ఐక్య కార్యాచరణ సమితి నిరసనలతో దద్దరిల్లుతున్న డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ. ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్ లో భాగంగా రెండో రోజు శుక్రవారం మధ్యాహ్నం 1:00 నుండి 1:30″ వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనను కొనసాగించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీయనుకోవాలని నినాదాలు చేశారు.

Also Read-

అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎసీ ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ మహేష్ గౌడ్ జేఎసీ నేతలు డా. యాకేష్ దైద; కాంతం ప్రేంకుమార్; ప్రొ. పుష్పా చక్రపాణి; ప్రొ. ఐ. ఆనంద్ పవర్; రజనికాంత్; డా. పరకుశం వెంకటరమణ; రాములు డా. ఎ. నారాయణరావు; రుషేంద్ర మణి; ఎన్సీ వేణు గోపాల్, డా. అవినాష్; డా. కిషోర్; డా. పి. రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X