ప్రొఫెసర్ సాయిబాబా అమర్ హై: ప్రొఫెసర్ సాయిబాబా ఉద్యమ ప్రస్థానం

ప్రొఫెసర్ సాయిబాబా వైద్యం పొందుతూ (తేది 12-10-2024 నాడు) అస్తమించారు. ఆయన మరణం విప్లవోద్యమానికి తీరని లోటు. అతనిపై రాజ్యం తీవ్ర నిర్భందం విధించి, క్రూరమైన ‘ఉపా’ కేసులు పెట్టి జైలులో నిర్భందించిన గాని జీవితంను లెక్కచేయకుండా నమ్మిన ఆశయం కోసం చివరి కంఠ పోరాడుతూ రాజ్యహింసలో రాలిపోయిన విప్లవ మేధావి. కామ్రేడ్ సాయిబాబా జీవితం ఇనుప చువ్వాలపై సాగింది. అదో కఠినమైన ఆచరణ. రాజ్యం తీవ్రమైన నిర్భంధం విధించిన గాని విప్లవ కార్యాచరణ నుండి వైదోలాగలేదు. ఆచరించి మార్గం చూపిన విప్లవ మేధావికి జోహార్లు.

1). ప్రొఫెసర్ సాయిబాబా తదితరులపై బొంబాయి హైకోర్టు, నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు లో యన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అప్పీల్ చేసింది.ఈ తీర్పుపై సుప్రంకోర్టు స్టే విధించింది. యన్.ఐ.ఏ దేశంలో అత్యున్నత పోలీస్ వ్యవస్థ. దేశంలో ఎక్కడైనా, ఏ కేసు అయిన విచారణ చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తుంది. ఉగ్రవాద చర్యల్ని అరికట్టడానికి ఏర్పాటు చేసిన స్వతంత్ర పోలీస్ వ్యవస్థనే యన్.ఐ.ఏ. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ ప్రతిపక్షాలపైన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న, ప్రశ్నిస్తున్న(డిసెంట్) వారిపై తప్పుడు కేసులు పెట్టించి, అణచివేయడానికి కేంద్రం వాడుకుంటున్నది.

సాయిబాబా తదితరులు విడుదలైతే భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషించి ప్రజలకు వివరిస్తారని, ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వ విధానాల్ని నిలదీస్తారని ప్రభుత్వ భయం. భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజలపై, నాయకులపై బ్రిటిష్ ప్రభుత్వం కూడ ఇలాంటి క్రూర చట్టాలను మోపి, అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో సంవత్సారాలు తరబడి మానవత్వం లేకుండా నిర్బందించింది. భగత్ సింగ్,రాజగురు,సుఖ్ దేవ్, ఉద్దం సింగ్ లాంటి యువకులను ఉరి తీసింది. అల్లూరి సీతారామరాజు ,ఆజాద్ చంద్రశేఖర్ లను ,అనేక మంది ఉద్యమ కారులను కాల్చి చంపింది. చట్టాలను దుర్వినియోగం చేసింది.

Also Read-

భారత ప్రభుత్వం కూడ తన దేశ పౌరుల పై అదే విధంగా వ్యవహరిస్తున్నది. సాయిబాబా కేసుని ప్రభుత్వం హడవిడిగా సుప్రీంకోర్టులో అప్పీలు చేసి, కోర్టును ప్రభావితం చేసి స్టే ఇచ్చేటట్లు చేసింది. సామాన్య ప్రజలు సుప్రీంకోర్టు కు వెళ్లి పిటిషన్ దాఖలు చేయడానికి,దాన్ని స్వీకరించడానికి చాల సమయం పట్టేది. కానీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చకచకా చక్కపెట్టి గంటల వ్యవధిలో పిటిషన్లను స్వీకరించేటట్లు చేసి, బొంబాయి హై కోర్టు కొట్టివేసిన తీర్పుపై స్టే ఇచ్చేటట్లు చేసింది.సాయిబాబా కేసును ప్రభుత్వం వ్యక్తి గతంగా తీసుకుంది.ప్రభుత్వాలకు వ్యక్తుల్ని టార్గెట్ చేసుకునే విధానం ఉండకూడదు.ప్రజల పట్ల వివక్షత చూపే విధానం ఆహ్వానించేది కాదు. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం.న్యాయస్థానాలలో పేద ప్రజలకు ఒక న్యాయం, ధనిక వర్గాలకు, ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులకు మరొక న్యాయం అనే వివక్షత దొర్లితే ప్రజలు న్యాయ వ్యవస్తపై నమ్మకం కోల్పోతారు.

