विश्वासघात: सात करोड़ मूल्य के आभूषण लेकर ड्राइवर फरार, पुलिस खंगाल रही है सीसीटीवी फुटेज

हैदराबाद: एक प्रबुद्ध ने विश्वासघात किया। वफ़ादार की तरह रहते-रहते मालकिन को ही डुबो दिया। हजारों नहीं, लाखों नहीं, सात करोड़ रुपये के सोने के गहने लेकर फरार हो गया। मिली जानकारी के अनुसार, माधापुर के मायहोम भुजा अपार्टमेंट में रह रही राधिका गहनों का कारोबार करती हैं। राजमंड्री निवासी श्रीनिवास दो महीने पहले राधिका के पास ड्राइवर के रूप में ज्वाइन हुआ। ईमानदारी से काम करते हुए कुछ ही दिनों में घर के एक सदस्य की तरह घुल मिल गया।

इसी क्रम में भुजा अपार्टमेंट में रह रही अनुषा ने राधिका के पास 50 लाख रुपये की ज्वैलरी ऑर्डर की। अनुषा शुक्रवार की शाम को किसी शुभ कार्य के सिलसिले में अपने रिश्तेदार के घर मथुरानगर गई थी। लेकिन अनुषा ने राधिका से उनके द्वारा ऑर्डर किए गए आभूषणों को मथुरानगर भेजने सुझाव दिया। इसलिए राधिका ने ड्राइवर श्रीनिवास और सेल्समैन अक्षय के साथ आभूषणों को अपनी कार में मथुरानगर भेज दी। मथुरानगर पहुंचने के बा ड्राइवर श्रीनिवास कार में ही रह गया और अक्षय उनके घर में गया और अनुषा को गहने देकर लौट आया।

अक्षय बाहर आकर देखा तो श्रीनिवास और कार दिखाई नहीं दी। उसने श्रीनिवास को कॉल किया, लेकिन कोई जवाब नहीं आया। पता चला है कि कार में सात करोड़ रुपये के हीरे के आभूषण थे। यह आभूषण सिरिगिरिराज जेम्स एंड ज्वैलर्स को देना था। चिंतित अक्षय ने तुरंत राधिका को सूचित किया और घटित घटना के बारे में बताया। राधिका ने एसआर नगर थाने में शिकायत दर्ज कराई कि चालक श्रीनिवास सोने के गहने और कार लेकर फरार हो गया।

पुलिस वहां लगे सीसीटीवी फुटेज के आधार पर जांच कर रही है। पुलिस ने श्रीनिवास की तलाश के लिए सात टीमें गठित की हैं। माधापुर से मथुरानगर का रूट मैप के आधार पर कार के निकास व प्रवेश और कहां भाग गया इस बारे में पूछताछ कर रही है।

క్రైం న్యూస్: నమ్మకద్రోహం, ఏడు కోట్ల నగలతో డ్రైవర్ పరారీ

హైదరాబాద్ : అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టాడో ప్రబుద్ధుడు. నమ్మకంగా ఉంటూనే.. యజమానిని నట్టేటా ముంచాడు. వేలు, లక్షలు కాదు ఏకంగా రూ. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి రాధిక వద్ద రెండు నెలల క్రితం డ్రైవర్‌గా కుదిరాడు. నమ్మకంగా పనిచేస్తూ కొద్దిరోజుల్లోనే.. ఇంట్లో మనిషిలా కలిసిపోయాడు.

అయితే భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న అనూష రూ.50 లక్షల విలువచేసే ఆభరణాలను రాధిక వద్ద ఆర్డర్ చేశారు. అనూష ఓ శుభకార్యం నిమిత్తం శుక్రవారం సాయంత్రం మధురానగర్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే తాను ఆర్డరు చేసిన నగలను అక్కడికే పంపమని అనూష రాధికను కోరింది. దీంతో రాధిక తన కారులో డ్రైవర్‌ శ్రీనివాస్‌, సేల్స్‌మెన్‌ అక్షయ్‌లతో నగలను పంపించారు. మధురానగర్‌కు చేరుకున్నాక డ్రైవర్‌ శ్రీనివాస్ కారులోనే ఉండగా.. అక్షయ్‌ ఇంట్లోకి వెళ్లి నగలను అనూషకు ఇచ్చి వెనుదిరిగి వచ్చాడు.

బయటకు వచ్చి చూడగా కారుతో పాటు శ్రీనివాస్ కనిపంచలేదు. అతడికి కాల్ చేసినా స్పందన లేదు. అయితే కారులో సిరిగిరిరాజ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెల్లర్స్‌కు తిరిగి ఇవ్వాల్సిన రూ.7 కోట్ల వజ్రాభరణాలు ఉన్నాయి. ఆందోళనకు గురైన అక్షయ్ వెంటనే విషయాన్ని రాధికకు తెలియజేశాడు. బంగారు ఆభరణాలు, కారుతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ పారిపోయాడంటూ రాధిక ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారం గా చేసుకుని దర్యాప్తు కొనగిస్తున్నారు. ప్రత్యేకంగా ఏడు బృందాలను రంగంలోకి దించిన పోలీసులు శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాదాపూర్ నుంచి మధురా నగర్ రూట్ మ్యాప్, కారు ఎగ్జిట్ మరియు ఎంట్రీ, ఎట్నుంచి ఎస్కేప్ అయ్యాడనే దానిపై ఆరా తీస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X