हैदराबाद: मूसापेट में कबाड़ के एक गोदाम में जोरदार विस्फोट हो गया। एचपी रोड स्थित एक गोदाम में ऑटो में कबाड़ लोड करते समय धमाका हो गया। इस विस्फोट के कारण एक व्यक्ति की मौत हो गई। स्थानीय लोगों ने विस्फोट में गंभीर रूप से घायल व्यक्ति को गांधी अस्पताल पहुंचाया। अस्पताल में इलाज के दौरान उसकी मौत हो गई।
सूचना मिलने पर पुलिस मौके पर पहुंच गई और बचाव कार्य में जूट गई। घायलों को अस्पताल ले जाया गया। बताया जा रहा है कि विस्फोट उस वक्त हुआ जब टाटा ऐस वाहन में रसायनों के खाली कंटेनर लादे जा रहे थे। प्रत्यक्षदर्शियों के मुताबिक, धमाका तब हुआ जब केमिकल से भरा एक कंटेनर वाहन से नीचे गिर गया।
मृतक की पहचान मुशीराबाद के बोलकपुर निवासी मोहम्मद नजीर (30) के रूप में हुई है। नजीर के पिता इस्माइल कबाड़ खरीदी का कारोबार करता है। सनतनगर एसआई चंद्रय्या ने बताया कि हादसा मुसापेटा इलाके में बक्सा लोड करते समय हुआ।
స్క్రాప్ గోడౌన్‌లో భారీ పేలుడు, ఓ వ్యక్తి మృతి
హైదరాబాద్ : మూసాపేట్‌లో ఓ స్క్రాప్ గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. హెచ్‌పీ రోడ్‌లోని గోడౌన్‌లో ఆటోలో స్క్రాప్ లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. కాలు, చేతులు చిధ్రమయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కెమికల్స్ ఖాళీ డబ్బలను టాటా ఏస్ వాహనంలో లోడ్ చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు చెబుతున్నారు. కెమికల్స్ ఉన్న డబ్బ వాహనంపై నుండి కింద పడిపోవడంతో పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
పేలుడు సంభవించిన సమయంలో పరిసర ప్రాంతంలో చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు. పేలుడు సంభవించిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పేలుడు ఘటనలో ఒక వ్యక్తి రక్తపు మడుగు కూప్పకూలి కనిపించాడు. అతడి అర్తనాదాలు విన్న స్థానికులు ఏమీ చేయలేకపోయారు. దగ్గరకు వెళ్తే మళ్లీ పేలుడు జరుగుతుందోనన్న భయంతో కాసేపు దూరంగా ఉన్నారు.
మృతుడిని ముషీరాబాద్ బోలక్‌పూర్‌కు చెందిన మహమ్మద్ నజీర్‌కు (30)గా గుర్తించారు. నజీర్ తండ్రి ఇస్మాయిల్ స్క్రాప్ కొనుగోలు చేస్తుంటారు. ముసాపేట ప్రాంతంలో డబ్బలను లోడ్ చేస్తుండగా క్రింద పడిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు సనత్‌నగర్ ఎస్‌ఐ చంద్రయ్య తెలిపారు. (ఏజెన్సీలు)