हैदराबाद: TPCC की अनुशासनात्मक समिति ने पूर्व मंत्री और केंद्र सरकार के आपदा निवारण संगठन के पूर्व उपाध्यक्ष मर्री शशिधर रेड्डी को कांग्रेस पार्टी से 6 साल के लिए निष्कासित कर दिया।
इससे पहले कांग्रेस के वरिष्ठ नेता मर्रि शशिधर रेड्डी ने शनिवार को पार्टी बदलाव पर प्रतिक्रिया दी। उन्होंने घोषणा की कि पार्टी में उत्पन्न परिस्थितियों के कारण वह पार्टी बदल रहे है। मर्री शशिधर रेड्डी ने स्पष्ट किया कि उनके साथ कांग्रेस के कुछ अन्य नेता भी भाजपा में शामिल होंगे। शशिधर ने आरोप लगाया कि कांग्रेस पार्टी को कैंसर हो गया है और अब इसका इलाज नहीं है। ऐसी संभावना है कि शशिधर रेड्डी दो या तीन दिनों में कांग्रेस पार्टी से इस्तीफा दे देंगे। संभावना है कि वह जल्द ही दिल्ली में बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा की मौजूदगी में बीजेपी का अंगवस्त्र पहनेंगे।
मर्रि शशिधर रेड्डी ने रेवंत रेड्डी के व्यवहार पर कठोर टिप्पणी की। उन्होंने कहा, “रेवंत रेड्डी का व्यवहार अच्छा नहीं है। अगर कोई होमगार्ड पार्टी छोड़ देता है, तो खोने के लिए कुछ नहीं है। कांग्रेस टीआरएस का सामना करने की स्थिति में नहीं है। पार्टी को ‘चमचा’ लोगों के साथ चला रहे हैं। मैंने रेवंत रेड्डी को टीपीसीसी पद नहीं देने के लिए भी आलाकमान से कहा था। मुनुगोडु उपचुनाव में एक रुपया भी खर्च नहीं किया गया। मेरे जैसे कई नेता कांग्रेस पार्टी छोड़ने को तैयार है।ठ”
मर्री शशिधर रेड्डी ने कहा कि तेलंगाना की स्थिति के बारे में मैंने आलाकमान के ध्यान में ले गया, लेकिन इस पर ध्यान नहीं दिया गया। आरोप लगाया कि रेवंत के रवैये के कारण कांग्रेस तेलंगाना में अपनी प्रतिष्ठा खो रही है। मुनुगोडु और दुब्बाका उपचुनाव के परिणाम ही इसके साक्ष्य है। मर्रि ने अपने आधिकारिक ट्विटर प्रोफाइल से “हमेशा मैं कांग्रेस वादी हूं” शब्द हटा दिया है। आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री मर्रि चेन्ना रेड्डी के शशिधर रेड्डी के बेटे हैं। इससे पहले वह हैदराबाद के सनतनगर निर्वाचन क्षेत्र से विधायक के रूप में चार बार जीते।
तेलंगाना की राजनीतिक गलियारों में यह चर्चा जोरों पर है कि भाजपा प्रदेश अध्यक्ष बंडी संजय की पांचवें चरण की पदयात्रा इसी महीने की 28 तारीख से शुरू हो रही है। इस मौके पर अन्य दलों के नेताओं पार्टी में शामिल करने का मन बनाई है। एक प्रकार से दूसरे पार्टी के असंतुष्ट नेताओं को अपनी ओर खींच रही हैं। इस प्रकार ज्यादा से ज्यादा नेताओं को शामिल कर अगले चुनाव तक पार्टी को मजबूत करने की कोशिश कर रही है। इसके तहत बीजेपी ने पहले ही टीआरएस और कांग्रेस के कई वरिष्ठ नेताओं को पार्टी में शामिल कर लिया है। कुछ महीने पहले कोमाटिरेड्डी राजगोपाल रेड्डी को कांग्रेस से खींच लिया। और अब वरिष्ठ नेता मर्री शशिधर रेड्डी को भी पार्टी में शामिल होने वाले है।
మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
Hyderabad: మాజీ మంత్రి, కేంద్ర ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ.
మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు… అమిత్ షా ను కలిసిన తర్వాత బయటకు వచ్చి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పైన, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్ర ఉంది.. ఎంతో మంది వచ్చారు. పోయారు… అయినా పార్టీ నిలబడింది.. కాంగ్రెస్ పార్టీ కి కాన్సర్ వచ్చిందని మర్రి శశిధర్ రెడ్డి అనడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉంది. పార్టీ మారి బీజేపీ లో చేరాలని అనుకునే వారు, వారికి పోయే స్వేచ్ఛ ఉంది, కాని కాంగ్రెస్ ను నిందించే హక్కు లేదు. ఎవరు ఎలాంటి వారో ఏ పార్టీ ఎలాంటిదో భవిష్యత్ లో తేలిపోతుంది.
పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారుతున్నట్లు ఆయన ప్రకటించారు. తనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరుతారని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదని శశిధర్ ఆరోపించారు. మర్రి శశిధర్ రెడ్డి రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశముంది. త్వరలో ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశముంది.
రేవంత్ రెడ్డి తీరుపై మర్రి శశిధర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి వ్యవహారశైలి అసలు బాగాలేదు. ఒక హోం గార్డు పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. చెంచాగాళ్లతో పార్టీని నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వొద్దని నేను కూడా చెప్పా. మునుగోడులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నాలాగే చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడుతారు’ అని రేవంత్ తీరుపై శశిధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణలో పరిస్థితులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, రేవంత్ వైఖరితో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతోందని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు, దుబ్బాక ఫలితాలే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. తన అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్‌లో ఎప్పటికీ తాను కాంగ్రెస్ వాడిననే పదాన్ని మర్రి తొలగించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తనయుడే మర్రి శశిధర్ రెడ్డి. గతంలో హైదరాబాద్‌లోని సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు.
ఈ నెల 28 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చేరికలను ప్రోత్సహించి పాదయాత్రకు ఊపు తీసుకురావడంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవాలని కాషాయదళం చూస్తోంది. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలం వేస్తోంది. వీలైనంతమంది నేతలను పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని చూస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్ నేతలను బీజేపీ చేర్చుకుంది. కొద్దినెలల క్రితమే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని లాగేసుకోగా ఇప్పుడు ఆయన బాటలో మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా కమలం గూటికి చేరనున్నారు.