Hyderabad:
11వ రోజు దిగ్విజయంగా ముగిసిన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
ఈరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర కొనసాగిన బండి సంజయ్ పాదయాత్ర
ఈరోజు రాత్రికి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వేంపేట గ్రామ శివారులో బస చేయనున్న బండి సంజయ్
Breaking
“బిజెపి కార్నర్ మీటింగ్ @ వేంపేట్ గ్రామం”
బండి సంజయ్, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ:
గుజరాత్ లో మళ్లీ మోడీ ప్రభుత్వమే వచ్చింది
వరుసగా ఏడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది
గుజరాత్ ఫలితంతో కేసీఆర్ కు దిమ్మతిరిగింది
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందరికీ వచ్చాయా?
మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా?
ఈ ప్రాంతానికి చెందిన స్రవంతి అనే అమ్మాయికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం(SBI) వచ్చింది
తెలంగాణకు 2 లక్షల 40 వేల ఇండ్లను ప్రధాని మోదీ మంజూరు చేస్తే… కేసీఆర్ ఎన్ని ఇండ్లను కట్టించాడు?
కేసీఆర్ మాత్రం 8 నెలల్లో 100 రూముల ఇంటిని కట్టుకున్నాడు
ఈ తెలంగాణలో కేసీఆర్ 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా?
తెలంగాణకు పట్టిన పెద్ద శని కేసీఆర్
ఇప్పటికే కేసీఆర్ నాలుగు పెగ్గులు వేసి ఉంటాడు
కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నాడా?
కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నాడంటే… నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ విసిరా…
24 గంటల కరెంటు ఇవ్వడం లేదని నేను నిరూపిస్తే… కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడా?
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్… తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు
దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?
ఈ ఎనిమిదేళ్ల కాలంలో పంట నష్టం కింద, ఏ ఒక్క రైతు కుటుంబానికైనా కేసీఆర్ పైసలు ఇచ్చాడా?
జీతాలు ఇచ్చేందుకు పైసలు లేవంటాడు
కేసీఆర్ బిడ్డ కవిత లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది
ఒక మహిళ దేశ రాజధాని లో దొంగ సారా దందా చేస్తే… పరువు ఉంటుందా? పోతుందా? మీరే ఆలోచించండి
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని కేసీఆర్ ఎందుకు తెరిపించడం లేదు?
రూ.250 కోట్లు పెట్టి, షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించడానికి పైసలు లేవంటాడు.. తన బిడ్డ కవిత మాత్రం దొంగ సారా దందా చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలంటే కేసీఆర్ పర్మిషన్ ఉండాలి
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మాది
రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ మూతపడితే… 6000 కోట్ల రూపాయలతో మోదీ ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించారు
అలాంటిది 250 కోట్ల రూపాయలను పెట్టి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేమా?
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా.. కేంద్రం ఇస్తున్న నిధులతోనే
తెలంగాణ ద్రోహి కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేసిండు
ఖమ్మం, ఢిల్లీలో దొంగ దీక్ష చేసిండు
దొంగ దీక్ష చేసి, సినిమాలో వేణుమాధవ్ లా మందు తాగినోడు కేసీఆర్
ఢిల్లీలో 48 గంటల దీక్ష పేరుతో… దొంగ దీక్ష చేసి, మందు తాగిండు
బాత్రూంలోనూ మందు తాగిన చరిత్ర కేసీఆర్ ది
చావు నోట్లో కేసీఆర్ తలకాయ పెట్టలేదు… మందు సీసా నోట్లో తలకాయ పెట్టిండు
ఇక్కడ ఏం పీకలేనోడు, దేశ రాజకీయాలంటూ ఏదో పీకుతాడా?
నేను చెప్పే లెక్కలు తప్పయితే, నాపై కేసులు పెట్టుకోండి
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే… ఉచిత విద్య, వైద్యం అందిస్తాం
నిలువు నీడలేని పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం
‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
పంజాబ్ లో కేసీఆర్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి
ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా…..?
