हैदराबाद: बीसी वेलफेयर एसोसिएशन के राष्ट्रीय नेता आर कृष्णय्या 2022 में वाईसीपी पार्टी की ओर से आंध्र प्रदेश से राज्यसभा सांसद चुने गए हैं। लेकिन अप्रत्याशित रूप से उन्होंने अपनी राज्यसभा सांसद सदस्यता से इस्तीफा दे दिया। सोमवार को स्पीकर के प्रारूप में इस्तीफा राज्यसभा सभापति को भेजा गया। उनका इस्तीफा राज्यसभा सभापति ने स्वीकार कर लिया है। इसके चलते एक बुलेटिन जारी कर बताया गया कि आंध्र प्रदेश से एक राज्यसभा सीट खाली हो गई है।
इस बीच तेलंगाना के बीसी नेता आर कृष्णय्या को वाईसीपी के राज्यसभा सांसद के रूप में मौका दिया गया, जिसने उस समय सभी को आश्चर्यचकित कर दिया था। लेकिन हाल ही में खबरें आईं कि वह बीजेपी में शामिल होंगे। इसी क्रम में आंध्र प्रदेश में बीजेपी गठबंधन के विपक्षी दल के सांसद का इस्तीफा चर्चा का विषय बना हुआ है।
यह भी पढ़ें-
गौरतलब है कि आर कृष्णैय्या बीसी के अधिकारों के लिए कईं सालों से लड़ रहे हैं। 2014 में उन्होंने एलबी नगर से टीडीपी विधायक के रूप में जीत हासिल की थी। उस वक्त टीडीपी ने उन्हें अपनी पार्टी का सीएम उम्मीदवार भी घोषित किया था। बाद में YCP ने उन्हें 2022 में राज्यसभा का टिकट दिया। नतीजतन, वह दो साल तक वाईसीपी सांसद (राज्यसभा) पद है। हालांकि आज उन्होंने अपनी राज्यसभा सदस्यता से इस्तीफा देकर सभी को चौंका दिया है।
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా
హైదరాబాద్ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా వైసీపీ పార్టీ తరుఫున 2022లో ఎన్నికయ్యారు. కాగా ఎవరూ ఊహించని విధంగా తన రాజ్యసభ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు పంపారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు బులిటెన్ విడుదల చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో బీసీ నేతగా ఉన్న ఆర్. కృష్ణయ్యకు వైసీపీ రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వడం అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇటీవల ఆయన బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ కూటమికి ఆపోజిట్ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ప్రస్తుతం రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఆర్. కృష్ణయ్య బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారు. 2014లో ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో టీడీపీ ఆయనను తమ పార్టీ పార్టీ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించింది. అనంతరం.. 2022లో వైసీపీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన రెండేళ్లుగా వైసీపీ ఎంపీగా (రాజ్యసభ) కొనసాగుతున్న ఆయన ఈ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అందరికి షాక్ ఇచ్చారు. (ఏజెన్సీలు)