హైదరాబాద్ : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల పై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద విధానం అవలంబిస్తుందన్నరు ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే అధికారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు.
రాజ్యాంగంలోనీ 243 D6 ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అధికారం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా కొత్త, కొత్త డైవర్ట్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆర్డినెన్సు పై ఇంతవరకు గవర్నర్ ను రేవంత్ రెడ్డి కలవలేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి ఇంతవరకు తీసుకోలేదు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రతిపక్షాల పైన , బిజెపి , ఇతర నాయకుల పైన బురద జల్లడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు.
Also Read-
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే పెద్ద ఎత్తున ఒక కార్యచరణ సిద్ధం చేసుకొని అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి పని చేయాలి. గ్లోబల్స్ ప్రచారం, డైవర్ట్ పాలిటిక్స్ కాకుండా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు రేవంత్ రెడ్డి నెరవేర్చాలి.
ఇంతవరకు మేధావుల , అఖిలపక్ష సమావేశం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఇతర పార్టీల పై బురద జల్లుతూ రేవంత్ రెడ్డి టైంపాస్ చేస్తున్నాడు.
కవిత నిస్వార్ధంగా బీసీల కోసం దీక్ష చేస్తున్నది. కవిత దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతం అవుతుంది. 40, 50 యేండ్ల నుంచి బిసిల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు చేశాను. బీసీల కోసం కవిత చేస్తున్న ఉద్యమం బీసీల పట్ల మరింత బలాన్ని చేకూరుస్తుంది , ఎటువంటి సందేహం లేదు. కవితను మనసారా అభినందిస్తున్నాను. కవిత పట్టుదలతో దీక్ష చేస్తుంది, ఆమె దీక్ష విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను.