తెలంగాణలో పేదల రాజ్యం రావాలి
ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నదే మీకోసమే
కాలాలకతీతంగా సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నా…
ఎన్నికలప్పుడు ఓట్ల కోసం, టిఆర్ఎస్ వాళ్లు వస్తారు
ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కోసం రాలేదు
ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి
తెలంగాణలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం
“ముత్యంపేటలో బిజెపి సెలబ్రేషన్స్”
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విక్టరీ కొట్టిన భారతీయ జనతా పార్టీ
గుజరాత్ లో బిజెపి గెలుపును పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట గ్రామంలో సంబురాలు జరుపుకున్న తెలంగాణ బిజెపి శ్రేణులు
సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ బిజెపి రథసారధి బండి సంజయ్, పాదయాత్ర ప్రముఖ్ డా గంగిడి మనోహర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు
బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్న బిజెపి శ్రేణులు
నృత్యాలతో తమ ఆనందాన్ని పంచుకున్న పలువురు నేతలు, కార్యకర్తలు
గుజరాత్ లో వరుసగా ఏడవసారి విజయ డంఖా మోగించిన బిజెపి
మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను, 156 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి
గుజరాత్ లో బిజెపి విజయం మోడీ ఇమేజ్ కి, నీతివంతమైన పాలనకు నిదర్శనం – బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ప్రత్యర్ధులు గుజరాత్ కు డబ్బుల సంచులు పంపి, బీజేపీని ఓడించాలని చూశారు- బండి సంజయ్
గుజరాత్ లో ప్రజల తీర్పు, కేసీఆర్ కు చెంప పెట్టు- బండి సంజయ్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరేస్తాం- బండి సంజయ్
అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదు- బండి సంజయ్
BREAKING
బండి సంజయ్, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ కామెంట్స్ @ ముత్యంపేట గ్రామం:
ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీని కెసిఆర్ తెరిపించడం లేదు
600 మంది రెగ్యులర్, 2000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తుంటే… వారి పొట్ట కొట్టిండ్రు
షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించడానికి కెసిఆర్ కు పైసలు ఉండవు
కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి
రూ. 250 కోట్లు పెడితే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరవచ్చు
ధర్మపురి అరవింద్ నాకు ఫోన్ చేశారు… ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించలేనని, నాకు చేతకాదు అని కేసీఆర్ రాసిస్తే… మనం మోడీకి చెప్పి ఆ ఫ్యాక్టరీని తెరిపిద్దామని
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మూసేస్తే… రూ 6 వేల కోట్లు పెట్టి, ప్రధాని మోదీ దాన్ని పునరుద్ధరించారు
కేసీఆర్ అనుమతిస్తే తప్ప, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేము
రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు
5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు
ప్రతి ఒక్కరి నెత్తిపై, లక్ష ఇరవై వేల అప్పు పెట్టిండు
రాష్ట్రాన్ని దివానా తీసి, ప్రజల చేతికి చిప్పనిచ్చిండు
కేసీఆర్ లెక్క మాటలు చెప్పం. చేతల్లోనే మా పనేంటో చూపిస్తాం
షుగర్ ఫ్యాక్టరీ మూతపడినప్పటినుంచి ముత్యంపేట కల తప్పింది
BREAKING
“దళితుడింటికి దళపతి”
ముత్యంపేటలో బీజేపీ దళిత కార్యకర్త దామ రాజేశ్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్
దళిత కార్యకర్త దామ రాజేశ్ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్
అనంతరం చాయ్ తాగిన బండి సంజయ్
రాజేశ్ కుటుంబ సభ్యులు సహా ముత్యంపేట గ్రామస్తులు చూపిన ప్రేమకు ముగ్దుడైన బండి సంజయ్
ఇంత ప్రేమను నాపై చూపిస్తున్న కార్యకర్తలు, వారి తల్లిదండ్రులు, ప్రజల రుణాన్ని…. నేనెప్పటికీ తీర్చుకోలేనన్న బండి సంజయ్
మీకు సేవ చేసే భాగ్యం నాకు కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధించిన బండి సంజయ్
