చారిత్రక పర్వతగిరి శివాలయంలో రెండో రోజు పున:ప్రతిష్ట పూజలు
మహా లింగార్చన, పంచామృత అభిషేకంలో పాల్గొన్న మంత్రి దయాకర్ రావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు
పర్వతగిరి: చారిత్రక ప్రాశస్త్యంతో.. నాటి కాకతీయుల కళా వైభవ వారసత్వంతో విలసిల్లన వరంగల్, పర్వతగిరి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగ్రామం, జన్మస్థానం తెలంగాణ ప్రభుత్వంలో పున: వైభవాన్ని సంతరించుకుంటోంది.
గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలమైన తెలంగాణ ప్రాంతం, సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురికాగా…తెలంగాణ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సంప్రదాయాలు, చరిత్ర, కళలు, కట్టడాలు మళ్లీ వికసిస్తున్నాయి. భావితరాలకు వారసత్వ విలువలను తెలియజేస్తున్నాయి.
ఈ కోవలోనే వరంగల్ జిల్లా, పర్వతగిరిలో 800 ఏళ్లనాటి పర్వతాల శివాలయం స్థానిక ఎర్రబెల్లి రామ్మోహన్ రావుగారి చొరవతో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుగారి ప్రోత్సాహంతో పున: ప్రతిష్ట చేసుకుంటోంది.
పర్వతాల మధ్య కొలువైన శివయ్యకు నేడు పున:ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పూజలు నేటి వేకువజామునే ప్రారంభం అయ్యాయి. ఈరోజు ఉదయం మహాలింగార్చన, పంచామృత అభిషేక కార్యక్రమాలతో, పవిత్ర శివనామస్మరణతో పర్వతగిరి పరిసరాలన్నీ మంత్రజపాలతో పునీతం అయ్యాయి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్, మంత్రి సతీమణి శ్రీమతి ఉషా దయాకర్ రావుగారు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు మహాలింగార్చన, పంచామృత అభిషేకాల్లో పాల్గొని శివార్చన చేస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు మేలుకొలుపుతో ప్రారంభమైన పరమేశ్వరుని పూజలు రాత్రి 8 గంటలకు ధాన్యాదివాసంతో ముగుస్తాయి.
రేపు 28వ తేదీ ఉదయం మళ్లీ మేలుకొలుపుతో ప్రారంభమయ్యే పరమశివుని పూజా కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావుగారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.