ఈ కేసును పరిశీలిస్తే వ్యక్తి వ్యక్తికి కోర్టుల, ప్రభుత్వాల తీరు మారుతుందని బహిర్గతమౌతుంది. ఉన్నొడికే న్యాయం అనే నానుడి మరోమారు నిరూపితమైంది. న్యాయవ్యవస్థ యొక్క తీరును ప్రజలు సునిశితంగా పరిశీలిస్తున్నారు.న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు.

2). సుప్రీం కోర్టులో సాయిబాబా కేసు వాదనలు జరుగుతున్నప్పుడు సాయిబాబా వికలాంగుడు, అతనికి గృహనిర్బంధానికైన అవకాశం ఇవ్వండని అతని న్యాయవాది కోర్టును అర్తించాడు. సాయిబాబా మెదడు చురుకుగా ఉందని, ఆలోచనలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది. సాయిబాబా కేసును విచారించిన జిల్లా కోర్టు నుండి మొదలుపెడితే సుప్రీంకోర్టు వరకు మెదడును నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నవి.

మెదడును నిర్బంధించడం అంటే భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 19, 21 లను నిరాకరించడమే.మానవుని మెదడు, జ్ఞానం అభివృద్ధి చెందడంతోనే మానవుడు నాగరికుడు అయినాడు. సమాజ అభివృద్ధి సాధ్యమైంది. ఆలోచనలను,భావాలను నిర్బంధించి మానవ వికాసం చెందాలని భావించడం భ్రమే అవుతుంది. జ్ఞానం అభివృద్ధి చెందడం వలననే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి మానవుడు అంతరిక్ష యానం చేస్తున్నాడు.చంద్ర మండలంలో నివసిస్తానంటున్నాడు. జ్ఞానాన్ని నిర్బంధించే చర్యలను అజ్ఞానులే చేస్తారు. కానీ మెదడుకు చలనం ఉంటుంది, అంటే ఆలోచనలకు చలనం ఉంటుంది.వాటిని ఎవరు నిర్బంధించలేరు.

3). ఇక్కడ రాజ్యం అంటే ఏమిటి? రాజ్యాంగ వ్యవస్థ ఎవరు ఏర్పాటు చేశారు? అది ఎవరి ప్రయోజానాలను కాపాడుతుంది? అనే విషయాలు పరిశీలించాలి. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ(శాసన సభలు,పార్లమెంట్), పాలన యంత్రాంగం (ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్, ఐ.ఎఫ్.యస్ లతో కూడిన), మిలటరీ(అన్ని రకాల పోలీసులు)ఇవన్నీ కలిపితేనే రాజ్యం(ప్రభుత్వం). ప్రజలను దోపిడి చేస్తున్న వారు తమని తాము కాపాడుకోవడానకి,దోపిడి, అణచివేతలకు గురైన ప్రజల నుండి వచ్చే తిరుగుబాటు నుండి రక్షించుకోవడానికి ఏర్పాటుచేసుకున్న వ్యవస్థకు ముద్దు పేరు రాజ్యం. ప్రకృతి వనరులు, ఉత్పత్తి సాధనాలైన మానవుని శ్రమ,శ్రమ సాధనాలు, ఫ్యాక్టరీలు, భూమి తదితర ఎవరి ఆధీనంలో ఉంటే పై నాలుగు వ్యవస్థలు వారి ఆదుపాజ్ఞాలలో పనిచేస్తాయి.