అనంతరం పాదయాత్రగా ముందుకు సాగిన బండి సంజయ్
BREAKING
• కోరుట్ల నియోజకవర్గంలోని హుస్సేన్ నగర్ లో బండి సంజయ్ ను కలిసిన వడ్డెర కూలీలు
• తాము రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా రూ.500లు కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోయిన వడ్డెర
• ఇలాగైతే తాము బతికేదెలా? అని వాపోయిన కూలీలు
• బాధపడకండి… మీకు అండగా ఉంటాం… బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని హామీనిచ్చిన బండి సంజయ్
BREAKING
11వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
ముత్యంపేట గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు
ప్రజలకు అభివాదం చేస్తూ… పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్
• మరి కొద్దిసేపట్లో ముత్యంపేటలో బీజేపీ దళిత కార్యకర్త దామ రాజేశ్ నివాసానికి వెళ్లనున్న బండి సంజయ్
• దళిత కార్యకర్త దామ రాజేశ్ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకోనున్న బండి సంజయ్
• మరి కొద్దిసేపట్లో ముత్యంపేటలో బీజేపీ దళిత కార్యకర్త దామ రాజేశ్ నివాసానికి వెళ్లనున్న బండి సంజయ్
• దళిత కార్యకర్త దామ రాజేశ్ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకోనున్న బండి సంజయ్
లంచ్ విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. బండి సంజయ్ తో కలిసి పాదయాత్రలో నడుస్తున్న వేలాదిగా తరలివచ్చిన బిజెపి శ్రేణులు. ప్రజా సమస్యల పరిష్కారానికై, మొద్దు నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్. కాసేపట్లో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర.
• రాఘవపేటలో చెరుకుతోటను సందర్శించి చెరుక గడలను కట్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
బండి సంజయ్, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ కామెంట్స్ @ రాఘవపేట గ్రామం
గుజరాత్ లో మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు
డబుల్ ఇంజన్ సర్కార్ వలన ఎటువంటి అభివృద్ధి ఫలితం వస్తుందో చూశాం
ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నది బిజెపి నినాదం
చిన్న రాష్ట్రాలతోనే దేశ అభివృద్ధి అని బిజెపి నమ్మింది
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు, బిజెపి మద్దతు ఇచ్చినందుకే… నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
తెలంగాణ రాష్ట్రాన్ని ఐల్5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిండు
కెసిఆర్ బిడ్డ కవిత లక్ష కోట్ల లిక్కర్ దందా చేసింది
తెలంగాణలో నీతివంతమైన, పారదర్శక పాలన రావాలంటే అది బీజేపీతోనే సాధ్యం
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బిజెపి అధికారంలోకి రావాల్సిందే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్…
కవిత లిక్కర్ స్కామ్ పక్కకు పోయేందుకు, వైసిపి నాయకులతో కలిసి కుట్ర చేస్తుండు కేసీఆర్
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి డ్రామాలు ఆడుతున్నారు
కమీషన్ల ఒప్పందంతో… స్కామ్ ల విషయం పక్కకు పోయేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని రాఘవపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బండి సంజయ్
అనంతరం రాఘవపేట గ్రామ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్
బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
కెసిఆర్ సంగతేందో మీకు చెప్పాల్నా… వద్దా?
నేటితో 5వ విడత పాదయాత్ర ప్రారంభమై 11వ రోజుకు చేరుకుంది
ఇప్పటివరకు 51 నియోజకవర్గాలను పూర్తి చేసుకున్నాం
ఎక్కడికి వెళ్ళినా… ప్రజలు ఎంతో అభిమానంతో… పూలు జల్లి, సన్మానిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు
వంద రోజుల్లో ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరవాలా..? వద్దా?
కెసిఆర్ బిడ్డ కవిత లక్ష కోట్లు పెట్టి, సారా దందా చేసింది
క్యాసినో, సారా దందాలు కవితవే
దొంగ దందాలు చేయడానికి లక్ష కోట్లు పెడతారు, కానీ 250 కోట్లు పెట్టి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేరా?
