हैदराबाद : टी20 वर्ल्ड कप 2026 के सुपर 8 मुकाबले में साउथ अफ्रीका की टीम ने वेस्टइंडीज को 9 विकेट से हराकर सेमीफाइनल की ओर एक और कदम बढ़ा दिया है। पहले बल्लेबाजी करते हुए वेस्टइंडीज की टीम ने 8 विकेट खोकर 176 रन बनाये।

जवाब में साउथ अफ्रीका की टीम ने सिर्फ 1 विकेट खोकर इस मैच को 16.1 ओवर में 177 बनाये। इस मुकाबले में साउथ अफ्रीका के कप्तान एडेन मार्करम ने नाबाद 82 रन की पारी खेली।

साउथ अफ्रीका की जीत से टीम इंडिया को बड़ा फायदा मिला है। भारतीय टीम को साउथ अफ्रीका के खिलाफ पहले मैच में हार का सामना करना पड़ा था, जिसके बाद टीम का रन रेट माइनस 3 से भी ज्यादा है।
वहीं वेस्टइंडीज ने जिम्बाब्वे को हराकर अपना रन रेट 5 से ज्यादा कर लिया। ऐसे में भारत के सेमीफाइनल की राह में बने रहने के लिए वेस्टइंडीज का इस मैच में जीतना जरूरी था। (एजेंसियां)
यह भी पढ़ें-
సౌతాఫ్రికా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం
హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలోనే చేధించింది. మొత్తంగా 16.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ మార్కరమ్(82), క్వింటాన్ డికాక్ (47), రియాన్ రికెల్టన్ (45) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. విండీస్ బౌలర్లలో రొస్టన్ చీస్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రొమారియో షెఫర్డ్(52) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జాసన్ హోల్డర్(49) తృటిలో అర్ధ శతకం మిస్ చేసుకున్నాడు. ఇక మిగిలిన బ్యాటర్లంతా విఫలం అయ్యారు. 86 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కింగ్(21), హోప్(16), హిట్ మేయర్(2), పావెల్(9), రోస్టన్(2), రుథర్‌ఫార్డ్(12), మాథ్యూ(11) వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, బోష్, రబాడ తలో 2 వికెట్లు పడగొట్టారు. అయితే.. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే.. టీమిండియా సెమీస్‌కు వెళ్లడం చాలా కష్టమయ్యేది. దక్షిణాఫ్రికా గెలవడంతో భారత క్రీడాకారులతో, అభిమానులు సౌతాఫ్రికా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. (ఏజెన్సీలు)