నాలుగు వ్యవస్థలు దోపిడిదారులను కాపాడడం కోసం నిరంతరం శ్రమిస్తాయి. పై నాలుగు వ్యవస్థల్లో ఒక వ్యవస్థ విఫలమైతే మరో వ్యవస్థ నేనున్నానని ముందుకు వస్తుంది.ప్రజలకు రాజ్యం(ప్రభుత్వం) పై భ్రమలు కోల్పోకుండా కాపాడుతుంది. పై నాలుగు వ్యవస్థల్లో మూడు వ్యవస్థలైన శాసన వ్యవస్థ, పాలన యంత్రాంగం, న్యాయ వ్యవస్థ ఒక దాని తరువాత ఒకటి వైఫల్యం చెందితే ప్రజలలో అసంతృప్తి తీవ్రమై తిరుగుబాటు చేస్తారు. ప్రజలు ప్రత్యామ్నాయ పాలనను కోరుకుంటారు. తిరుగుబాటు, ప్రజా ఉద్యమాలు దోపిడి,పీడనలేని రాజ్యం కోరుకునే వైపుగా ఉంటే అది సోషలిస్ట్ సమాజాన్ని పోలి ఉంటుంది. కనుక పెట్టుబడుదారులు,కార్పొరేట్ శక్తులు దీనిని అణచడానికి మిలటరీ ద్వారా ప్రయత్నిస్తారు, లేదా ముసుగు ధరించుకొని ప్రత్యామ్నాయ మార్గంగా సంస్కరణలు ప్రవేశపెట్టి నూతన పాలన పేరుతో పాత రంగు మార్చుకొని ముందుకు వస్తారు. “పాలపొంగుపై నీళ్ళు చల్లినట్లుగానే”ప్రజా ఉద్యమాలు, నిరసనలు, ప్రత్యామ్నాయ సమాజ డిమాండ్ ముందుకు రాకుండ ప్రయత్నం చేస్తారు.ప్రజలకు రాజ్యంపై భ్రమలు కోల్పోకుండా సంస్కరణలు,రాయితీలు కల్పిస్తారు. తాత్కాలికంగా ప్రజలను ప్రలోభ పెట్టెందుకు సంక్షేమ పథకాలను భూర్జువా పాలకవర్గాలు తీసుకువస్తాయి. చట్టసభలపై భ్రమలు కోల్పోకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు.

ఈ ప్రయత్నం కూడా సాధ్యం కానిచో ప్రజా ఉద్యమాలను అణచడానికి అంతిమంగా మిలటరీని, ఆయుధ సంపత్తిని వాడి ప్రజా ఉద్యమాలను ఊచకోత ద్వారా అణిచివేస్తారు. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ నేనున్నానని, రాజ్యాంగాన్ని కాపాడుతానని ముందుకు వస్తుంది. ఇదంతా రాజ్యం యొక్క ఆటలో భాగమే.

4).దేశంలో పాలకవర్గాలు మతాన్ని, కులాన్ని ఆయుధంగా వాడుకుని పీడిత ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టి ఐక్యతను దెబ్బతిస్తున్నారు. దోపిడి, పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా, మెరుగైన జీవనం కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమాలను నల్ల చట్టాలను ప్రయోగించి ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. పెట్టుబడిదారుల, కార్పొరేట్ కంపెనీల దోపిడిని ప్రశ్నించకుండా ఉండడానికి కుల,మతోన్మాదాన్ని ప్రజలలో రెచ్చగొడుతున్నారు. ఈ ప్రయత్నం కూడా వైఫల్యం చెందినప్పుడు పాలకవర్గాలతో పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు మీలకతై అణిచివేత చర్యలకు పూనుకుంటారు. పశ్చిమ దేశాల ప్రజలు చర్చి ఆధిపత్యాన్ని దిక్కరించి ఆకలి తీర్చుకోవడానికి పోరాడి విజయం సాధించిన చరిత్రను సువర్ణాక్షాలతో లికించారు.

5). ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతూ, చైతన్యాన్ని అందిస్తున్న వారిని, గొంతులేని ప్రజలకు గొంతుక అవుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో నిర్బందించడం,ఎలాంటి విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో ఉంచడం బ్రిటిష్ వారి నుండి భారత పాలకవర్గాలు నేర్చుకున్న నీతి. భారత స్వతంత్ర ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ పాలకులు తయారు చేసిన చట్టాలను కొన్ని చేర్పులు,మార్పులు చేసి మన పాలకులు వాటినే అమలు చేస్తున్నారు.

నేటి సమాజంలో అనేక ఆర్థిక నేరాలు, బ్యాంకులను,ప్రభుత్వాలను మోసం చేస్తూ ఆర్థిక దోపిడి పాల్పడుతున్న వారిని, ప్రజలను దోపిడి,పీడనకు గురిచేస్తూ కోట్లను కోట్లు అక్రమంగా సంపద పోగు చేస్తుకుంటున్న వారిని ప్రభుత్వం కాపాడుతున్నది. వారిపై కేసులు పెట్టడం గాని, జైళ్ళలల్లో పెట్టడం గాని, శిక్షించేటట్లు కానీ చేసే చర్యలు ప్రభుత్వం నుండి ఏమి ఉండవు. ప్రజల నుండి వ్యతిరేకత ఏర్పడకుండా ఉండాలని ప్రభుత్వాలు భావిస్తే వారిపై నామ మాత్రంగా కేసులు నమోదు చేస్తారు.వారికి జైళ్ళలో సకల సౌకర్యాలు కలిగిస్తున్నాయి.

కేసులు నీరుగారేటట్లుగా వ్యవహరిస్తారు. వారిని శిక్షించిన సందర్భాలు చాలా అరుదు. పేదలు, అణచివేతకు గురవుతున్న ప్రజలు చిన్న చితక నేరాలు చేసినవారు,తప్పుడు ఆరోణలతో కేసుల్లో ఇరికిన వారు, రాజకీయ కక్షలతో తప్పుడు ఆరోపణలకు గురై కఠినమైన జైలు శిక్షలు, సంవత్సరాలు తరబడి, జీవిత కాలం జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ఉరితియబడుతున్నారు. జైళ్ళలో నెలలు, సంవత్సరాల తరబడి విచారణ లేకుండా ఉన్నటువంటి వారు అత్యధికంగా పేద, పీడిత, అణిచివేత గురైన ప్రజలు మాత్రమే.

న్యాయం నేటి వ్యవస్థలో అత్యంత విలువైన సరుకు అయ్యింది. పేద ప్రజలు కొనుగోలు చేయలేని వస్తువు(న్యాయం) అయ్యింది. అందుకే పేద ప్రజలకు న్యాయం దొరకక (న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక శక్తి లేక) జైలు శిక్షలకు గురికాడమో,లేదా జైళ్ళలో విచారణ లేకుండా మగ్గుతున్నారు. నేరారోపణలకు గురైన ధనవంతులు, ఉన్నస్థాయి వారు కింది నుండి పై స్థాయి వరకు వివిధ స్థాయిలో ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటున్నారు. వారిపై కేసులు నమోదు కాకుండా గాని, నమోదు అయినా కానీ శిక్షలు పడకుండా రాజ్యం రక్షణ కవచంగా ఉంటున్నది.

6). మరో వైపు జైళ్ళలో మగ్గుతున్న వారికి జైళ్ళ మాన్యువల్ ప్రకారం,చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం లేదు. జైళ్లు సంస్కరణ కేంద్రాలుగా ఉండాలి. శిక్షల గురైన వారు, విచారణ ఖైదీలు ఉన్న వారి ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు వచ్చేటట్లుగా జైళ్ళ వాతావరణం ఉండాలి. కానీ జైళ్లు నేడు నరకకూపం లాగా ఉన్నవి. చట్టాలు, సంస్కరణ ఆచరణలో అమలు చేయటం లేదు. జైళ్ళ నరకకూపం వలే వుండాలని ప్రభుత్వం భావిస్తుంది.ఇది రాజ్యం యొక్క స్వభావంలో భాగమే.