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తినిపించే బాధ్యత మాది. పక్కా తెరిపిస్తాం
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే చేతకాదు నాకు అని కేసీఆర్ రాసి ఇవ్వాలి
ప్రధాని మోదీని కలిసి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మాది
దేవుడికే శఠగోపం పెట్టినోడు కేసీఆర్
వేములవాడ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు అన్నాడు. ఒక్క పైసా ఇవ్వలేదు
బాసర ఆలయ అభివృద్ధికి 120 కోట్ల రూపాయలని, ఒక్క పైసా ఇవ్వలేదు
ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్లు అని అంటున్నాడు
అక్కడ బిడ్డ జాగ కొన్నది కాబట్టే… 100 కోట్లని అంటున్నాడు
ఇవాళ కరీంనగర్లో కేసీఆర్ బంధువు పెండ్లి కోసమే… నిన్న జగిత్యాలకు వచ్చిండు
ధర్మపురి గోదావరి పుష్కరాలప్పుడు ఏమైనా వసతులు కల్పించాడా?
రాఘవపేటలో 24 గంటల ఉచిత కరెంటు వస్తుందా?
లిక్కర్ దందా… దొంగ దందా చేసిన కేసీఆర్ బిడ్డను, పట్టకపోవాల్నా వద్దా?
సారా దందా చేసిన కవితను అరెస్టు చేస్తే… రాఘవపేట ప్రజలు ధర్నా చేయాల్నా?
కెసిఆర్ దగ్గినా… తుమ్మినా తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటాడు
తెలంగాణకు నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్
కెసిఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం నిజమని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా
రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని నేను నిరూపిస్తే… కెసిఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడా?
కెసిఆర్ లెక్క, కెసిఆర్ బిడ్డలా లంగ దందాలు, దొంగ దందాలు చేసి జైలుకు పోలేదు నేను
ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లిన
ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే… కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నాం
భాషలో నాకు కేసీఆరే గురువు
గురుదక్షిణ తీర్చుకుంటున్నాను
డిస్కంలు 60 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి
ప్రభుత్వ కార్యాలయాల నుంచి డిస్కంలకు 18 వేల కోట్ల రూపాయల బకాయి ఉంది
5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు
కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డుల జాడ ఏది?
ప్రజలకు నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రి కేసీఆరే
తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసింది పేదోళ్లు.. బలిదానమైంది పేదోళ్లు
కెసిఆర్ కుటుంబం తెలంగాణ కోసం ఏం త్యాగం చేయలేదు?
పేదోళ్ల ఆత్మబలి దానాలతో ఏర్పడ్డ తెలంగాణలో… పెద్దోడు రాజ్యమేలుతున్నాడు
పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా జనమే జనం
కెసిఆర్ కు రెస్ట్ ఇవ్వాలి.. మరోసారి అవకాశం ఇవ్వకండి
మన బతుకులు బాగుపడాలంటే… భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి
మనకి నిధులు, నియామకాలు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే.. మోడీ లాంటి నాయకత్వం కావాలి
ఒక్క నెలలో రోజ్గార్ మేలా పేరుతో కేంద్ర ప్రభుత్వం లక్షా 46 వేల ఉద్యోగాలను ఇచ్చింది
ఇక్కడ ఒక్కరికైనా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా?
పోడు భూముల సమస్యను పరిష్కరించాడా?
రైతుబంధు, దళితులకు మూడెకరాలు, దళిత బంధు ఎంతమందికి ఇచ్చాడు?
ప్రజాస్వామ్య తెలంగాణనే మా లక్ష్యం
తెలంగాణలో రామరాజ్యం కావాలి.. రజాకారుల రాజ్యం పోవాలి
ఖాసిం చంద్రశేఖర్ రజ్వి పాలనకు చరమగీతం పాడాలి
కెసిఆర్ కు కింద మీటర్ పెట్టినం కాబట్టే, కేసీఆర్ బిడ్డ కవిత బండారం బయటపడింది
మోడీ పేరు చెప్పి కేసీఆర్ మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నడు
కెసిఆర్ మోటార్లకు మీటర్లు పెడితే… నిన్ను గుంజుకొచ్చుడు ఖాయం
మోటర్లకు మీటర్లు పెట్టమని ఎవడు చెప్పలే
తెలంగాణ రాజ్యాన్ని మేము పాలిస్తాం
తెలంగాణలో రైతు రాజ్యం రావాలి… రామరాజ్యం రావాలి
గుజరాత్ ఎన్నికల్లో రాఘవపేట గ్రామంలో బాణాసంచా కాల్చి విజయోత్సవాలు చేసుకోనున్న బీజేపీ కార్యకర్తలు. విజయోత్సవాల్లో పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.
11వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని రాఘవపేట గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
రాఘవపేట గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు
రాఘవపేట గ్రామంలో గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో… బండి సంజయ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలకు ఏర్పాట్లు చేసిన బీజేపీ శ్రేణులు
కాసేపట్లో.. కార్యకర్తలతో కలిసి, బీజేపీ సంబురాల్లో పాల్గొననున్న బండి సంజయ్.
BREAKING
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని నడికుడ గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. నడికుడ గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు. పాదయాత్రలో నడుస్తున్న బండి సంజయ్ తో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్న యువత. పాదయాత్రలో భాగంగా… ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ… వారికి మేమున్నామనే భరోసా కల్పిస్తూ.. ముందుకు సాగుతున్న బండి సంజయ్.
BREAKING
“బిజెపి కార్నర్ మీటింగ్ @ మొగిలిపేట”
బండి సంజయ్, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ
నిన్న కోతల రాయుడు జగిత్యాలకు వచ్చి, మొరిగి మొరిగి వెళ్ళాడు
ఇక మళ్లీ రాడు…
కొండగట్టు బస్సు ప్రమాదంలో 50 మంది పేదలు చచ్చిపోయారు… అయినా ఒక్కసారి కూడా కేసీఆర్ పరామర్శించలేదు….వారి కుంటుబాలను ఆదుకోలేదు
కొండగట్టు ఘటనలో ఒక్క ఇంట్లో ఆరుగురు చనిపోయారు… అయినా నేటికీ ఆ బాధిత కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదు
పెద్దపెద్దోళ్ళు చచ్చిపోతే… మంచి బట్టలు వేసుకుని, సెంటు కొట్టుకుని, బొకేలు పట్టుకుని వెళ్తాడు
కేసీఆర్ బిడ్డ కవిత, లక్ష కోట్లతో లిక్కర్ దందా చేసింది
100 రోజుల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న హామీ ఏమైంది?
పేదోళ్ల పాపం వట్టిగా పోదు… కేసీఆర్ బిడ్డ జైలుకు పోతది
250 కోట్లు పెట్టి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేడా?
లిక్కర్, క్యాసినో దందాలో కేసీఆర్ బిడ్డ పెట్టుబడులు పెట్టింది
ఏ దందాలు చూసినా… కేసీఆర్ బిడ్డ కవిత పేరే బయటికి వస్తోంది?
నాన్నకు తగ్గ బిడ్డ దొరికిందని కేసీఆర్ సంతోషపడుతుండు
కేసీఆర్ కి ఇష్టమైన లిక్కర్ దందానే బిడ్డ కవిత చేసింది…
లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డ కవితను అరెస్టు చేస్తే… మల్లాపూర్ మండలం ప్రజలు ధర్నా చేయాల్నా?
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవంటడు. లక్ష కోట్ల లిక్కర్ దందా చేయడానికి పైసలు ఎట్లా వచ్చాయి?
గల్ఫ్ కు పోయిన వాళ్లను ముండాకొడుకులని తిట్టిన మూర్ఖుడు కేసీఆర్
ఆ గల్ఫ్ కార్మికులు పంపిన డబ్బులతోనే ఉద్యమం చేసిండు
కేసీఆర్ కు సిగ్గుండాలి
నాకు తెలిసి ఈ సమయానికి కేసీఆర్ లేచి ఉండడు…
విదేశాల్లో మరణించిన వాళ్లను తీసుకొచ్చే విషయంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైంది.
