హైదరాబాద్ : కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అరాచకమైన, నికృష్టమైన, నీచమైన ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. తమ భూమిని తాము కాపాడుకునేందుకు, తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటే ఇయ్యమని చెప్పినందుకు, చేయని తప్పుకు లగచర్ల గ్రామానికి చెందిన గిరిజన, దళిత, బలహీన వర్గాల రైతులు గత 30 రోజులకు పైగా జైల్లలో పెట్టింది ఈ ప్రభుత్వం.
తమ భూములు ఇవ్వమని చెప్పినందుకు అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా చేసింది. గిరిజన రైతన్నలపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోపాటు.. కరెంటు షాక్ పెట్టి థర్డ్ డిగ్రీని రేవంత్ రెడ్డి సోదరులు వీడియో కాల్ లో చూసి ఆనందించిన నీచమైన ప్రభుత్వము ఇది.
ఫార్మా విలేజ్ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం…పారిశ్రామిక కారిడార్ పేరిట భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. బయట ఉన్న గిరిజనులను వేధించే ప్రయత్నం ఇంకా కొనసాగిస్తున్నది. గిరిజన రైతన్నల కుటుంబాలను కూడా పోలీసులు వేధిస్తున్నారు. ఈ లగచర్ల విషయంలో అనుముల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చేసిన అరాచకాలు, థర్డ్ డిగ్రీ టార్చర్ ను బయట పెట్టేదాకా అంశాన్ని వదిలిపెట్టం. ఈ అంశంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువస్తాం.
Also Read-
ఇంత కీలకమైన అంశాన్ని పక్కన పెట్టి పర్యాటక రంగం పైన చర్చ పెడతామన్న సన్యాసి రేవంత్ రెడ్డి. సొంత నియోజకవర్గ ప్రజలను జైలలో పెట్టిన రేవంత్ రెడ్డి, ఈ అంశం పైన చర్చ పెట్టకుండా పర్యాటక శాఖ పైన చర్చ పెట్టిన సన్నాసి రేవంత్ రెడ్డి. 100 సార్లు ఢిల్లీకి టూరిజం చేసి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు 100 పైసలు కూడా తేలేదు. అందరినీ జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి ముందుకు పోతుండు. జైలలో ఉన్న 40 మందికిపైగా రైతన్నలతో పాటు మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం మాకు ఉన్నది. ఈ తెలంగాణ కానీ, కొడంగల్ గానీ రేవంత్ రెడ్డి అయ్య జాగిరా.
ఈ అంశం పైన శాసనసభలో చర్చ పెట్టడానికి దమ్ములేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. ఈరోజు సభ నుంచి పారిపోయిన వదిలిపెట్టెము… రేపు మరొక రూపంలో వస్తాం. అదానీతో జరుగుతున్న అవినీతిపైన సభలోకి వచ్చి చర్చిద్దాం అంటే అడ్డుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు లగచర్ల పైన కూడా పారిపోయారు. లగచర్ల అంశం పైన చర్చ పెడదామంటే సమాధానం చెప్పడం చేతగాక అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయింది. లగచర్ల ప్రజలందరి వెంట భారత రాష్ట్ర సమితి ఉన్నది భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ ఉన్నారు. 35 రోజులపాటు అక్రమంగా ప్రభుత్వం జైలులో నిర్బంధించిన వారికి కోర్టులు న్యాయం చేస్తాయన్న విశ్వాసం మాకు ఉన్నది.
హైదరాబాద్ ఫార్మాసిటీ ని రద్దు చేసిన తర్వాత సేకరించిన 14వేల ఎకరాలను తిరిగి రైతులకు ఇష్టమని చెప్పిన ప్రభుత్వం ఇది. కానీ హైకోర్టులో ఫార్మసిటీ రద్దు చేయలేమని చెబుతూనే… ఫార్మా పరిశ్రమల కోసం ఇతర చోట్ల పేద భూములను గుంజుకుంటున్న అరాచక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దే దాకా… వారిపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకునేదాకా… ముఖ్యమంత్రి రైతన్నలకు క్షమాపణ చెప్పేదాకా భారత రాష్ట్ర సమితి పోరాటం కొనసాగుతుంది. శాసనసభ కొనసాగినన్ని రోజులు ఈ అంశాన్ని ప్రభుత్వన్ని వెంటాడుతాం. గిరిజన రైతుబిడ్డ హీర్య నాయక్ కు బేడీలు వేసి చికిత్స చేస్తున్న దుర్మార్గపు పరిస్థితి. రైతన్న చేతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం.