డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు, బ్రోచర్‌ ఆవిష్కరించిన వీసీ TWO DAY NATIONAL SEMINAR

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆర్థికశాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల (చంచల్‌గూడ) ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “ఆర్థిక సంస్కరణలు, భారత రాజ్యాంగం: విభేదాలు, భవిష్యత్ దిశ” అనే అంశంపై నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు కు సంబంధించి బ్రోచర్‌ను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు రాజ్యాంగ పరిమితులతో సమన్వయం సాధిస్తూ సమగ్ర, సమాన అభివృద్ధిని సాధించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ జాతీయ సదస్సు ఏప్రిల్ 9–10 తేదిల్లో విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సు ద్వారా ఆర్థిక సంస్కరణలు, రాజ్యాంగ పరిమితుల మధ్య ఉన్న సంబంధాలు, సవాళ్లు, అలాగే భవిష్యత్ అవకాశాలపై లోతైన చర్చలు జరగనున్నాయని సెమినార్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి. వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; సామాజిక శాస్త్రాల విభాగ డీన్ ప్రొ. పల్లవి కాబ్డే; ఆర్థికశాస్త్ర విభాగాధిపతి ప్రొ. కె. కృష్ణారెడ్డి, ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. శ్రీదేవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల (చంచల్‌గూడ) వైస్ ప్రిన్సిపాల్, ప్రొ. జి. నాగోజి; డా. జే. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read-

BRAOU VC RELEASED TWO DAY NATIONAL SEMINAR BROCHURE

Hyderabad : Prof. Ganta Chakrapani, Vice-Chancellor of Dr. B. R. Ambedkar Open University was released the brochure of two-day National Seminar will organize under the aegis Department of Economics in collaboration with Government Degree College, Chanchalguda on “Economic Reforms and the Indian Constitution: Conflict, Contradictions, and Ways Forward” on April 9 and 10, 2026 at BRAOU Campus. Prof. Ganta Chakrapani emphasized that economic reforms must align with constitutional principles to ensure inclusive and equitable development.

Prof. P. Venkateswarlu, Seminar Director stated that the seminar will facilitate in-depth discussions on the relationship between economic reforms and constitutional constraints, as well as the associated challenges and future prospects.

The programme was attended by Prof. Pushpa Chakrapani, Academic Director; Prof. Pallavi Kabade, Dean, Social Sciences; Prof. K. Krishna Reddy, OSD to VC Prof. Rabindranath Solomon, Head of the Department of Economics; Prof. G. Nagoji, Vice-Principal, Government Degree College, Chanchalguda; and Dr. J. Mallaiah, Assistant Professor were present.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X