బిజెపి ప్రభుత్వం వస్తే ప్రత్యేకమైన పాలసీని తీసుకొచ్చి, పేదల కుటుంబాన్ని ఆదుకుంటాం
తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిచ్చిండు
ఇప్పటికే 5 లక్షల కోట్ల అప్పు చేసిండు
షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం నాకు చేతకాదు అని కేసీఆర్ రాశిస్తే… మేము తెరిపిస్తాం
ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే… మోదీని రప్పించి, 250 కోట్ల రూపాయలను పెట్టించి, షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం
కొండగట్టు అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న కేసీఆర్ మాటలు వింటే నవ్వుస్తోంది.
వేములవాడ ఆలయానికి కేటాయించిన నిధులను డైవర్ట్ చేశాడు
బాసర ఆలయం అభివృద్ధికి 120 కోట్ల రూపాయలు ఇస్తానన్న కేసీఆర్… ఒక్క పైసా కూడా ఇవ్వలేదు
వేములవాడ, బాసర అభివృద్ధి చెందాలంటే… బినామీల పేర్ల మీద జాగాలు కొనాలి. అప్పుడే అభివృద్ధి చేస్తారు
కొండగట్టు కు ఘాట్ రోడ్డు వేయడానికి చేతకాని వీళ్లు, తెలంగాణను అభివృద్ధి చేస్తారా?
వర్షం వస్తే మల్లాపూర్ ప్రాంతం అంతా మునిగిపోతుంది
ఇక్కడ పంట నష్టపోయిన రైతులను కేసీఆర్ ఆదుకున్నాడా?
గంగాపురం బ్రిడ్జి కట్టాడా?
కరెంటు మోటార్లకు మీటర్లని కేసీఆర్ అంటున్నాడు.. కేసీఆర్ కు మీటర్లు పెట్టండి
త్వరలోనే కేటీఆర్, హరీష్ రావుల బండారం ఏంటో ప్రజలకు తెలుస్తుంది
ఇక్కడ 24 గంటలు ఉచిత కరెంటు వస్తుందా?
చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ… కేసీఆర్ మాటలకు కోతలు ఎక్కువ
డిస్కంలు 60 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి
ప్రభుత్వ కార్యాలయాల నుంచి డిస్కంలకు బాకీ ఉన్న 18 వేల కోట్ల రూపాయలను ఇప్పటివరకు చెల్లించలేదు
పాతబస్తీలో 1000 కోట్ల కరెంట్ బిల్లులను వసూలు చేసే దమ్ము లేదు… వసూలు చేయరు
కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, ఇంటి పన్ను, ఆస్తి పన్ను పెంచారు
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా… కేంద్రం ఇస్తున్న నిధులతోనే
*పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యంలోనూ… రూ. 29 ఇస్తున్నది మోడీ ప్రభుత్వమే
మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నది కేంద్రమే
‘ఉపాధి హామీ పథకం’ కింద పేదలకు కూలి పని దినాలను కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే
తెలంగాణకు రెండు లక్షల 40,000 ఇండ్లను మోడీ మంజూరు చేస్తే… కేసీఆర్ ఇక్కడ ఎన్ని ఇండ్లు కట్టించాడు?
కేసీఆర్ మాత్రం 8 నెలల్లో 100 రూములతో ఇంటిని కట్టుకున్నాడు
ఫామ్ హౌస్ కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు
సన్న వడ్లు, దొడ్డు వడ్లు అంటూ… రైతులను కేసీఆర్ ఆగం చేసిండు
వరి వేస్తే… ఉరే అన్నాడు
ధాన్యం సేకరణలో నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే… కేసీఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే
ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ను గుంజుకొస్తే ప్రగతిభవన్ కు వచ్చిండు. ఆ తర్వాత జగిత్యాలకు వచ్చిండు
రైతుబంధు పేరుతో ఉన్నవాళ్లకి ఇచ్చి, రైతులను మోసం చేస్తుండు
రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే
రైతుకు ఒక్క పంటపై ఒక్క ఎకరానికి 40 వేల రూపాయలను సబ్సిడీపై ఇస్తున్నది మోదీ ప్రభుత్వమే
స్థానిక సమస్యలు నెరవేరాలన్నా… ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలన్నా… బిజెపి అధికారంలోకి రావాల్సిందే
కనీస సౌకర్యాలు లేని అనాధ మండలంలా మల్లాపూర్ మారింది
మీరు బిజెపికి ఓటు వేయకున్నా… మీకు ఎన్నో నిధులను కేటాయించింది భారతీయ జనతా పార్టీనే
తెల్లారి లేస్తే నా నిజామాబాద్ పార్లమెంటు అని అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే ప్రజలతో తిరుగుతూ ఉంటాడు
మేము ఎన్నికల కోసమో… ఓట్ల కోసమో ఇక్కడికి రాలేదు
మేక్ ఇన్ ఇండియా అని, చైనా బజార్లు వచ్చాయని కేసీఆర్ అంటున్నాడు… కేసీఆర్ కు సిగ్గుండాలి…
మైసూర్ పాక్ అంటే… మైసూర్ నుంచి వస్తదా?
