Road Accident: స్కూటీ-కారు ఢీ + కారు-మోటార్ సైకిల్ ఢీ = ఇద్దరు మృతి మరియు…

హైదరాబాద్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం స్కూటీని, కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమీన్ప్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అమీన్పూర్ పరిధిలోని ఇసుక బావికి చెందిన మొమ్మద్ ఇర్ఫాన్ (20) డిగ్రీ చదువుతు న్నాడు. మంగళవారం అర్ధరాత్రి అదే కాలనీకి చెం దిన సాయి చరణ్, మదన్లతో కలిసి స్కూటీ పై ఇసుక బావి నుంచి బీరంగూడ కమాన్ వైపు వెళ్తు న్నారు. సాయిచరణ్ స్కూటీ నడుపుతున్నాడు.

మార్గమధ్యలో మల్లారెడ్డి కాలనీ కమాన్ వద్దకు రాగానే కిష్టారెడ్డిపేట వైపు నుంచి బీరంగూడ కమాన్ వైపు వేగంగా వచ్చిన కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇర్ఫాన్ అక్కడికక్కడేమృతి చెందగా, సాయి చరణ్, మదన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం బీరంగూడ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్ప త్రికి తరలించారు. బుధవారం మృతుడు ఇర్ఫాన్ తండ్రి మొమ్మద్ హైదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు కారు మోటార్సైకిల్ను ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన తెల్లాపూర్ పరిధిలోని రేడియల్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్కు చెందిన జంగయ్య(40) మోటార్సై కిల్ పై తెల్లాపూర్ వచ్చాడు. బుధవారం సాయంత్రం తెల్లాపూర్లోని వెన్స్ దుకాణం వద్ద నుంచి బైక్ పై రేడియల్ రోడ్డు పైకి వచ్చాడు. ఆ సమయంలో జంగయ్య ప్రయాణిస్తున్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. తీవ్రగాయా లైన జంగయ్యను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X