29వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన, ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష

  • తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, వివిధ రంగాల ప్రముఖులతో 29న అమిత్ షా భేటీ.
  • కార్యక్రమ నిర్వహణపై పార్టీ నాయకులతో చర్చించిన కిషన్ రెడ్డి

హైదరాబాద్: ఈ నెల 29వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణ మేధావులతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ సిద్ధమైంది.

29వ తేదీ మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర శాఖ పదాధికారులు, తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో.. అమిత్ షా భేటీ అయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సమావేశం సందర్భంగా.. తెలంగాణలో పార్టీని ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోని తీసుకొచ్చే విషయంలో పార్టీ కేడర్ కు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ కులసంఘాలు, సామాజిక సంఘాల, నాయకులతో అమిత్ షా సమావేశమయ్యేలా.. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X