7). ప్రతి జీవికి పుట్టుకతోనే సహజ సిద్ధంగా కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు,విధులు పొందుతారు.కొన్ని రకాల హక్కులు ప్రజలు పోరాడి సాధించుకున్నారు.రాజ్యాంగం లోని ఆర్టికల్స్ 19,21 భావ ప్రకటన స్వేచ్చ, జీవించే హక్కులు ముఖ్యమైనవి. వీటికి భంగం కలిగించని రీతిలో ప్రభుత్వాలు ప్రజలకు హామీ ఇచ్చి , పౌర సమాజం నాగరికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి. స్వేచ్చ, సౌభ్రాతృత్వం, సమానత్వం కై జరిగిన మహత్తరమైన ప్రెంచ్ విప్లవ చరిత్ర మన ముందు ఉంది.

నేడు ప్రభుత్వాలు ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలను, డిమాండ్ లను, భిన్నాభిప్రాయాలను గౌరవించక పోగా నేరంగా భావిస్తున్నాయి. హక్కులను రక్షించే ప్రభుత్వమే భక్షకులై హారించి వేస్తున్నావి. ప్రశ్నించే గొంతులకు తాళాలు వేస్తున్నావి. ప్రజలు మెరుగైన జీవనం కోసం, హక్కుల కోసం చేస్తున్న పోరాటాలను అణచివేయడం పరిష్కారం కాదు.అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తుంది.నిప్పు రవ్వలు మహా ప్రళయ్యాన్ని సృష్టిస్తాయనేది ఎంత సహజమో,ప్రజా పోరాటాలు అణచివేస్తున్న కొద్ది మహా ప్రళయాన్ని సృష్టిస్తుందనేది కూడా అంతే సహజం.

8). పాలక వర్గాలు కొంత మంది పెట్టుబడిదారుల, కార్పోరేట్ కంపెనీల ప్రయోజనం కోసం కార్మికుల,రైతుల, ప్రజల హక్కులను హారించడం,అణచివేయడం సాగిస్తున్నారు.మూగ జీవులుగా ఉన్న ప్రజలకు గొంతుకలైన మేధావి వర్గాలను,కవులు, కళకారులపై నల్ల చట్టాలను ప్రయోగించి అక్రమ కేసులు పెట్టి విచారణ లేకుండా, మానవత్వం కోల్పోయి సంవత్సారాలు తరబడి జైళ్ళలో నిర్బందిస్తున్నారు.ఇలాంటి హక్కుల హాననంకు వ్యతిరేకంగా విశాల ప్రజా పోరాటాలే మార్గం.పురిటి నొప్పులు,రక్తం తర్పణ లేకుండా నూతన సృష్టి లేదు. పోరాటాలు,త్యాగాలు లేకుండా హక్కులు పొందలేము, రక్షించుకోలేము. అందుకే జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్చ కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికై, ఉపా తదితర నల్ల చట్టాల రద్దుకై కార్మిక, కర్షక, విద్యార్థి,మేధావి వర్గాలు పోరాటాలను తీవ్రం చేయాలి. (From Nirdesham)

ప్రొఫోసర్ సాయిబాబాకు విప్లవ జోహార్లు

– ఆల్గోట్ రవీందర్
రాష్ట్ర కోశాధికారి, పౌర హక్కుల సంఘం,తెలంగాణ.

दिल्ली विश्वविद्यालय के पूर्व प्रोफेसर जीएन साईबाबा

माओवादियों से कथित संबंध के एक मामले में महज सात महीने पहले अदालत से बरी हुए दिल्ली विश्वविद्यालय के पूर्व प्रोफेसर जीएन साईबाबा (गोकरकोंडा नागा साईबाबा) का बीती रात नौ बजे निधन हो गया. 54 वर्षीय साईबाबा पित्ताशय के संक्रमण से पीड़ित थे. दो सप्ताह पहले उनका ऑपरेशन हुआ था. ऑपरेशन के बाद से वह स्वास्थ्य संबंधी जटिल समस्याओं से जूझ रहे थे. पिछले 20 दिनों से वह हैदराबाद के निजाम्स इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज (NIMS) में भर्ती थे.

