हैदराबाद: भाजपा प्रदेश अध्यक्ष व सांसद बंदी संजय कुमार ने जनम गोसा-बीजेपी भरोसा सभा को संबोधित किया। इसकी खास बातें…
भाजपा सत्ता में आई तो हम नये सचिवालय के मकबरों (गुंबद) को ढहा देंगे। हम तेलंगाना में निजाम की विरासत संस्कृति को नष्ट कर देंगे। हम निजाम की विरासत के दाग मिटा देंगे। हम भारतीय और तेलंगाना संस्कृति को बढ़ावा देने के लिए सचिवालय में बदलाव करेंगे।
హైదరాబాద్ : జనం గోస – బీజేపీ భరోసాలో భాగంగా కూకుట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినిపల్లి లో 77, 78,79 వార్డుల పరిధతిలో ప్రారంభమైన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు.
అందులోని ముఖ్యాంశాలు…
• బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయ టూంబ్స్ (గుమ్మటాలు)ను కూల్చేస్తాం.
• తెలంగాణలో నిజాం వారసత్వ సంస్క్రుతిని ధ్వంసం చేస్తాం. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తాం.
• భారతీయ, తెలంగాణ సంస్క్రతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తాం.
• ప్రగతి భవన్ ను ప్రజా దర్భార్ లా మారుస్తాం.
• తెలంగాణలో నిజాం వారసత్వ మరకలను సమూలంగా తూడిచివేస్తాం.
• ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే సచివాలయాన్ని తాజ్ మహల్ లాంటి సమాధిలా మార్చారు.
• రోడ్డు కు అడ్డం ఉంటే మసీదులు, మందిరాలు కులుస్తామన్న కేసీఆర్. దమ్ముంటే పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చండి.
• అసెంబ్లీ లో బీఆర్ఎస్, ఎంఐం కలిసి నాటకం ఆడుతున్నాయి.
• కూకట్ పల్లి లో పేదల భూములను కబ్జా చేశారు. వారి పైన కేసులు పెడుతున్నారు.
• రాష్ట్రంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడతాం.
• ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ కి పట్టం కడుతున్నారు ప్రజలు.
• బీఆర్ఎస్ మూర్ఖత్వ పాలనను ప్రజలకు వివరించేందుకు ఈ మీటింగ్ లు.
• మోదీ పాలనా విజయాలను వివరిస్తాం.
• సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారు.
• ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు.
• ఈ రోజుకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదు.
• రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్ నుండే వస్తోంది. హైదరాబాద్ ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలి.
• దుర్మార్గులు, దుష్టులు ఇద్దరు ఏకమై బీజేపీ కి మేయర్ పదవి రాకుండా చేశారు.
• మూతపడ్డ ఫైనాన్స్ దుకాణానికి కొత్త పేరు పెట్టి తెరిచినట్లుగా బీఆర్ఎస్ వ్యవహారం.
• కెసిఆర్ ఎక్కడి కి వెళ్ళిన అబద్ధాలు చెబుతున్నారు.
• మోదీ ప్రభుత్వం 3 కోట్ల ఇండ్లు ఇచ్చింది. కేసీఆర్ ఎంత మందికి డబల్ బెడ్రూం లు ఇచ్చారో చెప్పాలి.
• అన్ని ఛార్జ్ లను పెంచిన కేసీఆర్ భూములు కబ్జాతో వేల కోట్లు సంపాదిస్తున్నారు.
• వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.