हैदराबाद: मे[डारम पदयात्रा के तहत टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी मुलुगु पहुंचे। इस दौरान मुलुगु घट्टम्मा मंदिर में कांग्रेस नेताओं और कार्यकर्ताओं का जोरदार स्वागत किया गया। रेवंत रेड्डी ने घट्टम्मा मंदिर में विशेष पूजा की।
హైదరాబాద్ : మేడారం పాదయాత్ర లో భాగంగా ములుగు కు చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ములుగు ఘట్టమ్మ దేవాలయం వద్ద ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఘట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక.పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి
हैदराबाद: कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी द्वारा की गई भारत जोड़ो पदयात्रा की निरंतरता को जारी करते हुए टीपीसीसी द्वारा हाथ से हाथ जोड़ो अभियान यात्रा आज से शुरू की जा रही है। इसके तहत टीपीसीसी प्रमुख रेवंत रेड्डी आज से पदयात्रा करेंगे। पदयात्रा के लिए घर से निकल रहे रेवंत रेड्डी को बेटी नैमिषा ने आरती दी। इससे जुड़ी तस्वीरें सोशल मीडिया पर वायरल हो गई हैं।
హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా నేటి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్న రేవంత్ రెడ్డికి కూతురు నైమిష హారతి ఇచ్చారు.
తన కూతురు హారతి ఇచ్చిన వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ రేవంత్ ఎమోషనల్ అయ్యారు. “నా ప్రజాప్రస్థానంలో “యాత్ర” కీలక ఘట్టం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. ప్రజల ఆశీర్వాదంతో నాయకుడుగా ఎదిగాను. ప్రశ్నించే గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. నన్ను నాయకుడ్ని చేసిన ప్రజల కోసం… వారి జీవితాల్లో మార్పు కోసం…“యాత్ర” గా వస్తున్నా.” అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఏఐసీసీ పిలుపు మేరకు భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమంలో పాల్గొనెందుకు మేడారం సమ్మక్క సారాలమ్మ వన దేవతల ఆశీర్వాదం కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఘట్కేసర్ చేరుకున్న రేవంత్ రెడ్డి.. భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు… రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు… భారీ పూల మాలలతో రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికిన నాయకులు.
మేడారం నుంచి.పాదయాత్ర ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నుంచి బయలుదేరి ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దె వద్దకు రేవంత్ చేరుకోనున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడారం నుంచి రేవంత్ పాదయాత్రను స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ నేతలు రేవంత్ పాదయాత్రకు భారీగా ఏర్పాటు చేశారు. భారీగా శ్రేణులు మేడారంకు చేరుకున్నారు. (ఏజెన్సీలు)