हैदराबाद में कश्मीर की सुंदरता के साथ ग्रीष्मकालीन महोत्सव मेला
हैदराबाद: शहरवासियों को कश्मीर की सुंदरता से परिचित कराने के लिए आयोजित ग्रीष्मकालीन उत्सव मेला बुधवार शाम को शुरू हो गया। आईमैक्स के बगल में एचएमडीए ग्राउंड में आयोजित ग्रीष्मकालीन उत्सव मेला कश्मीर की बर्फीली पहाड़ियों के अद्भुत दृश्यों से परिचित कराते हुए शहरवासियों का मनोरंजन करने के लिए तैयार है।
मिर्जा रफीक बेग ने कहा कि ग्रीष्मकालीन उत्सव मेला प्रतिदिन दोपहर 2 बजे से रात्रि 11 बजे तक उपलब्ध रहेगा. शहरवासियों को इस अवसर का लाभ उठाए।
హైదరాబాద్ : నగరవాసులకు కాశ్మీర్ అందాలను పరిచయం చేస్తూ అత్యంత అద్భుతంగా ఏర్పాటుచేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. కాశ్మీర్ మంచు కొండల్లోని అద్భుత సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు పరిచయం చేస్తూ ఐమాక్స్ పక్కన, హెచ్ఎండిఏ మైదానంలో ఏర్పాటుచేసిన సమ్మర్ ఉత్సవ్ మేళ నగరవాసులను అలరించేందుకు సిద్ధమైంది.
గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా వివిధ ప్రత్యేక అనుభూతులను పరిచయం చేస్తూ, కొనసాగుతూ వస్తున్న సమ్మర్ ఉత్సవ్ మేళ ఈ సంవత్సరం కాశ్మీర్ అందాలను పరిచయం చేయడంతో పాటు, మైనస్ డిగ్రీ చలిలో ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం, ప్రత్యేక టన్నుల్ గుండా వెళ్తూ కాశ్మీర్ అందాలను తిలకించేలా నిర్వాహకులు మిర్జా రఫీక్ బేగ్ అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు అమ్యూజ్మెంట్ రైడ్స్, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా నగరవాసులను సమ్మర్ ఉత్సవ్ మేళా ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.
సమ్మర్ ఉత్సవ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హెచ్ఎండిఏ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులకు నిర్వాహకులు మిర్జా రఫీ బేగ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాశ్మీర్ అందాలను నగరవాసులకు మరింత చేరువ చేస్తున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సమ్మర్ ఉత్సవ్ మేళా ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని నగరవాసులు ఉపయోగించుకోవాలని మిర్జా రఫీక్ బేగ్ తెలిపారు. (ఏజెన్సీలు)