ఇరానీ చాయ్ అంటే… ఇరాన్ నుంచి వస్తదా?
కేసీఆర్ వి అన్నీ, థర్డ్ క్లాస్ బుద్ధులే
రూ.6 వేల కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించుకుని రైతులను ఆదుకున్నాం
కేసీఆర్ కు మైండ్ దొబ్బింది, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు
ప్రజలే కేసీఆర్ కు గోల్మాల్ గోవిందమని పేరు పెట్టారు
మళ్లీ కేంద్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే… తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి వస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది.
నేను చెప్తున్న వివరాలు తప్పైతే… నాపైన కేసులు పెట్టుకోండి
కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలి
కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల నుంచి తరిమేయాలి
కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దండుకుని, విచ్చల విడిగా… విదేశాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు
ఎక్కడికి వెళ్ళినా… ప్రజలు “ప్రజా సంగ్రామ యాత్ర”కు బ్రహ్మరథం పడుతున్నారు
కేసీఆర్ పాలనలో… పేద పిల్లలు డాక్టర్లు కాలేని పరిస్థితి
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే… పేదలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం
నిలువ నీడ లేని పేదలకు పక్కా ఇల్లు కట్టించి ఇస్తాం
యువతకు యాక్సిడెంట్లు అయితే, తాగి పడ్డారని ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు
నిజా నిజాలు తెలుసుకోవాలి ఇష్టం వచ్చినట్టు బదనాం చేయొద్దు
యువత చదువుకోవడానికి కూడా వెళ్తారు
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే… ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేసి, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ఒక్కసారి బిజెపి కి అవకాశం ఇవ్వండి… తెలంగాణలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం
BREAKING
కరెంట్ మోటార్లకు కేంద్రం మీటర్లను ఏర్పాటు చేయబోతోందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘కేసీఆర్…. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా మోటార్లకు మీటర్లు పెట్టడం అసాధ్యం. కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదు. నేను సవాల్ చేస్తున్నా… మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ మీటర్లు పెడితే దానికి పూర్తి బాధ్యత తీసుకుంటా… మీటర్లు పెట్టకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతావా?’’ అంటూ సవాల్ విసిరారు. అవినీతిలో మునిగిపోయిన కేసీఆర్ కుటుంబానికే కేంద్రం మీటర్ పెట్టిందని…. అలాంటి అవినీతి పరులను బజారు కీడ్చి అంతుచూసేందుకు మోదీ సర్కార్ చర్యలు ప్రారంభించిందన్నారు. లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తున్న కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేయడం ఖాయమన్నారు. లక్ష కోట్లతో దొంగ దందాలు చేస్తున్న కేసీఆర్ కుటుంబానికి ముత్యం పేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రూ.250 కోట్లు కేటాయించేందుకు డబ్బుల్లేవనడం సిగ్గుచేటన్నారు. ‘‘కేసీఆర్… ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం నాకు చేతగాదని లేఖ రాసివ్వు. కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత నేను తీసుకుంటా’’ అని స్పష్టం చేశారు.
