరంలోనూ అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జీవిస్తున్నారు.
ప్రశ్న: ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎలా చూస్తారు?
సమాధానం: ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యవేక్షణలోనే జరుగుతున్న ప్రక్రియ. చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, తప్పుడు వివరాలతో ఉన్న ఓట్లను తొలగించి ఓటర్ల జాబితాను పారదర్శకంగా తీర్చిదిద్దడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. కేరళ, తమిళనాడులో గెలిస్తే ఈ ప్రక్రియ మంచిదని, బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో తప్పు పట్టడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.

One thought on “ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ఒక శక్తివంతమైన వేదిక : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి”