हैदराबाद: आंध्र प्रदेश के कडपा कोऑपरेटिव कॉलोनी में दर्दनाक मामला प्रकाश में आया है। पत्नी, दो बच्चों की बेरहमी से हत्या करने के बाद कांस्टेबल ने आत्महत्या कर ली। इस घटना से कॉलोनी में हड़कंप मच गया। बंदूक से तीनों की हत्या करने के बाद कांस्टेबल वेंकटेश्वर्लु ने आत्महत्या कर ली।
पुलिस ने बताया कि कांस्टेबल वेंकटेश्वर्लु कडपा टू टाउन थानें कार्यरत था। हत्या और आत्महत्या के कारणों का पता नहीं चल पाया है। पुलिस मामले की जांच पड़ताल कर रही है।
భార్య, పిల్లల్ని చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కడపలోని కోపరేటివ్ కాలనీలో దారుణం జరిగింది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన తర్వాత సమాచారం అందుకున్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వెంకటేశ్వర్లు కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)