సంగారెడ్డిలో మొహర్రం పీర్ల ఊరేగింపులో పాల్గొన్న జగ్గారెడ్డి, నిర్మల

హైదరాబాద్ : మొహర్రం సందర్భంగా ప్రజలకు షర్బత్ పంపిణీ చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి, టీ పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కూన సంతోష్, షఫీ హఫీజ్.

సంగారెడ్డి లో మొహర్రం ఘనంగా జరిగింది. మొహర్రం సందర్భంగా జగ్గారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో దర్గాను సందర్శంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పీర్ల ఊరేగింపు లో పాల్గొన్నారు.పీర్ల ఊరేగింపు చూసేందుకు వందల సంఖ్య లో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి ప్రజలకు షర్బత్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మొహర్రం పండుగ మత సామరస్యానికి ప్రతీక అని కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు మొహర్రం వేడుకల్లో హాజరయ్యారన్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగా నే ఈ సారి మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి అన్నారు.

Also Read-

ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు. కూన సంతోష్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, మైనార్టీ నాయకులు తాహెర్, కుతుబుద్ధిన్, నదీం, కౌసర్, ఇమ్రాన్, ఆమెర్ జాన్, హకీమ్, ఖమర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X