IND vs SA : भारत-दक्षिण अफ्रीका दूसरा टेस्ट, समय में बदलाव

हैदराबाद: आमतौर पर भारत में कोई भी टेस्ट मैच सुबह 9:30 बजे शुरू होता है। हालांकि, टीम इंडिया और दक्षिण अफ्रीका के बीच होने वाले दूसरे टेस्ट मैच में समय में बदलाव होगा। ऐसा इसलिए क्योंकि गुवाहाटी में मौसम की स्थिति के कारण जल्दी अंधेरा हो जाता है। दूसरा टेस्ट 22 नवंबर से शुरू होगा।

पहला टेस्ट हारने और भारी दबाव में रहने के बाद, टीम इंडिया के लिए दूसरा टेस्ट जीतना बेहद ज़रूरी है। भारत इस टेस्ट को जीतकर सीरीज़ बराबर करने की पूरी कोशिश करेगा। वहीं दूसरी ओर, दक्षिण अफ्रीका पहले टेस्ट से मिली लय के साथ दूसरे टेस्ट में भारत को करारा झटका देने की योजना बना रहा है।

भारत और दक्षिण अफ्रीका के मैचों के समय में मामूली बदलाव किए गए हैं। मैच सुबह 9:00 बजे शुरू होगा। टॉस सुबह 8:30 बजे होगा। पहला सत्र सुबह 11:00 बजे तक चलेगा। लंच ब्रेक की जगह 20 मिनट का चाय ब्रेक होगा। दूसरा सत्र सुबह 11:20 बजे शुरू होगा। यह सत्र सुबह 11:20 बजे से दोपहर 1:20 बजे तक चलेगा। दोनों सत्रों के बाद 40 मिनट का भोजनावकाश होगा। अंतिम सत्र दोपहर 2:00 बजे से शाम 4:00 बजे तक होगा।

Also Read-

IND vs SA: ఇండియా-సౌతాఫ్రికా రెండో టెస్టు, టైమింగ్‌లో మార్పులు

హైదరాబాద్ : సాధారణంగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. కానీ సౌతాఫ్రికాతో టీమిండియా ఆడబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లో టైమింగ్స్ మారనున్నాయి. గౌహతిలో వాతావరణ పరిస్థుల కారణంగా త్వరగా చీకటి పడడమే ఇందుకు కారణం. వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.

తొలి టెస్ట్ ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ గెలవడం చాలా కీలకం. ఈ టెస్ట్ గెలిచి ఇండియా సిరీస్ సమం చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు తొలి టెస్ట్ ఇచ్చిన ఊపుతో రెండో టెస్టులోనూ ఇండియాకు షాక్ ఇవ్వాలని సౌతాఫ్రికా వ్యూహాలను రచిస్తోంది.

ఇండియా, సౌతాఫ్రికా టైమింగ్స్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ ఉదయం 9:00 గంటలకే ప్రారంభం కానుంది. 8:30 గంటలకు టాస్ వేస్తారు. 11:00 గంటల వరకు తొలి సెషన్ ఉంటుంది. లంచ్ బ్రేక్ కాకుండా 20 నిమిషాల పాటు టీ బ్రేక్ ఉంటుంది. తిరిగి 11:20 గంటలకు రెండో సెషన్ ప్రారంభమవుతుంది. 11:20 నుంచి 1:20 వరకు ఈ సెషన్ ఉంటుంది. రెండు సెషన్ ల తర్వాత 40 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఉంటుంది. 2:00 నుంచి 4:00 వరకు చివరి సెషన్ జరుగుతుంది.

మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లో భాగంగా లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో ఇండియా నాలుగో స్థానానికి పడిపోయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత మూడో స్థానంలో ఉన్న టీమిండియా (54.17) ఒక స్థానం దిగజారి నాలుగో ర్యాంక్ తో సరిపెట్టుకుంది. సౌతాఫ్రికా రెండో స్థానానికి ఎగబాకింది. తొలి టెస్టుకు ముందు నాలుగో స్థానంలో ఉన్న సఫారీలు టీమిండియాపై విజయంతో 66.67 పాయింట్ల శాతంతో టాప్-2కు దూసుకెళ్లారు. ఒకవేళ ఇండియా చివరి టెస్టులో కూడా ఓడిపోతే పాకిస్థాన్ కంటే కిందకు వచ్చి ఐదో ర్యాంక్ లో ఉంటుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X