दरअसल, तथाकथित नक्सलियों से लिंक रखने के शक में 2014 में महाराष्ट्र पुलिस ने उन्हें पहली बार गिरफ्तार किया था. पुलिस ने मार्च 2017 में कथित माओवादी संबंधों और राष्ट्र के खिलाफ युद्ध छेड़ने वाली गतिविधियों में शामिल होने का आरोप लगाया था. महाराष्ट्र की गढ़चिरौली कोर्ट ने इस मामले में मार्च 2017 में साईबाबा को दोषी ठहराया था. सत्र न्यायालय ने साईबाबा सहित महेश तिर्की, पांडु नरोटे, हेम मिश्रा, प्रशांत राही और विजय तिर्की सहित पांच अन्य को दोषी करार दिया था. उन्होंने सेशन कोर्ट के फैसले को मुंबई हाई कोर्ट की नागपुर पीठ में चुनौती दी थी. नागपुर पीठ ने माओवादियों से कथित संबंधों के मामले में वर्षों तक ट्रायल चलने के बाद साईबाबा एवं पांच अन्य को मुंबई पुलिस के आरोपों से बरी कर दिया था.

मुंबई पुलिस व अन्य जांच एजेंसियां इस मामले में वर्षों तक चले कानूनी जंग के दौरान जीएन साईबाबा के खिलाफ मामला साबित करने में विफल रही. उसके बाद अदालत ने न केवल उनकी आजीवन कारावास की सजा रद्द कर दी बल्कि जमानत पर रिहा भी कर दिया. हाईकोर्ट की नागपुर पीठ ने अभियोजन पक्ष द्वारा आरोपियों पर गैरकानूनी गतिविधियां (रोकथाम) अधिनियम (यूएपीए) के प्रावधानों के तहत आरोप लगाने के लिए प्राप्त की गई मंजूरी को गलत करार दिया. अदालत से माओवादियों से संबंध रखने के मामले में बरी होने के बाद साईबाबा व्हीलचेयर पर बैठकर 10 साल बाद नागपुर केंद्रीय कारागार से बाहर आए.

साईबाबा ने अगस्त 2024 में आरोप लगाया था कि उनके शरीर के बाएं हिस्से के लकवाग्रस्त हो जाने के बावजूद प्राधिकारी नौ महीने तक जेल अधिकारी और वहां पुलिस अफसर अस्पताल नहीं ले गए. उन्हें नागपुर केंद्रीय कारागार में केवल दर्द निवारक दवाएं दी गईं, जहां वह 2014 में इस मामले में गिरफ्तार किए जाने के बाद से बंद थे. अंग्रेजी के पूर्व प्रोफेसर ने दावा किया था कि उनकी आवाज दबाने के लिए उनका अपहरण किया गया और फिर महाराष्ट्र पुलिस ने उन्हें गिरफ्तार किया. गिरफ्तारी के बाद महाराष्ट्र पुलिस के वरिष्ठ जांच अधिकारी मेरे साथ घर गए और परिवार के लोगों को धमकाया.

महाराष्ट्र पुलिस ने उन्हें व्हीलचेयर से घसीटा और इसके परिणामस्वरूप उनके हाथ में गंभीर चोट लग गई, जिससे उनके तंत्रिका तंत्र पर भी असर पड़ा. आंध्र प्रदेश के मूल निवासी साईबाबा ने आरोप लगाया था कि जांच अफसरों ने उन्हें चेतावनी दी थी कि अगर उन्होंने बात करना बंद नहीं किया तो उन्हें किसी झूठे मामले में गिरफ्तार कर लिया जाएगा. जीएन साईबाबा साल 2003 से दिल्ली विश्वविद्यालय के राम लाल आनंद कॉलेज में अंग्रेजी के प्रोफेसर थे. उन्हें तथा​कथित माओवादियों से लिंक की वजह से महाराष्ट्र पुलिस द्वारा गिरफ्तार किया गया था. उसके बाद 2014 में उन्हें कॉलेज से निलंबित कर दिया गया था. (एजेंसियां)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X