“బీజేపీ కార్యకర్తలారా… జాగ్రత్తగా ఉంటూ సహాయక చర్యల్లో నిమగ్నమవ్వండి”

అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి

వ్రుద్దులు, చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపకండి

ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులంతా చర్యలు తీసుకోండి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దు. నాలాలు, డ్రైనేజీ పొంగుపొర్లుతున్నందున చిన్నారులను, వ్రుద్దులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఝప్తి చేస్తున్నా.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సహాయ చర్యలు చేపట్టాలి. అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ తీవ్ర అంతరాయం కలిగింది. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లి ఇండ్లళ్లోకి నీళ్లు వస్తున్నాయి. కొన్ని చోట్ల చెరువులు తెగాయి. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేలా యుద్ద ప్రాతిపదికన అధికారులు చర్యలు తీసుకోవాలి. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులంతా జాగ్రత్తగా ఉంటూ అధికారులకు సహకరిస్తూ సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని కోరుతున్నా.

Also Read-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X