చైనా బజార్లలో వస్తువులన్నీ చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నామని కేసీఆర్ చెప్పడం సిగ్గు చేటన్నారు. ‘‘ కేసీఆర్ చెప్పింది ఎట్లుందంటే…. మైసూర్ పాక్, మైసూర్ బజ్జీలు… మైసూర్ నుండే తీసుకొస్తున్నట్లుగా ఉంది. ఇరానీ చాయ్… ఇరానీ నుండి తీసుకొస్తున్నట్లుగా ఉంది… సిగ్గుండాలే అబద్దాలాడటానికి. మోదీ ప్రభుత్వం తీసుకున్న మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా వేలాది పరిశ్రమలు వస్తున్నయ్. ఆయా స్థానిక పరిశ్రమల్లో తయారైన వస్తువులనే చైనా బజార్లలో అమ్ముతున్నారు. ఆ సోయి కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు’’ అని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడంతోపాటు ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తుంది. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తాం. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మెగిలిపేట గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయా అంశాలపై స్పందించారు. అంతకుముందు ఉదయం పాదయాత్ర శిబిరం మెగిలిపేట, ముత్యంపేట రైతులతో జరిగిన సమావేశంలోనూ బండి సంజయ్ ఆయా అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ప్రసంగం పాఠం వివరాలిలా….
మోటార్లకు మీటర్లు పెడితే నేనే బాధ్యత వహిస్తా
లేనిపక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే
కేసీఆర్… మీ కుటుంబ అవినీతికే మీటర్లు పెట్టినం… మీ సంగతి చూస్తాం
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు కేసీఆర్ సిద్ధమా?
రూ.60 వేల కోట్ల బకాయిలతో డిస్కంలను సంక్షోభంలోకి నెట్టిన సీఎం
కరెంట్ ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
చైనా బజార్లలో చైనా సరుకులున్నాయనడం పెద్ద జోక్…
మైసూర్ పాక్, మైసూర్ బజ్జీ, ఇరానీ చాయ్… అక్కడి నుండే వస్తున్నాయా?
మేకిన్ ఇండియా పేరుతో స్థానిక పరిశ్రమల నుండే చైనా బజార్లకు వస్తువులు
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే ఉరేసుకుంటానన్న ఎమ్మెల్యే ఎటుపోయిండు?
250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు డబ్బులివ్వరా?
లక్షకోట్లతో దొంగ సారా దందా చేస్తారా?
కేసీఆర్…. మీవల్ల కాకపోతే చేతగాదని రాసివ్వండి
కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానన్నహామీ ఏమైంది?
గల్ఫ్ బాధితుల శవాలను కూడా తీసుకురాలేని అసమర్థులు
ఎములాడ రాజన్న, బాసర సరస్వతి ఆలయాలకు వందల కోట్ల మంజూరు హామీ ఏమైంది?
మళ్లీ కొండగట్టు అంజన్న పేరుతో దేవుళ్లకే శఠగొపం పెడతున్న కేసీఆర్
సోమన్నగుట్టకు ఘాట్ రోడ్డు వేయడం చేతగాని సీఎం
ఈ మండలంలో 2 గ్రామాల దత్తత తీసుకుంటానన్న ఎమ్మెల్యే హామీ ఏమైంది?
బీడీ కార్మికుల బాధలెందుకు పట్టించుకోవు…పెన్షన్లకు కటాఫ్ డేట్ ఎత్తేయాల్సిందే…
గ్రామ పంచాయతీల అభివ్రుద్ధి కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివే
మొగిలిపేట ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
BREAKING
11వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మొగిలిపేట గ్రామంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట్ మీదుగా వేంపేట వరకు కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. వేంపేట సమీపంలో బండి సంజయ్ రాత్రి బస. ఈరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర.
• ప్రజా సంగ్రామ యాత్ర మొగలిపేట సమీపం నుండి ప్రారంభమైంది.
• కాసేపట్లో మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది.
BREAKING
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో నడుస్తున్న, వేలాదిగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు. పాదయాత్రలో భాగంగా… ప్రజలకు అభివాదం చేస్తూ, ముందుకు సాగుతున్న బండి సంజయ్. మొగిలిపేట గ్రామంలో అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల విగ్రహాలకు పూలమాల వేసి, నివాళి అర్పించిన బండి సంజయ్.