హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి చొరవతో దుబాయి నుంచి ఇండియాకు మృతదేహాలు చెరుకున్నయని అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, IFS (రిటైర్డ్), చైర్మన్, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ, తెలంగాణ ప్రభుత్వం అన్నారు.
ఆయనా మాట్లాడుతూ దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృత దేహాలను త్వరగా ఇండియాకు తరలించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని ఇండియన్ కాన్సులేట్ కు, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది.
Related News-
మృతుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ ల శవ పేటికల రవాణాకు ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ లు ఏర్పాటు చేసింది.
