Hyderabad: వ్యవసాయ, భూ సంబంధిత సమస్యలపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరగనున్నాయి. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఈ నిరసన కార్యక్రమం కోసం అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులతో ఇంచార్జ్ లను టీపీసీసీ నియమించింది.
ఈ అంశాలపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల బృందం ఈనెల 21న రాష్ట్ర సీఎస్ ను సచివాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందించారు. 30న రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాలలో, డిసెంబర్ 5న జిల్లా కేంద్రాలలో ధర్నాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
TPCC
గురువారం మండల కేంద్రాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు..
భూమి, వ్యవసాయ సమస్యలపై.ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇవ్వనున్న కాంగ్రెస్..
జిల్లాలకు సీనియర్ నాయకులతో ఇంచార్జ్ లను నియమించిన టీపీసీసీ..
మండల రెవిన్యూ అధికారులకు వినతి పత్రాలు అందించనున్న కాంగ్రెస్ నేతలు…
ఈ విషయాలపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో టీపీసీసీ నాయకులు 21న సిఎస్ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చిన నాయకులు..
24న మండలాల్లో, 30న నియోజక వర్గ కేంద్రాలలో, డిసెంబర్ 5న జిల్లా కేంద్రాలలో ధర్నాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్..