T20 World Cup 2026 Super 8 : रोमांचक मुकाबले में पाकिस्तान ने 5 रनों से जीत लिया।

हैदराबाद : 28 फरवरी को टी20 वर्ल्ड कप 2026 सुपर 8 मैच के 50वें मुकाबले में पाकिस्तान बनाम श्रीलंका के बीच पल्लीकेले मैदान पर खेला गया। रोमांचक मुकाबले में पाकिस्तान ने 5 रनों से जीत लिया।

श्रीलंका ने टॉस जीतकर गेंदबाजी का फैसला किया। पाकिस्तान ने 20 ओवरों में 8 विकेट के नुकसान पर 212 रन बनाये। श्रीलंका ने 213 रनों के लक्ष्य का पीछा करते हुए 6 विकेट के नुकसान पर 207 रन ही बना पाई।

इस मैच में पाकिस्तान को सेमीफानल में पहुंचने के लिए श्रीलंका को 147 रनों के भीतर रोकना था। हालांकि ऐसा नहीं हो सका। इसके साथ ही न्यूजीलैंड सेमीफाइनल में पहुंच गई है। इंग्लैंड पहले ही सेमीफाइनल में प्रवेश कर चुकी है। इस तरह अब साउथ अफ्रीका के साथ तीन टीमें सेमीफानइल पहुंच चुके हैं। 1 मार्च को जिम्बाब्वे बनाम साउथ अफ्रीका के बीच दिल्ली में और दोपहर 3 बजे से और भारत बनाम वेस्टइंडीज के बीच कोलकाता में शाम 7 बजे से खेला जाएगा। सबकी नजरें भारत बनाम वेस्टइंडीज के बीच होने वाले मैच पर रहेगी।

भारत बनाम वेस्टइंडीज के बीच कोलकाता के ईडन गार्डन में शाम 7 बजे से खेला जाएगा। इस मैच में जो टीम जीतेगी वह सेमीफाइनल में प्रवेश करेगी।

यह भी पढ़ें-

శ్రీలంకపై పాకిస్తాన్ 5 పరుగుల తేడాతో విజయం

హైదరాబాద్ : టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధించింది. పల్లెకెలె అంతర్జాతీయ మైదానంలో జరిగిన మ్యాచ్ లో పాక్ లంకపై 5 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన కూడా టోర్నీ నుంచి దాయాది దేశం నిష్ర్కమించింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ తీసుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. పాక్ ఓపెనింగ్ బ్యాటర్లు ఫర్హాన్ సెంచరీ (100), ఫఖర్ జమాన్ (84) పరుగులు చేయడంతో 212 పరుగులు చేసింది. మిగతా పాక్ బ్యాటర్లు అందరూ పూర్తిగా విఫలం అయ్యారు.

213 పరుగుల లక్ష్య ఛేదినకు దిగిన శ్రీలంక జట్టుకు రెండో ఓవర్లోనే ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (4) నసీమ్ షా బౌలింగ్ లో మహ్మద్ నవాజ్ కి క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్ గా పెవిలియన్ కి చేరుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కమిల్ మిషార( 26)ని 4.1 ఓవర్లలో 33 పరుగుల వద్ద అబ్రార్ అహ్మద్ క్లిన్ బౌల్డ్ చేశాడు. వన్ డౌన్ ల్ బ్యాటింగ్ కి వచ్చిన చరిత్ అసలంక సైతం కాసేపు బ్యాట్ ఝలిపించినప్పటికీ 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కమిందు మెండిస్ (3), జనిత్ లియానాగే (5) సైతం త్వరగా పెవిలియన్ చేరారు.

ఒకవైపు, వికెట్లు పడుతున్నప్పటికీ శ్రీలంక బ్యాటర్ పవన్ రత్నాయకే ( 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు ) హాఫ్ సెంచరీ చేసిన తర్వాత షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. చివర్లో లంక కెప్టెన్ దసున్ శనక ( 31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సులతో 76 పరుగుల నాటౌట్ ) విజయం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి కేవలం పరుగుల మాత్రమే చేసి ఓడిపోవడంతో.. పాక్– శ్రీలంక కలిసి కట్టుగా ఈ మెగా టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్ర్కమించినట్లు అయింది. పాకిస్తాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3 వికెట్లు తీసుకోగా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X